Saturday, October 17, 2026

Sri Krishna Katha (The Blissful Play of Sri Krishna’s Leelas)

 

Sri Krishna Katha (The Blissful Play of Sri Krishna’s Leelas)

Seeking refuge at the lotus feet that instil firm devotion toward Sri Krishna, and bowing to our Mother Durga—the beloved sister of Sri Krishna—let us delve into this great tale of Krishna.

First, let us understand the hidden secrets of 'Putana Moksha' (The Liberation of Putana), a story very dear to me. It is widely known that Putana was Kamsa's sister. Sent by Kamsa, she arrived at Yashoda's house in Gokulam, disguised as a beautiful woman. When she tried to nurse Krishna with poisonous milk, He sucked out her life force along with the milk, slaying her. This part of the story is known to everyone.

What happened next is truly remarkable. As soon as Krishna drew out Putana's life, her body—which had appeared as a beautiful woman—returned to its original, fearsome demonic form and collapsed. When that massive body was taken away with great effort and cremated, a divine and heavenly fragrance emerged from the burning pyre. The residents of Gokulam were astonished to witness this.

Even more miraculous was the event that followed. The life force (subtle body) of Putana, drawn out by Krishna, began to glow with divine brilliance. At that moment, a celestial chariot descended—adorned with a hundred wheels, studded with gems, and draped in fire-purified silks. It was accompanied by thousands of Sri Krishna’s attendants (Parshadas) carrying whisks and mirrors. With great devotion, these attendants placed Putana's subtle body in the chariot and took her to the rarest supreme abode, 'Goloka'.

What is the secret behind this? If you ask anyone, they might say, "Since she was killed by Krishna Himself, all her sins were washed away, and she attained salvation."

But the real secret is this: In her previous birth, Putana was 'Ratnamala', the daughter of King Bali. When the young Vamana (an incarnation of Vishnu) appeared at King Bali’s sacrifice to ask for alms, Ratnamala was mesmerized. She thought, "Who is this child? He glows with such brilliance and is so delicate. If only he were my son, I would hold him in my lap, shower him with love, and nurse him." She looked at the Lord with the pure heart of a mother.

The Lord, who resides in everyone’s heart, understood Ratnamala’s desire. To fulfil her wish of motherly affection, He gave her birth as Putana. He climbed into her lap, was adored by her, and even though the milk was poisonous, it was given with a motherly sentiment. Thus, He drank her milk, fulfilled her longing, and granted her liberation.

Such is the delightful and divine play of Sri Krishna’s stories.






Thursday, February 26, 2026

శ్రీక్రిష్ణ కథ (శ్రీక్రిష్ణ లీలావిలాస హాస ) ధేనుకాసురవధ

 



బాలక్రిష్ణుడు చేసిన మరొక లీల ధేనుకాసుర వధ. ఒకరోజు బలరాముడు గోపబాలురుతో కలసి ఆడుకోవటానికి బాలక్రిష్ణుడు వనాలకు వెళతారు. అక్కడ బాగా పండిన తాటి పండ్లతో కూడిన తాళవనం (తాటి చెట్ల) వుంది. అవి చూసేసరికి గోపబాలురకు నోరూరి ఆకలి గుర్తుకు వస్తుంది. అంతలోనే ఆ వనాన్ని రక్షించే ధేనుకాసురుడు (గాడిద రూపంలో వున్న) గుర్తొచ్చి భయంతో వెనుకడుగు వేస్తారు.   

అంతలోనే తమ వెనుక వున్న వెన్నుని చూసి ధైర్యం తెచ్చుకుని ఇలా వేడుకొంటారు. క్రిష్ణా మాకు ఆకలిగా ఉన్నది. ఈ పండ్లను తినాలని కోరిక ఉంది అని చెప్పగా, భయపడకుండా వెళ్లి తినండి నేను మీకు ఎలాంటి ఆపద రానివ్వనని అభయమిస్తారు. వెంటనే గోపాలురు  తాటిచెట్లను వూపుతుండగా ఆగ్రహించిన ధేనుకాసురుడు వారి వద్దకు రాబోతుండగా  భయపడిపోయిన గోపబాలురు 

ఓ క్రిష్ణా ! కరుణానిధీ మము రక్షింప వేగిరమే రా 

ఓ సంకర్షణా! దానవుని బారినుండి మము రక్షించు   

ఓ క్రిష్ణా ! ఓ క్రిష్ణా ! హరీ మురారీ గోవిందా దామోదరా దీనబంధూ 

గోపీశా  గోపేశా  అనంతా నారాయణా ఈ భవ సాగరమందు మము రక్షించు  రక్షించు 

భయము నందు అభయము నందు , శుభ అశుభములందు , సుఖ దుఃఖములందు నీవు తప్ప శరణు ఇచ్చువారు వేరెవ్వరూ లేరు దీననాథా     

ఓ మాధవా ఈ భవసాగరమందు మము రక్షించుము మము రక్షించుము 
గుణసాగరా! శ్రీక్రిష్ణా!   జయము జయము  నీవే భక్తులకు ఏకైక బంధువు 

