Monday, May 6, 2013
అహో అరుణాచలమహో
అరుణాచలం ఆ పరమశివుడు జ్యోతి స్వరూపుడై నిలచిన దివ్య క్షేత్రం
అరుణా చలం స్వయంగా సదా శివుడు పార్వతీ మాత , స్కందుడు , వినాయకుని తో కూడి కొండ గా వెలసిన పవిత్ర ప్రదేశం
అరుణాచలం పర్వత గుహలో సిద్దయోగి రూపంలో దక్షిణామూర్తి కొలువై ఉన్న గురుక్షేత్రం
అరుణాచలం అరుణాచలేశ్వరుడిగా పరమేశ్వరుడు , అపితకుచాంబ గా గౌరి దేవి వెలసిన దివ్యధామం
పళని లో స్కంధుడి కి సమానమైన సుబ్రహ్మణ్య క్షేత్రం
కాశీలోని వశిష్ట గణపతి కి సరిపోలిన గణపతి క్షేత్రం
గిరివాలం
అరుణాచల కొండ చుట్టూ (14 కి. మీ ) ప్రదక్షిణ ఇక్కడి గొప్పదైన ఆనవాయితీ
ప్రదక్షిణ గా సాగిపోయే మార్గంలో అడుగడుగు అద్భుత మైన పవిత్ర ప్రదేశాలతో నిండి ఉంటుంది
అష్ట దిక్పాలకులతో ప్రతిష్టించబడిన శివ లింగ స్వరూపాలతో నిండిన మహా క్షేత్రం (ఇంద్ర , వరుణ , వాయు,యమ,ఈశాన్య,నిర్రుతి,ఆగ్నేయ , సూర్య, చంద్ర, కుబేర లింగాలు)
కన్నులకు పండుగా తనివితీరా చూచి తరించి పోగల మహా క్షేత్ర్తం
నందీశ్వరుడు పంచ భూత నందులుగా నిలచిన నవ్య క్షేత్రం
దూర్వాస , గౌతమ , అగస్త్య మహర్షుల ఆశ్రమాల తో అలరారే ఆనంద ధామం
రమణ మహర్షి, శేషాద్రి స్వామి వంటి మహా యోగుల పాద స్పర్సతో పునీతమైన ప్రాంతం
శ్రీకాకుళ సమీపం లోని కలువరాయి లో జన్మించి, బెంగాల్ లోని నవద్వీపం లో కల హరి మంటపం నందు జరిగే మహా పండిత సంవాదంలో నాటి పండిత పరిషత్ అధ్యక్షుడు అంబికా దత్తు ని నీవు అమ్మకు దత్త పుత్రుడవు (అంబికా దత్తు) నేను గణపతి ని అంటే అమ్మకు పెద్ద కుమారుడిని నాకన్నా నీవేమి గొప్ప అని హుంకరించి , కావ్యకంట
బిరుదు పొందిన కావ్యకంట గణపతి ముని వస్తే తప్ప తన రధం అడుగు ముందుకు పడదని అలిగిన అరుణాచలేశుని భక్త సౌలభ్యం
సంతానం లేక విలపిస్తున్న వల్లాల మహారాజును ఊరడించి , తానే పుత్రుడి భాద్యతలైన కర్మకాండల క్రతువులను నిర్వహిస్తానని తెలిపి నేటికి అరుణాచలానికి సమీపంలో ఉన్న వల్లల మహారాజు ఊరికి వెళ్లి ప్రతి వత్సరం శ్రాద్ధ కర్మలు నిర్వహించి రావటమనే అరుణా చలేశుని భక్త వాత్సల్యం
వర్ణింప నలవికానివి
నేటికి సిద్ద పురుషులు , మహా యోగులు , దేవతలు ప్రతినిత్యం ఆరుణాచలునకు గిరివాలం చేస్తుంటారు . అందుకే గిరివాలం చేసే దారికి ఎడమ వైపున మాత్రమే మనం నడవాల్సి వుంటుంది . ఎందుకంటే కుడి ప్రక్కన వారు వెళుతుంటారు
అరుణాచల దేవాలయంలోని పాతాళ లింగం వద్ద వున్నా గుహ అరుణాచల కొండ మధ్య భాగానికి చేరుకుంటుంది
అక్కడే వట వృక్షం క్రింద మహా మునులతో కలసి దక్షిణామూర్తి వుంటారు . అది సామాన్య మానవులు చేరలేని ప్రాంతం . కొందరు ప్రయత్నించి పది అడుగులు మించి వేయలేక వేనుతిరిగిపోయారు . సుబ్రహ్మణ్యుని అంశగా భావించే
రమణులు కూడా సగం దూరం కన్నా ఎక్కువ ముందుకు వెళ్ళలేక పోయారు
అరుణాచలం అగ్ని లింగం అన్న దానికి సాక్షిభూతమ్ గా దేవాలయం లోకి అడుగిడగానే వేడిగా ఉంటుంది తిరిగి మనం బయటకు వచ్చేవరకు
అరుణాచలశివ హేమాచలనృసింహా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment