Thursday, December 19, 2024

ముకుందమాలా స్తోత్రం-8

 

అమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం
మేదశ్ఛేదఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని ।
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద-
ద్వంద్వామ్భోరుహసంస్మృతిర్విజయతే దేవః స నారాయణః ॥ ౨౫ ॥

ముకుందా ! నీ పాదస్మరణ  లేని

 పవిత్ర నామ  ఉచ్చారణ  అడవిలో  రోదన  వంటిది

వేదకార్యాల  నిర్వహణ  శారీరిక  శ్రమను  మాత్రమే  మిగుల్చును

యజ్ఞాయాగాదులు  బూడిదలో  నేయి  కలిపిన చందము

పుణ్యనది  స్నానం  గజస్నానం  వలె         నిష్ఫలము 

 కనుక  నారాయణా  నీకు  జయము  జయము



మదన పరిహర స్థితిం మదీయే
మనసి ముకుందపదారవిందధామ్ని ।
హరనయనకృశానునా కృశోఽసి
స్మరసి న చక్రపరాక్రమం మురారేః ॥ ౨౯ ॥



మురారి  పాదాలకు  పీటమైనట్టి   నా  మదిని  

మన్మధుడా ! వీడి  మరలి పొమ్ము

హరుని  కంటిచుపులో  కాలిపోయిన  నీకు

హరి  చక్రపు  మహోగ్ర  తీక్ష్ణత తెలియకున్నది



మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే
మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ ।
త్వద్భృత్యభృత్యపరిచారకభృత్యభృత్య-
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ ॥ ౨౭ ॥


ఓ  లోకనాధా  ! నీ  పాదదాసుల  యొక్క  సేవక  సమూహానికి
సేవకులైన  వారి  సేవకులకు  నన్ను   సేవకుడిగా  పుట్టించు
మధు  కైటభులను  నిర్జించిన  హరీ  ! నీ నుండి  నే కోరు వరము
నా  జీవితానికి అర్ధమొసగు ఫలము అదియే  సుమా

Wednesday, December 18, 2024

 పక్షుల కిలకిల సవ్వడులు సందడి చేయువేళ

లేగల అంబారావముల సంబరములు మిన్నంటు వేళ
తూరుపుకాంత నిదురమబ్బు చెదరగొడుతూ
ప్రసరించు బాలభానుని లేత ఎరుపు సిగ్గుమొగ్గలు
తాకి విప్పారిన నవకమల కన్యకలా

గోపికాలక్ష్మీ చేతి కంకణముల గలగలలతో సంగమించిన
చిలకబడు పెరుగు సుకారములు చేయు మధుర ధ్వనుల తరంగాలు చెవులు తాకగా నిదుర నెరుగని నంద నందనుడు నిదుర వీడి బుడి బుడి
అడుగులతో నడచివచ్చి కవ్వము పట్టి కలువ కనుల జాలువార్చిన ప్రేమ జల్లులు తాకి ఝల్లుమనే గోపికాలక్ష్మీహృదయం 
ఆ పులకింత నిత్యనూతనం కావాలను తలంపు మది నిండగా

Tuesday, December 17, 2024

ముకుందమాలా స్తోత్రం-7

 


హే మర్త్యాః పరమం హితం శ్రుణుత వో వక్ష్యామి సంక్షేపతః

సంసారార్ణవమాపదూర్మిబహులం సమ్యక్ ప్రవిశ్య స్థితాః ।

నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం-
మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః ॥ ౧౮ ॥


దురదృష్టమనే  అలలతో  కూడిన  సంసార సాగరంలో

అటునిటు  త్రోయబడుచున్న నరులార! 

 చిరుమాట  వినండి జ్ఞానఫలం  కోసం  నిష్ఫల యత్నాలు  

వీడి ఓం  నారాయణా  నామజపం  తో  ముకుందుని  పాదాల పై  

 మోకరిల్లండి


నాథే నః పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్ఠతి ।
యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో మూఢా వరాకా వయమ్ ॥ ౨౮ ॥


 ఎంత  అవివేకులము  సుమీ  !

పురుషోత్తముడు  ముల్లోకాలకు  అధిపతి

శ్వాసను  నియంత్రించిన  మాత్రాన  అధినుడగునట్టివాడు  

స్వయంగా  మన  చెంతకు  రానుండగా ,

 తనవన్ని  మనకు  పంచనుండగా

అధములైనట్టి  రాజులను  యజమానులను

అల్పమైన  కోర్కెల   కోసం  ఆశ్రయించుచున్నాము



బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః
కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణబాష్పాంబునా ।
నిత్యం త్వచ్చరణారవిందయుగళధ్యానామృతాస్వాదినాం
అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితమ్ ॥ ౨౦ ॥