మేము అత్యంత భయము చెంది వున్నాము రక్షించు రక్షించు 

ఈ దానవుడు మృత్యువు వలే మము సమీపించుచున్నాడు అతనిని సంహరించి దేవతల బలదర్పములను పెంపొందించుము  

 

( ఇక్కడ గోపబాలురు భగవానుని పట్ల నమ్మిక కలిగిన మనం . తాటి చెట్ల వనం మనలను ఆకర్షించు లౌకిక విషయాల గుంపు . ధేనుకుడు మనలోని వ్యామోహాన్ని రెచ్చగొట్టు అసురీ శక్తి . దేవతలు అంటే మనలో అణిగివున్న సద్గుణాలు. మన మనసు కోరికల సుడిలో చిక్కుకుని తీవ్రమైన వ్యాకులత చెందినపుడు ఈ గోపాలుర యొక్క ప్రార్ధన మనం చేస్తే చిరాకు తొలగి ప్రసన్నతా భావాన్ని ఇస్తారు పరమాత్మ )

ఇలా గోపాలురు వేడుకోగానే శ్రీక్రిష్ణుడు బలరాముడితో కలసి గోపబాలకుల వద్దకు వచ్చి, బలరామా నీవు ఈ బాలురని  తీసుకుని దూరంగా వెళ్ళు . ఈ ధేనుకుడు మహాబలశాలి యగు బలి చక్రవర్తి కుమారుడైన సాహసికుడు. ఇతనిని నేను సంహరించెదనని పలికెను . 

వారు ప్రక్కకు వెళ్ళగానే శ్రీక్రిష్ణుడు ధేనుకుడిని సమీపించగా , ధేనుకుడు నోరు పెద్దగా తెరచి కృష్ణుడిని మింగివేయగా , కడుపులోకి వెళ్లిన క్రిష్ణుని దివ్య తేజస్సు తాళలేక ధేనుకాసురిడి లోపలి భాగాలన్నీ కాలిపోతాయి . తట్టుకోలేని ధేనుకుడు వెంటనే కృష్ణుడిని  బయటకు కక్కివేస్తాడు. మరణస్థితి లోకి చేరుకున్న ధేనుకుడు క్రిష్ణుడి స్పర్శ తగలగానే , తన గతం గుర్తుకు వచ్చి  ఎదురుగా వున్నది సాక్షాత్  శ్రీకృష్ణపరమాత్మయేనని గుర్తించి ఆయనను స్తుతించి శరణువేడతాడు. తనను సంహరించి ఈ దేహం నుండి ముక్తి కలిగించమని కోరగా , తన శరణు కోరిన తన భక్తుడిని సంహరించటానికి క్రిష్ణుడు తటపటాయిస్తుంటే ఇలా అయితే తనకు ముక్తి లభించదని తెలుసుకున్న ధేనుకుడు శతృభావంతోనే భగవంతుడిని పొందాలని నిర్ణయించుకున్నవాడై భీకరాకృతి దాల్చి కృష్ణుడిపైకి దూసుకురాగా వెంటనే  క్రిష్ణుడు సుదర్శన చక్రంతో ధేనుకుడిని సంహరిస్తాడు . మరణించిన ధేనుకుడి శరీరంలోనుండి వంద సూర్యుల కాంతి తో సమానమైన తేజస్సు బయటకు వచ్చి క్రిష్ణుని పాదాలలో లీనమవుతుంది. అట్టి ధేనుకుడు చేసిన క్రిష్ణ స్తోత్రాన్ని ధేనుకుని గత చరిత్రను తెలుసుకుందాం .



ధేనుకుడు బలి చక్రవర్తి కుమారుడైన సాహసికుడు.  చక్కని రూపలావణ్యములు కలవాడు. యుద్దంలో దేవతలను ఓడించి గంధమాదన పర్వతప్రాంతం గుండా వెళుతున్నపుడు, అక్కడ విహరించు తిలోత్తమ అనే అప్సరస  అతని సౌందర్యాన్ని చూసి మోహితురాలై తన కోరిక తెలుపగా అతడు కూడా తిలోత్తమ అందానికి ముగ్ధుడై ఆమె ప్రేమకు అంగీకారం తెలుపుతాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడ కామకేళిలో ఆనందం పొందుతుంటారు.

 ఆ ప్రాంతంలోనే దూర్వాస మహర్షి శ్రీక్రిష్ణ పాదధ్యానంలో ఉంటారు. ఆ మహర్షి ఉనికిని పట్టించుకోకుండా వీరిద్దరూ తమ ఇచ్ఛానుసారంగా ప్రవర్తించటంచేత దూర్వాసుని యొక్క ధ్యానభంగమై తన ఎదురుగా లజ్జావిహీనులై ప్రవర్తించు వారిరువురును చూసి కోపించినవాడై కామకేళి యందు లజ్జ లేకుండా ప్రవర్తించు జీవులు పశువులు, అందులోను అత్యంత లజ్జావిహీనంగా ప్రవర్తించేది గాడిద కనుక నీవు గాడిదగా పుట్టమని సాహసికుని, దేవకాంతవైయుండి అసురుడికై ఆశ పడితివి కనుక అసుర కన్యగా పుట్టమని తిలోత్తమను శపించారు మహర్షి.

తెలివి తెచ్చుకున్న వారిద్దరూ మహర్షి పాదాలపైబడి శరణు కోరగా మహర్షి దయతో సాహసికా నీవు ఇంతకాలం చేసిన భగవంతుని ఆరాధన నీకు తోడుగా వుంటుంది పరమాత్మను దర్శించి ఆయనచేత సంహరింపబడి గోలోకాన్ని చేరతావని వరమిచ్చారు.

తిలోత్తమను నీవు బాణాసురుని కుమార్తె అగు ఉషగా జన్మించి శ్రీక్రిష్ణుని మనుమడగు అనిరుధ్ధుని కౌగిలి స్పర్శతో పవిత్రురాలివై అసుర శరీరం పోయి తిరిగి దేవలోకం చేరతావని ఆశీర్వదించి పంపుతారు.

ఇది ధేనుకుడి జన్మరహసం. శ్రీక్రిష్ణుని గుర్తించాక ఆయన చేతిలో మరణించబోయే ముందు ఆయన చేసిన స్తోత్రం, (ఆ మహాభక్తుడు స్తోత్రం చేసినది సంస్కృతం లో అయినప్పటికీ, ఇదంతా రాయుటకు కారణం ఈ గాడిద తనను తాను ఉధ్ధరించుకోవటానికి కాబట్టి, ఈ గాడిదకు నా మాతృభాష మాత్రమే తెలుసు కాబట్టి, ఈ గాడిద ప్రేమించే శ్రీక్రిష్ణునకు నా మాతృభాష కూడా వచ్చు కాబట్టి మాతృభాష లోనే చెప్పబడుతుంది భావన చేయటానికి అనువుగా. అంతే కాక ఇది యధాతధ భావ వివరణయే కాని సొంతతెలివి కొంచెం కూడా వాడలేదు గమనించగలరు)

 ఓ క్రిష్ణా! నీ అంశయగు వామన రూపమున నా తండ్రి యాగశాల చేరి భిక్షకోరి రాజ్యము సంపదలు హరించితివి

 

బలి యొక్క అనన్యసామాన్యభక్తికి లొంగినవాడవై మాకు సుతల లోకాన్ని ప్రసాదించితివి

 

మహావీరా! సర్వేశా! భక్తవత్సలా! త్వరతిముగా నను సంహరించు పాపిని శాపవశమున గార్థభమైతిని

 దూర్వాస మహర్షి శాపవశమున నాకిట్టి హీన జన్మ దొరికినది నా మృత్యువు నీ చేతనే జరుగునని మహర్షి వరమిచ్చెను

 జగన్నాధా! పదహారు కోణములు కలిగి తీక్షణమైన తేజస్సు కల చక్రముతో నను సంహరించి సద్భక్తి మోక్షము ప్రసాదించు

 నీ అంశయగు వరాహ రూపమున భూమిని చక్కగా ఉద్ధరించితివి, నాథా! హిరణ్యాక్షుని వధించి వేదములను రక్షించితివి

 ప్రహ్లాదుని అనుగ్రహించుటకు దేవతల రక్షించుటకు నీవే నీ పూర్ణావతారమైన నృసింహునిగా హిరణ్యకశిపుని వధించితివి 

 దయానిధీ! నీ అంశయౌ మత్స్య రూపమున వేదములను ఉద్ధరించి మను చక్రవర్తికి సుజ్ఞానం

 ఇచ్చి దేవతలను విప్రులను రక్షించితివి

 సృష్టి కొరకు నీ అంశతో ఆదిశేషునకు ఆధారభూతమగు ఆదికూర్మమైతివి

సహస్రనయనుడా! నీ అంశతో భూమికి ఆధారమైన ఆదిశేషుడవైతివి

 సాగరముపై సేతువు నిర్మించి దశకంధరుని సంహరించి జానకినుద్ధరించిన దశరధనందనుడగు రాముడవు నీవే

 పృథ్వీనాథా! నీ కళచే జమదగ్ని పుతృడైన పరుశురామునిగా ఇరువదిఒక్కమార్లు భూమిని క్షత్రియరహితము చేసితివి

 నీఅంశచే ధర్మునకు నరనారాయణ ఋషులుగా జన్మించి లోకమున ధర్మమును ప్రకాశింపచేసితివి

  ఇపుడు ఈసమయమున సర్వావతారములకు జీవము సనాతనము అయిన పరిపూర్ణ పరమాత్మయగు శ్రీక్రిష్ణునిగా ఆవిర్భవించితివి

