Thursday, July 9, 2009

హనుమ వస్తుండు …….అవును నిజం మా ఇంటికి వస్తుండు


హనుమ వస్తుండు …….అవును నిజం మా ఇంటికి వస్తుండు నన్ను కాచుకొన ఏమిటలా చూస్తున్నారు …నమ్మశక్యం గా లేదా సరే విషయం ముందు నుండి చెబుతాను అప్పుడైనా నమ్మకం కలుగుతుందేమో అనగనగా ఒక రోజు ..ఎప్పటి లానే తెల్లారింది రోజువారి వురుకులు పరుగులతో ఆఫీస్ చేరుకుని పని మొదలెట్టాం కడుపులో పడ్డ కూడు కంటికి కునుకు తెప్పిస్తున్న వేళ మనసుకు జోల పాడే సమయం కాదు కనుక , హుశారేత్తించటం కోసం ఒకసారి అలా రేడిఫ్ఫ్ బాల్ లోకి తొంగి చూసా ముత్యాల సరాల వంటి పలు వరుసను ప్రదర్శిస్తూ , తళుకులినుతున్న చిరు నగవుతో ఓ చిలకమ్మ పలకరింపు హాయ్ అంతే , ఒక్కసారిగా మాయమయ్యింది నిదుర మబ్బు …అదే మగజాతికి పెద్ద జబ్బు రేకుల డబ్బాలో గులక రాళ్ళ కదలిక ను పోలిన శబ్దంతో కూడిన నవ్వు ఆపై బదులు పలకరింపు పరిచయాలు …..పోసుకోలు కబుర్లు చివరగా బై బై లు మళ్ళి పనిలో పడ్డాం మెరుపు తోడు లేని ఉరుములా ఓ మేఘ గర్జన ఎవరది ?మీ పేరు నా రేడిఫ్ఫ్ ఫ్రెండ్స్ లిస్టు లోకి ఎలా వచ్చింది ?నేను మీకు తెలుసా ? పార్ధుడి గాండీవం నుండి దూసుకు వస్తున్న శరాల్లా ప్రశ్నల పరంపర . హటాత్పరిణామానికి …… ముందు ఉలికిపాటు ఆ పై తత్తరపాటు సర్దుకుని , సావధానం గా చూస్తే , మధ్యాహ్నం నవ్విన చిలకమ్మే ఇప్పుడు గర్జిస్తుంది ఆశ్చర్యపడుతూ మాటా మంతి కలిపితే ఏతావాతా తేలిందేమంటే , ఆ చిలకమ్మ చెల్లి అని మేఘ గర్జన అక్కదని అక్క మెయిల్ నుండి చెల్లి పరిచయం చేసుకున్దన్నమాట విషయం మా ఇద్దరికీ అర్ధమయ్యాక , తన తొలి మాట నువ్వు మంచి అబ్బాయి వేనా ? నేను అవును అంటే , ఎక్కడో వున్నా నీవేల నిర్ణయించుకోగాలవు మంచి వాడనో కాదో ? ఒక్కోసారి ప్రశ్నకు ప్రశ్నే సమాధానం . అలా మొదలైన పరిచయం అత్మీయతకు దారితీసింది నాకు హిందీ రాదు , తనకు ఆంగ్లం రాదు . ఇక తెలుగన్నదే తెలియదు కాని భావాలూ పంచుకోటానికి భాష అడ్డం కాలేదు లంకను లంఘించి , సీతమ్మ వద్దకు రామ దూత గా వెళ్ళిన హనుమయ్య మా ఇద్దరి మద్య వారధి కట్టాడు మన నాలుక పలికే మాట లోను , ఆ మాటను పుట్టించే మనసులోనూ స్వచ్చత వున్నపుడు బంధాలు అవే బలపడతాయి .ఆ ఆత్మీయ బంధం కల కాలం నిలవటానికి ఆ భగవంతుడు కూడా సాయపడతాడు ఇది నా స్వానుభవం (ఒక్కటి మాత్రం నిజం …మగువ మనసంత నిర్మలమైనది కాదు మగవాడి మనసు .కృష్ణా ! తెలిసో , తెలియకో , లేక ని మాయాప్రభావం చేతనో ఎప్పుడైనా నా మనసు జారి వుంటే క్షమించు . ఇక ముందెన్నడూ జారనియకు ) ఇలా కొద్ది కాలం గడిచాక , మా మిత్రురాలికి వివాహం జరగటం , తానూ తన అర్ధాంగుడైన పతి తో పాటుగా వెడలిపోతూ మిత్రమా , మిమ్ము ఎన్నటికి మరచిపోను , మీకు నా బహుమతి గా హనుమంతుడిని మీ ఇంటికి పంపుతానని మాట ఇచ్చి తాత్కాలిక వీడ్కోలు పలికింది ఆ తరువాత చాలా కాలం ఎలాంటి సమాచారం లేదు . తనకు నెట్ సౌకర్యం లేకపోవటం వలన . నేను మామూలు గా నా పనిలో పడి పోయాను ఎప్పుడన్నా ఒకసారి అనుకునే వాడిని ఎలా వున్నదో మా హితురాలు అని ఓ సాయంత్రం , రేడిఫ్ఫ్ ఐ లాండ్ లో నరసింహ అనే బ్లాగ్ పెట్టటానికి , నెట్ సెంటర్ కు వెళ్లి యధాలాపం గా రేడిఫ్ఫ్ బాల్ చూసా ఆశ్చర్యం నా ఆప్తురాలు …..