Tuesday, May 26, 2009

అల్లరి అన్వేష చిననాటి తీపి గురుతులు


బాల్యం ఒక తీయని జ్ఞాపకం.

వెనుతిరిగి చూస్తే లెక్కలేనన్ని అనుభూతులను ఆనందాలను కనులముందు కదిలిస్తుంది.

వేగం గా పరుగెడుతున్న యాంత్రిక జీవనం లో అలసిన మనసును తిరిగి వురకలు వేయించు ఓషదం.

జీవితమనే కావ్యం లో అందమైన గీతిక

అందులోని కొన్ని చరణాలను కదిపి చూస్తే , రాలిపడ్డ రాగమాలికలివి

మామూలుగా, ఇంట్లో ఒక ఆడ పిల్ల తిరుగుతుంటేనే లక్ష్మి కళ వుట్టిపడుతున్దన్టారు

అలాంటిది మువ్వురు మహా లక్ష్మిలు ఒక చోట చేరితే?

ఇంకేమన్నా ఉందా………. ఇల్లు పీకి పందిరి వేయరూ…….

అలా ఆట పాటలతో, చిలిపి చేష్టాలతో సందడిగా సాగిపోయిన నా చిననాటి జ్ఞాపకాలే నాకు నిజమైన నేస్తాలు.

వాటి లో కొన్ని

బహుశా అమ్మమ్మ ఒడిలో విన్న కథల ప్రభావమేమో,

నాతో గొడవ పడిన ప్రతీసారి మా అక్కా నన్ను శపిస్తున్డేది

చేతి లో చెంబు పట్టుకుని నీళ్ళు చిమ్ముతూ …………కుక్కవై పో…అని

బిక్కమొగమ్ వేసుకుని నేనున్టే

మా అత్త, ఎవరైనా శపిన్చినపుడు చేయి అడ్డం పెట్టుకున్టె ఆది ఫలించదని వూరడిన్చేది.

ఓ! గుట్టు తెలిసిందిగా మా అక్కా మాయాల మరాటీ ….నేను ..బాల నాగమ్మ……… ఒంటి చేత్తో శాపం తిప్పికొడతా పెద్దలు వద్డన్నది చేయటమే బాల్యం.

మా అక్కకు నాకు జీవ్వు మనిపిన్చే చింత పులుపంటే తగని మక్కువ. ఎవరు చూడకుండా ఇద్దరం పిల్లుల్ల వంటింట్లోకి దూరి డబ్బాలు వెతికి మరీ సాధించేవాళ్ళం…..చింతపండు ని.

ఏవరూ చూడలేదని , ఓ మూలకు చేరి చింత పులుపు ఆస్వాదిన్చేవేళ

అలా చింతపండు తింటే చెవుడు వస్తుందే…….నానమ్మ ప్రేమతో కూడిన బెదిరింపు

ఆ పులుపు ముందు ఈ పుల్లని మాటలు రుచించేవి కావు.

ఓ రోజు మా ఇంటికి వచ్చిన పెద్దాయన……..చెవుడు తో ఇబ్బంది పడేవాడు ఎంత అరచి చెప్పిన వినబడేది కాదు.

అంటే ఈయన కూడా చిన్నప్పుడు బాగా చింత పండు తిన్నాడన్నమాట,

ఆ క్షణం మొదలు…..చింత పండు వాడిన పదార్ధమేది మా దరి చేరనివ్వలేదు .

ఇక వానాకాలం వచ్చిందంటే ఆ సంతోషమే వేరు

కాగితపు పడవను ఇంటి ముందు నిలిచిన నీటి మదుగులో వదిలి కేరింతలు కొడుతూ, ఆది ఎక్కడ టైటానిక్ లా మునుగుతుందో అని రాత్రి పూట నిదుర కాచి ఆ కాగితపు పడవను కాచుకున్న క్షణాలు………

మేరుస్తున్న ఆకాశపు కెమెరా కు మా అక్కా నేను మెరుపు తీగల వలె ఫోజులిచ్చినా క్షణాలూ

ఈ చిన్ని గుండెలో ఇంకా పదిలం.

వెనకింటిలోకి దొంగల్లా జొరబడి నేరేడు పండ్లు తెచ్చుకున్న కాలం ఓ తీపి గుర్తు.

ఇక ముగ్గురం ఒక చోట చేరి పెద్ద ఆరిన్దాల్లా………..

సైకిల్ తొక్కతమంటే ఇష్టపడే అక్కయ్య పెద్దయ్యాక సైకిల్ కొనుక్కుంటానంటే,

తనకన్నా పైమెట్టులో వుండాలన్న పంతం కల నేను….కారు కొంటానన్నను

చిట్టి చెల్లి …………పెద్దక్క .రెండు చక్రాలు, చిన్నక్క……….నాలుగు చక్రాలు……..నేను ఏంచక్క మూడు చక్రాలున్న ఆటో కొన్టనన్నది.

ఇడ్లీ అన్న ఆటో అన్న ఇశ్టపడే తనను, అయితే ఒక డ్రమ్ములో చట్నీ, ఇంకో డ్రామ్ము లో ఇడ్లీ లేసుకుని ఆటో లో తిరగమని ఉడికించిన క్షణం.