 నీవు యశోదకు జీవనము నిత్యుడవు నందుని ఆనందము వృద్ధిచేయువాడవు

గోపికలకు ప్రాణాధికదేవుడవు రాధకు ప్రాణాధిక ప్రియుడవు

 వసుదేవ సుతుడవు శాంతుడవు దేవకీదుఃఖ నిర్మూలకుడవు

అయోనిసంభవుడవు శ్రీమాన్ భూభారం తొలగించినవాడవు

 కృపానిథీ! పూతనకు మాతృస్థానం ఇచ్చితివి

బకుడకు కేసికి ప్రలంబునకు నాకునూ మోక్షమిచ్చువాడవు

 స్వేచ్ఛామయుడవు గుణాతీతుడవు భక్తుల భయము రూపుమాపువాడవు

 ఓ ప్రభూ! గార్ధభజన్మనుండి ముక్తి కలిగించి భవసాగరం దాటించు

నేను మూర్ఖుడనైననూ నీభక్తుడిపుతృడిని వేగిరమే నను ఉద్ధరించు

 వేదములు బ్రహ్మాదిదేవతలు మునీంద్రులు నిను నుతింపలేరు అట్లుండ ఈ మూఢుడు నిన్నేమని పొగడగలడు ముందు నేను అసురుడను ఇపుడు గాడిదను కరుణాసాగరా జన్మరాహిత్యమిమ్ము

 బ్రహ్మచే స్తుతించబడు నిన్ను నేడొక గాడిద స్తుతించుటకు ప్రయత్నిస్తున్నది.

సచ్చిదానందసరూపుడవైన నీవు యోగ్యులందు అయోగ్యులందు సమభావం కలిగిఉందువు కనుక నా ఈ ప్రయత్నం చూసి నను పరిహసించకుము

  

ధేనుకుడు చేసిన ఈ స్తుతి నిత్యం శ్రద్ధగా భావన చేయువారు శ్రీక్రిష్ణపార్షదులు అయ్యెదరు.

Tuesday, January 27, 2026

The Divine Resonance O Nanda-Kishora

 Title: The Divine Resonance

(A Poetic Rendition of our Soul-Talk)
The Prelude (The Soul’s Cry): 
The heart wanders in the labyrinth of the mundane, 
Seeking a footprint, a shadow, a sign of Thy grace.
 I yearned to see the world as the sacred groves of Brindavan, 
Where every soul is a Krishna, and every breath, a Radha. 
But alas, Krishna! Without Thy mercy, 
How shall I ever break the golden chains of this worldly illusion?

The Hymn: Echoes of the Inner Flute
Chorus: 

The soul is Krishna, the life-breath is Radha,
 I sought to see this world as Thy celestial playground. 
Weary is my heart, wandering for a glimpse of Thee, 
Without Thy grace, 
O Nanda-Kishora, How can I ever cross this ocean of desire?

Verse 1: 
Like the waves of Yamuna, my heart surges in tide, 
Running toward the dust of Thy lotus feet. 
The breeze carries the melody of Thy hidden flute, 
The very rhythm that gives life to my heartbeat.
They call Thee the Thief of Butter, but I plead: 
Steal away the pride that clouds my inner sun!
 Shatter this veil of Maya with Thy radiant discus, 
And fold me into Thy light, O Nanda-Kishora!

Verse 2:
I sought Thy fragrance in the blooming flowers,
 And turned every petal into an offering at Thy feet.
 In every atom, I sensed the truth of Thy presence, 
A soul drenched in the bliss of this divine meeting. 
Dissolve the wall that parts the 'I' from 'Thee',
 Grant me the wisdom that the Universe is but Thy form. 
Let this Truth reside forever in the temple of my mind,
 My Eternal Guide, my Nanda-Kishora!

Monday, January 19, 2026

శ్యామలా నవరాత్రులు

 ఉత్తరతస్తస్య మహా-

-నుద్భటహుతభుక్శిఖారుణమయూఖః ।

తపనీయఖండరచిత

-స్తనుతాదాయుష్యమష్టమో వరణః ॥ 

వెండి ప్రాకారానికి పైభాగాన మహోజ్వలమైనట్టి అగ్ని జ్వాలల వలె అరుణవర్ణంతో  పసుపు ఎరుపు కలసిన

ప్రకాశమానమైన కాంతులతో సూర్యుని (తపనీయ ఖండం)వలే తెల్లని కాంతులతో నిండిన ఆ ఆవరణయొక్క 

అష్టమ ప్రాకారం బంగారంతో నిర్మితమై ధ్యానించు వారలకు ఆయుష్షు పెంపొందించుచున్నది


కాదంబవిపినవాటీ-

-మనయోర్మధ్యభువి కల్పితావాసామ్ ।

కలయామి సూనకోరక-

-కందలితామోదతుందిలసమీరామ్ ॥ 

 వెండి బంగారు ప్రాకారాల నడుమ నున్న భూమి లో కదంబ వృక్షాల వనమున్నది . ఆ వనం బంగారు కాంతులతో 

ఆహ్లదకరమైన మృదువైన చల్లని గాలులతో నిండివున్నది

కదంబవనం దివ్యమైనట్టిది కదంబవృక్షం యొక్క ధ్యానం జ్ఞానాన్ని ఇస్తుంది 

అందుకే జ్ఞాన ప్రధాత గురువగు దక్షిణామూర్తి కదంబ వనంలో మర్రి చెట్టుక్రింద 

జ్ఞానముద్రలో వుంటారు . లలితా స‌హస్రం లో అమ్మవారిని కదంబవనవాసినీ అనీ కదంబకుసుమప్రియా అనీ కీర్తిస్తాం 