చాలా కాలం తరువాత కుశలం అడుగుతుంది చెప్పలేనంత సంతోషం ….అంతలోనే పట్టరాని దిగులు అప్పటికే తానూ ఆఫ్ లైన్ . సరియ సరియ మెసేజ్ చూసాను , వాటి సారాంశం హనుమంతుడు మీ వద్దకు రావటానికి సిద్దం గా వున్నాడు అః ! ఎంతటి శుభవార్త కొత్తగా వివాహమయి , పెండ్లి కళ ఇంకా మాయమవలేదు , అత్తా వారింట , అత్తా మామలకు సపర్యలు చేసుకుంటూ , అర్ధంగుడికి చక్కని మనోల్లాసాన్ని కలిగిస్తూ , తీరిక లేకుండా గడుపుతూ కూడా ,కాసింత తీరిక చేసుకుని , నా హితం కోరి , తన ప్రభువైన హనుమంతుడిని నా ఇంటికి పంపించటానికి సిద్దం చేసింది ఏమిటలా చూస్తున్నారు ….మళ్ళి ఆవిడెవరో చెప్పట మేమిటి ……హనుమానుడు రావటమేమిటనా అదే భగవంతుడి గొప్పదనం తననే , త్రికరణ శుద్ది గా నమ్మి , తన శరణాగతి పొందిన భక్తులకు ఆయన సేవ చేస్తాడు . వారు ఏమి కోరితే అది చేస్తాడు కనుకనే , తన భక్తురాలు అయిన మా మిత్రురాలి కోరిక మన్నించి మా ఇంటికి రావటానికి సంసిద్దుదయ్యాడు , తోమ్మిదేండ్ల పసి ప్రాయం లో , వచ్చిన కలను నమ్మి , నాటి నుండి నేటి వరకు తెల్లవారు ఝామున 4 గంటలకు నిదుర లేచి , ఆ రామ దూత కు హారతి ఇచ్చి సేవ చేస్తూ తల్లి తండ్రులను గౌరవిస్తూ ,సంస్కారవంతమైన నడవడిక , శరత్కాలపు చంద్రుని చల్లదనాన్ని మరపించు చల్లని మనసు కలిగి వున్న నా అత్మీయుడి , తన పాదాలనే హృదయకమలం లో నింపుకున్న తన భక్తురాలి కోరిక మేరకు హర్యానా లోని కురుక్షేత్ర సమీపాన వున్న జింద్ నుండి మన భాగ్యనగరికి ఈ అభాగ్యుడి ఇంటికి రాబోతున్నాడు హనుమాన మహా ప్రభు హే హనుమా రోజు ని చరణారవిన్దాలను దర్శించుకొని , మంగళ హారతులతో , కర్పూర నిరాజనాలిస్తూ షడ్రసోపేతమైన రుచులతో కూడిన నైవేద్యమిస్తున్న ని ముద్దుబిడ్డ వద్ద నుండి ఈ మూఢుని గృహమునకు విచ్చేయుచున్నవా నేనేమి ఈయగలవాడను నా ఆలోచనలనే అప్పాలుగా నైవేద్యమిచ్చేద నా మనసునే మందార మాల చేసెద నా ఉచ్చ్వాస నిస్స్వాసాలనే ఉయాల చేసెద నా హృదయాన్నే పిఠం చేసెద నా దేహాన్ని తివాచి గా పరచి స్వాగతం పలుకుతున్నాను ప్రభు నన్ను , నా వంశాన్ని సంరక్షింప , ని ప్రసాద ఫలం గా లభించిన నా ఆప్తులకు ఆశీస్సులోసగా వేగిరమే రమ్ము ……..వేయి కనులతో వేచి వుంటిని తండ్రి .
పిక్: సంజన దత్త

4 comments:

durgeswara said...

బాస్ వచ్చాక కొద్దిగా చెప్పు సోదరా ,మేమూ ఆయన ఆజ్ఞాయితే ఒకసారి వచ్చి దర్శించుకుంటాము.

durgeswara said...

బాస్ వచ్చాక కొద్దిగా చెప్పు సోదరా ,ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటాము.

మనోహర్ చెనికల said...

నేను కూడా వస్తాను.
మీరు అదృష్టవంతులు. అంతటి భక్తురాలిని స్నేహితురాలిగా పొందగలిగినందుకు.

చిలమకూరు విజయమోహన్ said...

రాముని రాకను సుగ్రీవునికి హనుమంతుడు తెలియచేసినట్లు,ఆ హనుమంతుని రాకను మీరు మాకు తెలియజేయండి.జై రామభక్త హనుమాన్.