ముకుళిత  హస్తాలతో  వినమ్రతతో  వంగిన  శిరస్సుతో

 రోమాంచిత  దేహంతో  గద్గద  స్వరంతో  కృష్ణ  నామాన్ని  

పదే  పదే స్మరిద్దాం  సజల  నేత్రాలతో  నారాయణుని  

వేడుకుందాం   ఓ  సరోజ పత్ర  నేత్రా  …..ఎర్ర  తామరలను  బోలిన  

నీ  పాదద్వయం  నుండి జాలువారు అమృతం  సేవించుచు మా జీవనం  కొనసాగించు  భాగ్యం  కలిగించు 

Monday, December 16, 2024

ముకుందమాలా స్తోత్రం-6



 హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే
హే కంసాంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ ।
హే రామానుజ హే జగత్త్రయగురో హే పుండరీకాక్ష మాం
హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా ॥ ౨౧ ॥

హే  గోపాలక  ,హే  కృపా జలనిదే ,హే  సింధు కన్యా పతే
హే  కంసాంతక  ,హే  గజేంద్ర  కరుణాపారీణా , హే  మాధవ
హే  రామానుజ  ,హే  జగత్త్రయ గురో  ,హే  పుండరీకాక్ష

హే  గోపీజన వల్లభా  నాకు  తెలుసు నీవు తక్క వేరెవ్వరు లేరు

కనుక ఎల్లప్పుడూ నన్ను రక్షించు



భక్తాపాయభుజంగగారుడమణిస్త్రైలోక్యరక్షామణిః
గోపీలోచనచాతకాంబుదమణిః సౌందర్యముద్రామణిః ।
యః కాంతామణిరుక్మిణీఘనకుచద్వంద్వైకభూషామణిః
శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణిః ॥ ౨౨ ॥

భక్తుల  అపాయాలనే సర్పాల పాలిట  గరుడమణి

ముల్లోకాలకు  రక్షామణి  

గోపికల కనులను ఆకర్షించు చాతకమణి

సౌందర్య  ముద్రామణి  

కాంతలలో  మణిపూస యగు రుక్మిణి  కి  భూషణ మణి

అగు దేవ శిఖామణి  గోపాలా !  మాకు  దోవ చూపు

 

శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్యమంత్రం
సంసారోత్తారమంత్రం సముచితతమసః సంఘనిర్యాణమంత్రమ్ ।
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగసందష్టసంత్రాణమంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్యమంత్రమ్ ॥ ౨౩ ॥

శత్రువులను  నిర్మూలించు మంత్రం
  ఉపనిషత్తులచే  కీర్తించబడిన మంత్రం


  సంసార భందాలను త్రెంచివేయు  మంత్రం
  అజ్ఞాన అంధకారం తొలగించు మంత్రం
  సకల ఐశ్వర్యాలు  ప్రసాదించు మంత్రం
  ఈతి బాధలనే  పాముకాట్లనుండి  రక్షించు మంత్రం
  ఓ  నాలుకా  ! పదే  పదే  జపించు  జన్మసాఫల్యత నొసగు   
  మంత్రం  శ్రీకృష్ణ మంత్రం

Sunday, December 15, 2024

ముకుందమాలా స్తోత్రం-5

 మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్పదాబ్జే
మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యాన్యదాఖ్యానజాతమ్ ।
మాస్మార్షం మాధవ త్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్
మాభూవం త్వత్సపర్యాపరికరరహితో జన్మజన్మాంతరేఽపి ॥ ౧౫ ॥

మాధవా  ! నీ పాదపద్మాలపై  నమ్మిక లేనివారి  వైపు

                                               నా  చూపులు  తిప్పనివ్వకు

నీ  కమనీయ గాధా విశేషాలు తప్ప ఇతరములేవి నా చెవి చేరనియకు

నిన్ను  గూర్చిన  ఆలోచన లేనివారి తలంపు నాకు రానీయకు

నీ  సేవా భాగ్యమునుండి  ఎన్ని జన్మలెత్తినా నను దూరం చేయకు


జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణిద్వంద్వ సమర్చయాచ్యుతకథాః శ్రోత్రద్వయ త్వం శృణు ।
కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ ముకుందపాదతులసీం మూర్ధన్ నమాధోక్షజమ్ ॥ ౧౬ ॥