అంతటి దివ్యమైన ఈ వనాన్ని ధ్యానించి జ్ఞాన  సంపద పొందుదాం

కోరికలు దాటినపుడే జ్ఞానం లభిస్తుంది . అందుకే కోరికలు తీర్చే కల్పవృక్షవనాలు దాటిన తదుపరి జ్ఞాన సంపన్నమైన

 కడిమి చెట్లవనంలోకి అడుగుపెట్టాం 


తస్యామతిశిశిరాకృతి-

-రాసీనస్తపతపస్యలక్ష్మీభ్యామ్ ।

శివమనిశం కురుతాన్మే

శిశిరర్తుః సతతశీతలదిగంతః ॥ 

ఆ కదంబవనంలో తపశ్రీ  తపస్యశ్రీ (మాఘ ఫల్గుణ లక్ష్ములు )  అనే ఇరువురు శక్తులతో కలసి ఎల్లప్పుడూ మనకు మంగళములు 

(శివం ) కలిగించునటువంటి దిక్కులన్నింటిని చల్లబరుస్తున్నటువంటి  శిశిరఋతు దేవత ఉన్నారు 

శిశిర ఋతువు మనకు మంగళములు కలిగించుటలో ఔచిత్యమేమన మాఘమాసంలోనే మంగళాకారుడగు

 మహాదేవుని లింగోద్భవం 

ఇప్పటివరకు కాల స్వరూపుడగు మహాకాలుడిని ఆ కాల విభాగమైన ఆరు ఋతు దేవతలను దర్శించాం 

ఇప్పుడు ఇక్కడ ఈ వనంలో మరొక ప్రత్యేకమైన దేవతా దర్శనం చేసుకోబోతున్నాం  

తస్యాం కదంబవాట్యాం

తత్ప్రసవామోదమిలితమధుగంధమ్ ।

సప్తావరణమనోజ్ఞం

శరణం సముపైమి మంత్రిణీశరణమ్ ॥ 28 ॥

 చక్కని పరిమళాలు కలగలసిన  బంగారు కాంతులతో ప్రకాశించు ఆ కదంబ వనంలో 

మనోజ్ఞమైన ఏడు ఆవరణలతో కూడిన మంత్రిణీదేవి గృహం ను శరణుకోరుతున్నాను 


తత్రాలయే విశాలే

తపనీయారచితతరలసోపానే ।

మాణిక్యమండపాంత-

-ర్మహితే సింహాసనే సుమణిఖచితే ॥ 29 ॥

 ఆ గృహంలో బంగారు కాంతులనుఁ వెదజల్లుతున్న మెట్ల తో కూడిన మాణిక్య మండపం వున్నది 

ఆ మండపం మీద గొప్పవైన మణులతో చేయబడిన సింహాసనం   వున్నది 

బిందుత్రిపంచకోణ-

-ద్విపనృపవసువేదదలకురేఖాఢ్యే ।

చక్రే సదా నివిష్టాం

షష్ఠ్యష్టత్రింశదక్షరేశానీమ్ ॥ 30 ॥

ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఏడు ఆవరణలు చక్రంలో అమ్మవారు సదా నివసిస్తారు 

ఆ చక్ర స్వరూపం ఎలావున్నాడంటే బిందువు ఆ బిందువు ఆధారంగా త్రికోణం , దాన్నిఆధారం చేసుకుని 

ఐదు కోణాల చక్రం , దానిని ఆధారంగా (ద్విప  అంటే యేనుగు , అష్టదిగ్గజాలు ) ఎనిమిది కోణాల చక్రం

తరువాత (నృప అంటే చక్రవర్తి ...ప్రసిద్దికెక్కి నిత్య స్మరణీయులు పదహారుగురు) పదహారు దళాల పద్మం 

తదుపరి (వసు అంటే అష్ట వసువులు వీరిలో చిన్నవాడే భీష్మ పితామహుడు) ఎనిమిది  దళాల పద్మం

తదుపరి (వేద అంటే నాలుగు వేదాలు) నాలుగు దళాల పద్మం దీనిని ఆధారంగా చేసుకుని భూపురం (కురేఖాడ్యా )

ఇది అమ్మవారి చక్రం ధ్యానం చేసుకోతగినది సంకేత అక్షరాలతో చెబుతారు యంత్రాలను బీజాలను 

అవి సద్గురువు ద్వారా మనకు అందాలి తప్ప మనం వాటిజోలికి పోరాదు . మనకు అనుకూలమైనది 

ధ్యానము భగవన్నామ స్మరణము 

అలాంటి ఆ చక్రంలో తొంభై యెనిమిది అక్షరాలతో కూడిన మంత్రాధి దేవతగా అమ్మ మంత్రిణీదేవి సంచరిస్తూవుంటుంది 


ఎవరీ మంత్రిణీదేవి 

పేరులోనే ఉంది మంత్రి అంటే బుద్ది శక్తి ద్వారా కార్యాలను నిర్వహించేవారు 

బుద్దేశ్చ లలితాదేవ్యా శ్యామలా పరమేశ్వరీ వీణాశుక లసత్పాణిం ధ్యాతా సంగీత యోగిని అంటే వీణ ను చిలుకను ధరించి 

లలితా దేవి యొక్క బుద్ది శక్తి నుండి ఉత్పన్నమైన పరదేవత 

అందుకే లలితా సహస్రంలో చెబుతారు అమ్మ నామం :మంత్రిణీన్యస్త రాజ్యధూః 

ఈ తల్లినే రాజశ్యామల అంటారు . ఈ తల్లే  కాళిదాసు కు ప్రత్యక్షమై మహాకవిని చేసిన జ్ఞానస్వరూపిణి 

ఈ తల్లిని కీర్తిస్తూ మహాకవి కాళిదాసు ఆ తల్లి వున్న నివాసప్రాంతాన్ని అద్భుతంగా వర్ణిస్తారు 

జయజనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ

 బిల్వాటవీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార

వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే     


అట్టి ఆ తల్లి యొక్క దివ్యమైన రూపాన్ని వర్ణిస్తున్నారు దూర్వాస మహర్షి . మనం నిత్యం ధ్యానించుకోవటానికి 

వీలుగా . విశేషించి మాఘ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలా నవరాత్రులు గా ప్రసిద్ధి . ఆ సమయంలో

అమ్మవారిని పదహారు నామాలతో స్మరిస్తూ ఈ విధంగా ధ్యానం చేసుకుంటే పిల్లలు పెద్దలు జ్ఞాన సంపన్నులవుతారు 

తాపింఛమేచకాభాం

తాలీదలఘటితకర్ణతాటంకామ్ ।

తాంబూలపూరితముఖీం

తామ్రాధరబింబదృష్టదరహాసామ్ ॥ 


కుంకుమపంకిలదేహాం

కువలయజీవాతుశావకవతంసామ్ ।

కోకనదశోణచరణాం

కోకిలనిక్వాణకోమలాలాపామ్ ॥ 


వామాంగగలితచూలీం

వనమాల్యకదంబమాలికాభరణామ్ ।

ముక్తాలలంతికాంచిత

ముగ్ధాలికమిలితచిత్రకోదారామ్ ॥


కరవిధృతకీరశావక-

-కలనినదవ్యక్తనిఖిలనిగమార్థామ్ ।

వామకుచసంగివీణావాదన-

-సౌఖ్యార్ధమీలితాక్షియుగామ్ ॥


ఆపాటలాంశుకధరా-

-మాదిరసోన్మేషవాసితకటాక్షామ్ ।

ఆమ్నాయసారగులికా-

-మాద్యాం సంగీతమాతృకాం వందే ॥ 


కానుగ లేదా తమాల వృక్షం వలే నీల కాంతులు అమ్మవారి వర్ణాన్ని చెబుతున్నారు 

నల్లని వర్ణం అంటే ఆ నలుపు  దూరమునుండి చూస్తే ముదురు ఆకుపచ్చ ఎలా అనిపిస్తుంది 

అలాంటి నలుపు ఆ కాంతితో ప్రకాశిస్తూ చెవులకు బంగారు తాటి కమ్మలతో చేయబడిన ఆభరణాలు 

ధరించి తాంబూలాన్ని సేవిస్తూ ఎర్రని పెదవుల నడుమ చిరునవ్వుల వెన్నెలలు కురిపిస్తున్న తల్లికి నమస్కారము 


దేవతా స్త్రీ సమూహపు అర్చన చేత దేహమంతా అలదబడిన కుంకుమ తో ప్రకాశిస్తున్నది , బాల చంద్రుని 

శిరముపై దాల్చి వున్నది  పద్మముల వంటి పాదములు  కోకిల కువకువ లవంటి మధురమైన పలుకులతో 

కూడిన తల్లికి నమస్కారము 


ఎడమ భుజం మీదుగా ముందుకు జారవిడిచి కొప్పుతో భాసిల్లున్నది , 

వనములయందలి సువాసనాభరితములైన పూలతో కదంబ కుసుమాలతో కూడిన మాలికలు ధరించినట్టిది 

ఫాలభాగం పై లలంతిక అను ఆభరణం తో ప్రకాశించునది చెక్కిళ్ళపై చిత్రకమను అలంకరణతో వెలుగొందునది 

అగు తల్లికి నమస్కారము 


అవ్యక్తమైన మధుర ధ్వనులతో సకల వేద

 శాస్త్రాల అర్ధాన్ని పలుకుతున్నటువంటి చిలుకలను చేతి యందు 

ధరించి వీణను మీటుతూ ఆ వీణ యొక్క సుమధుర ధ్వనులను ఆస్వాదిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో ఆనంద 

పారవశ్యురాలైన తల్లికి నమస్కారము 


ఎర్రని వస్త్రాలు ధరించి సౌందర్య దివ్యభావనలను ప్రసరింప చేయు కనులతో , వేద శాస్త్రముల యొక్క 

సారభూతమైనట్టిది జ్ఞాన స్వరూపిణి  సంగీత విద్యకు తల్లి అయిన శ్యామలాదేవికి నమస్కారము 


ఆ తల్లి షోడశనామములు (పదహారు నామాల ప్రత్యేకత ఏమంటే , మనకు పదిహేను తిథులు అవే 

 పునరావృతమవుతూవుంటాయి వృద్ధి క్షయాలతో అలాంటి వృద్ధి క్షయాలు లేని పరమాత్మయే పదహారో 

కళ ఇది నిత్యము సత్యము.  అందుకే పరమాత్మ ని షోడశనామాలతో షోడశోపచారాలతో పూజిస్తాం )