ఓ  నాలుకా ! కేశవుని కీర్తనలు  ఆలాపించు

ఓ  మనసా ! మురారి  స్మరణలో  మునకలేయుము

ఓ  చేతులారా ! శ్రీధరుని  సేవలో  నిమగ్నమవ్వుడు

ఓ  చెవులారా  ! అచ్యుతుని  లీలలను  ఆలకింపుడు   

ఓ  కనులార  ! కృష్ణుని  సౌందర్య  వీక్షణలో  రెప్పపాటు  మరచిపోండి

ఓ  పాదములారా ! ఎల్లప్పుడూ  హరి  ఆలయమునకే  నను  గోనిపొండి

ఓ  నాశికా  ! ముకుందుని  పాద ద్వయంపై  నిలచిన  పవిత్ర  తులసి  సువాసనలను

                  ఆస్వాదించు

ఓ  శిరమా  ! అధోక్షజుని  పాదాల  ముందు  మోకరిల్లు



హే లోకాః శ్రుణుత ప్రసూతిమరణవ్యాధేశ్చికిత్సామిమాం
యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః ।
అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం
తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికమ్ ॥ ౧౭ ।



యాజ్ఞావల్క్యాది   మహర్షులచే  తెలియజేయబడిన

జరా  వ్యాధి  మరణాల  నుండి  ముక్తి  కలిగించు

దివ్యోషధం  జనులారా  మన  హృదయాలలో  అంతర్జ్యోతి

వలె , కృష్ణ  నామం  తో  ఒప్పారుచున్నది . ఆ  నామామృతాన్ని

త్రావి  పరమపదం  పొందుదాం

Friday, December 13, 2024

ముకుందమాలా స్తోత్రం-4

భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం 
 కథమహమితి చేతో మా స్మ గాః కాతరత్వమ్ । 
 సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా 
 నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యమ్ ॥ ౧౩ ॥  
 దాటశక్యం కాని  సంసార  సాగరం  చూసి 
దిగులు  చెందకు  ఆందోళన  విడుము 
నిర్మల  ఏకాగ్రచిత్తంతో  ధ్యానించు
నరకాసుర సంహారి  నావలా  మారి   
నిన్నావలి  తీరం  చేర్చగలడు  

 తృష్ణాతోయే మదనపవనోద్ధూతమోహోర్మిమాలే 
దారావర్తే తనయసహజగ్రాహసంఘాకులే చ । 
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ 
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ ॥ 

 కోరి  వరించిన  భార్య  తత్ఫల  సంతానం సంపదలనే 
 మూడు  భంధనాలపై  మదనుడిమోహబాణపు   తాకిడికి
   పెంచుకున్న  వ్యామోహంతో జనన , జీవన  మరణాలనే   
మూడు  సరస్సులలో  పలుమార్లుమునకలేస్తున్న   
 నాకు  ముకుందా  నీ   భక్తి  అనే  పడవలో కొద్ది  చోటు  కల్పించు    


పృథ్వీరేణురణుః పయాంసి కణికాః ఫల్గుస్ఫులింగో లఘుః
 తేజో నిశ్శ్వసనం మరుత్ తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః ।
 క్షుద్రా రుద్రపితామహప్రభృతయః కీటాః సమస్తాః సురాః 
దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధిః ॥ ౧౯ ॥ 

 ముకుందా!  నీ  కడగంటి  చూపు తో పృథ్వి  ధూళి  రేణువు  సమమవ్వు అనంత  జలధి  ఒక్క  బిందు  పరిమాణమయ్యే   
బడబాగ్ని  చిన్న   అగ్నికణం  గా  గోచరిస్తుంది ప్రచండమైన  వాయువు  చిరుగాలి  లా  ఆహ్లాదపరుస్తుంది 
 అంచులేరుగని   ఆకాశం  చిన్న  రంధ్రమై  చిక్కపడుతుంది సమస్త  దేవతా  సమూహం  బృంగ  సమూహాలను  మరిపిస్తుంది
 కృష్ణా  సమస్తము  నీ  పాద  ధూళి   లోనే  ఇమిడియున్నది  కదా 

Thursday, December 12, 2024

సాంద్రానంద

 సాంద్రానంద  సదానందా

ఆనందకంద  అరవిందనేత్రా

సుధామ సౌమిత్ర  సదాశివ ప్రియా

అర్జున ప్రియంకర  అరిష్టాఘసుర సంహారా

వేణుగానలోల  వేదవేదాంత విహారా

నవనీత చోర   నరకాసుర సంహారా

విశ్వరూపధర   వృందావన విహారా

నంద నందనా  నీలమేఘ వర్ణుడా

రుక్మిణీ మనోహర  రాసకేళీ వినోద విహారా

నారదాది మునిబృంద వందిత  నగరాజ పుత్రి 
ప్రియ సహోదరా

రామానుజ  రాధారమణా  రాధికా ప్రియా 

గోవర్ధన గిరిధారీ   గోపీ మానస హృదయ విహారీ 

కామరాజ జనక   కాళిందీ శిరో రంగస్థల నాట్యకేళీ విహారీ  

 గోప గోవత్స పరిపాలక   గోవింద నామధారీ 

కరుణాంతరంగా   కుబ్జా సౌందర్య ప్రదాతా 

సాంద్రానందా   లక్ష్మీ కిరణ్ ప్రియనందన శరణు శరణు