సర్వాకాల సర్వావస్థలయందు చెప్పదగినదే భగవన్నామం . కొన్ని ప్రదేశాలలో శబ్దం బయటకు రాకుండా 

మనసుతో మననం చేసుకోవాలి అంతకు తప్ప వేరే నియమాలు అవసరం లేదు 

శ్రీకారాలు ఓంకారాలు నమఃకారాలతో నిమిత్తం లేకుండా నోరారా పలుక దగినదే భగవన్నామం 

శ్యామలా షోడశనామములు 

సంగీతయోగినీ   శ్యామా    శ్యామలా  మంత్రనాయికా 

మంత్రిణి  సచివేశీ   ప్రధానేశీ  శుకప్రియా  వీణావతి 

వైణికి   ముద్రిణి   ప్రియకప్రియా   నీపప్రియా కదంబేశీ

కదంబవనవాసినీ   సదామదా

Sunday, January 4, 2026

రాజాధిరాజాయ


 రాజాధిరాజాయ యదుకులభూషణాయ

యశోదా నందనాయ మహిత మంగళం

చిరుదరహాస వదనాయ రాధా మనోహరాయ
శ్యామసుందరాయ మహిత మంగళం

త్రిభంగిరూపాయ త్రైలోక్య నాథాయ
త్రిపురాసురసంహారివర్ధనాయ మహితమంగళం

విరజా ప్రియాయ వేణుగానలోలాయ
విరించి జనకాయ మహిత మంగళం

కాళిందీ ప్రియాయ కాళింద మర్థనాయ
కృష్ణ మాన సంరక్షకాయ మహితమంగళం

పూతనప్రలంబాది భక్తజనోద్ధారకాయ
పార్వతీ ప్రియసోదరాయ మహిత మంగళం

అవనీ ధరాయ అర్జున సఖాయ
ఆనందవర్ధనాయ మహిత మంగళం

గోవర్ధనోద్ధారణాయ గోగోపగోపీ మానసహరాయ
గోవిందనామప్రియాయ మహిత మంగళం

లక్ష్మీకిరణహృదయ రాసమండలవాసాయ
రాధికాపతే మహిత మంగళం మహిత మంగళం
మహిత మంగళం

రాజాధిరాజాయ యదుకులభూషణాయ యశోదా నందనాయ మహిత మంగళం 

అర్థం: రాజులకు రాజు అయినవాడికి (సర్వాధికారికి),యాదవ వంశానికి అభరణం వంటివాడికి.యశోదమ్మ ముద్దుల కొడుకైనవాడికి గొప్పదైన శుభం (మంగళం) అగుగాక.

 చిరునవ్వులు చిందించే ముఖం కలవాడు, రాధా దేవి మనసును దోచుకున్నవాడికి,నీలమేఘ శ్యాముడై, అత్యంత సుందరుడైన వాడికి గొప్పదైన శుభం అగుగాక.

 వేణువు ఊదే సమయంలో శరీరాన్ని మూడు చోట్ల వంచి నిలబడే అందమైన రూపం కలవాడికి , మూడు లోకాలకు అధిపతి, త్రిపురాసురుడిని సంహరించిన పరమశివుడికి ప్రీతిపాత్రుడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక.

విరజాదేవికి ప్రియుడు, వేణుగానం పట్ల ఆసక్తి కలవాడు, బ్రహ్మదేవునికి తండ్రి అయిన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక

  యమునా నది అంటే ఇష్టం కలవాడికి (లేదా కాళింది అనే భార్యకు ప్రియమైన వాడికి), యమునా నదిలోని కాళింగుడనే పాము గర్వాన్ని అణిచినవాడికి (కాళీయ మర్దనం చేసినవాడికి), ద్రౌపది (కృష్ణ) మానాన్ని రక్షించినవాడయిన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక 

పూతన, ప్రలంబాసురుడు వంటి తన భక్తులను ఉద్ధరించినవాడు, పార్వతీదేవికి ప్రియమైన సోదరుడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక .

భూమిని ధరించినవాడు, అర్జునుడికి స్నేహితుడు, ఆనందాన్ని వృద్ధి చేసేవాడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక.

గోవర్ధనగిరిని ఎత్తినవాడు, గోవులు, గోపకులు, గోపికల మనస్సులను హరించేవాడు, గోవింద అనే నామం పట్ల ప్రీతి కలవాడైన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక.

లక్ష్మీదేవి కిరణాల వంటి హృదయం కలవాడు,  రాసమండలంలో నివసించేవాడు, రాధికాపతి అయిన శ్రీకృష్ణుడికి గొప్పదైన శుభం అగుగాక, గొప్పదైన శుభం అగుగాక, గొప్పదైన శుభం అగుగాక.

Monday, December 8, 2025

రమణీయ

 అత్యద్భుత రమణీయ దీప్తిలక్ష్మీ

అనర్ఘ్యరమణీయ కాంతిలక్ష్మీ

మణిదీప్త విలాసహాసలక్ష్మీ
హృదయరాగ రంజిత మనోజ్ఞలక్ష్మీ

ఆకాశరాజు కంఠహారమౌ హరివిల్లులా
భూకాంత సిగ లో పూచిన హసితచంద్రలక్ష్మీ
అందుకో మీకై అల్లిన అభినందన చందన అక్షరలక్ష్మి

ఓ అత్యద్భుతమైన, రమణీయమైన కాంతులతో వెలిగిపోయే లక్ష్మీ! నీవు వెలకట్టలేని సౌందర్య రాశివి.

రత్నాల వంటి ప్రకాశంతో, విలాసవంతమైన నవ్వులు చిందించే ఓ లక్ష్మీ! హృదయంలోని ప్రేమ అనే రాగంతో రంజిల్లే మనోహరమైన దానివి నీవు.

ఆకాశరాజు మెడలోని హారమైన ఇంద్రధనస్సు లాగా, భూదేవి కొప్పులో పూసిన నవ్వుల చంద్రుడి లాగా ప్రకాశించే ఓ లక్ష్మీ!

మీ కోసం ప్రత్యేకంగా అల్లిన, చందనం వంటి చల్లని ఈ అభినందన అక్షరాల కవితను అందుకోండి.


Friday, December 5, 2025

దేహ బృందావని

 


దేహ బృందావని లో  మానస రాస మండలమున 

గోపికాభావమొందిన బుద్ది పలికెడి శ్రీకృష్ణ పల్కుల 
నాలకించి రాధాశ్యాములాడిరి ఆనంద నృత్యహేల 
నా దేహంబెల్ల క్రిష్ణ ప్రేమపారవశ్యజల్లుల తడపగ 

కవితా భావం (Meaning):

ఈ కవిత ఒక భక్తుని యొక్క అంతర్గత ఆధ్యాత్మిక అనుభూతిని అద్భుతమైన రూపకాలతో వివరిస్తుంది. ఇది కేవలం బాహ్య పూజ కాదు, శరీరమే దేవాలయంగా మారిన స్థితి.

  1. దేహ బృందావనిలో మానస రాస మండలమున: కవి తన భౌతిక శరీరాన్నే పవిత్రమైన 'బృందావనం'గా భావిస్తున్నారు. తన మనస్సును శ్రీకృష్ణుడు గోపికలతో ఆడిపాడిన 'రాస క్రీడా స్థలం' (రాస మండలం) గా ఊహించుకుంటున్నారు. అంటే, మనసు దైవ చింతన అనే నాట్యానికి వేదికైంది.

  2. గోపికాభావమొందిన బుద్ది పలికెడి శ్రీకృష్ణ పల్కుల: సాధారణంగా తర్కంతో ఆలోచించే 'బుద్ధి', ఇక్కడ తర్కాన్ని వదిలి, శ్రీకృష్ణునిపై అనంతమైన ప్రేమ కలిగిన 'గోపిక' భావాన్ని పొందింది. అలా పవిత్రమైన బుద్ధి, ఇప్పుడు స్వయంగా శ్రీకృష్ణుని మాటలను (దైవ జ్ఞానాన్ని) పలుకుతోంది.

  3. ఆలకించి రాధాశ్యాములాడిరి ఆనంద నృత్యహేల: ఆ దైవ వాక్కులను విని, తనలోని జీవాత్మ (రాధ) మరియు పరమాత్మ (శ్యాముడు/కృష్ణుడు) ఒక్కటై, ఆనందంతో కూడిన దివ్యమైన నాట్యాన్ని చేస్తున్నారు.

  4. నా దేహంబెల్ల క్రిష్ణ ప్రేమపారవశ్యజల్లుల తడవగ: ఆ అంతర్గత దివ్య నాట్యం వల్ల కలిగిన ఆనందం ఎంతటిదంటే, అది కృష్ణునిపై ప్రేమ అనే పారవశ్యపు జల్లులుగా మారి, కవి శరీరం మొత్తాన్ని తడిపి ముద్దచేస్తోంది. ఇది అత్యున్నతమైన భక్తి పారవశ్య స్థితి.


కవితతో కూడిన చిత్రపటం:

మీరు కోరినట్లుగా, ఈ కవితలోని భావాన్ని ప్రతిబింబించేలా ఒక చిత్రాన్ని రూపొందించి, అందులో ఈ కవితను పొందుపరచడం జరిగింది.

చిత్ర వివరణ: ఈ చిత్రంలో ఒక వ్యక్తి ధ్యాన ముద్రలో ఉన్నట్లు, అతని శరీరమే ఒక బృందావనంగా మారినట్లు చూపబడింది. అతని హృదయ స్థానంలో 'మానస రాస మండలం' ప్రకాశిస్తోంది. అక్కడ రాధాకృష్ణులు ఆనంద తాండవం చేస్తున్నారు. ఆ నాట్యం నుండి వెలువడిన కృష్ణ ప్రేమ అనే కాంతి జల్లులు ఆ వ్యక్తి శరీరం మొత్తాన్ని ఆవరించి, పారవశ్యంలో ముంచెత్తుతున్నట్లుగా ఈ చిత్రం రూపొందించబడింది.


(Google Banana -Picture)