ఇంటికి వచ్చిన ఆతిది కోసం పెద్ద గిన్నె లో టి కాస్తున్న చెల్లిని, బకెట్ నిండుగా తీసుకెళ్ళి, తాగటానికి ఒక మగ్ కూడా ఇవ్వమని ఆటపట్టిన్చిన క్షణం అన్ని నా మది లో పదిలం

ఈ అనుబందాలు ఆప్యాయతలు కలకాలం నిలిచిపోవాలని చిన్ని కృష్ణుని కోరుకుంటున్నా.

Monday, May 25, 2009

పాపం aandhrulu


మహా పాపులు ఓ తంతు ముగిసింది. మరోసారి ఆంధ్రులు ద్రుతరాశ్ట్రుడి కౌగిలి లో నలిగి పోనున్నారు మరి ఈ దుస్థితి కి కారణం ముఖ్యం గా ఇద్దరు ఒకరు …. .అమాయకులైన ప్రజలను ప్రాంతీయ భావోద్వేగాలకు గురి చేసి వారి భావోద్రెకాలను పెట్టు బడిగా తన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకున్నవడు మరోకడు….. తనతో ఎటువంటి బన్దుత్వమ్ లేకున్నా, తమ రక్త సంబంధికులకు కూడా ఇవ్వని గౌరవాన్ని ఇస్తూ, తన కోసం ప్రాణాలివ్వటానికి సైతం వెనుకాడని అభిమానుల రక్తాన్ని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినవాడు మార్పు తెస్తా మార్పు తెస్తా నన్టు…….. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకున్నట్లు, సీట్లు అమ్ముకుని రాజకీయాలలో ఎవరు ఊహిన్చని మార్పు తెచ్చిన చీడ పురుగు తెగులు పాకిన్దేమో, వీడిని చూసి , తెలంగానం ఆలపించిన వాడు సైతం…. వేలం గానమాలాపిన్చాడు గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా పోరాడేవాడు ……యోధుడు, నిజమైన సైన్యాధ్యక్షుడు వారిని అనుసరిన్చేవారికి గెలిస్తే రాజ్యం. ఓడితే ….వీర స్వర్గం. అలాకాక, నమ్మి వెంట నడిచేవారి జీవితాలను ఫణమ్ గా పెట్టి, వారి ఆత్మ గౌరవాన్ని వేలం కట్టే వారి వెంట నడిస్తే చివరకు మిగిలేది? అభిమానులు ఆలోచించుకోండి ఇంకా నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న మూర్ఖత్వమ్ విడండి విలువైన మీ జీవితాలను ఇలాంటి వారి కోసం వ్యర్ధమ్ చేసుకోకండి మీ ఉన్నతిని కోరి మీ కోసం తపిన్చే మీ వారి గురించి మాత్రమే ఆలోచించండి

Wednesday, May 20, 2009

వానా కాలం


అప్పటి వరకు భానుని ప్రతాపాగ్ని కి బీటలు వారి బీడు బారిన భూమి తొలకరి జల్లు స్పర్శతో పులకరించి వెలువరించే మట్టి గంధపు వాసన ఆస్వాదించాల్సిందే కానీ , వివరించటం సాధ్యం కాదు నల్లని దట్టమైన నీరుకావి రంగు పంచె కట్టిన వాన దేవుడి పలకరింతకు ప్రతిగా ,
పుడమి కాంత లేత ఆకు పచ్చ చీర తో సోయగాలు చిందిస్తుంది.
అప్పటి వరకు నీలి వర్ణం లో నిర్మలం గా ఉన్న ఆకాశం నల్లని దట్టమైన రంగు లోకి మారి మేఘ గర్జనాలతో పిడుగులు కురిపిస్తుంది
వెలిగి పోతున్న చంద్రుడు నల్ల మబ్బు చాటున దాగిన వేళ మిణుగురల కాంతి దారి చూపుతుంది
ఎండిన గొంతుకతో నోళ్ళు తెరిచిన పిల్ల కాలువలు , బిర బిరా పరుగులు
వరకు బంధు మిత్రులతోను , కళల పోషణ లోను సేద దీరిన రైతన్న తిరిగి వ్యవసాయానికి సిద్దమవుతాడు వారి నాట్ల తో పంట చేలు సందడి గా వుంటాయి
ఆ సందడి సవ్వడి విన్న ఓ సినీ కవి…..ఇలా పాడుకుంటున్నాడు
ఓరి…. ఓరి……. వారి చేలో ఒంగుని చిన్నది నాటేస్తున్టే తొంగి చూసిన సూరీడైనా డన్గై పోతడురో
అంటూ
ఇంటి ముందు కాలువ కట్టిన నీటి ని చూస్తు, కాగితపు పడవలు చేసి వాటి తో పాటుగా మనం ఆ నీటి లో షీకారు కెళితె
ఎంతటి అందమైన వానా కాలపు బాల్యమో కదా
లాహిరి ……….లాహిరి లో
చూరు నుండి కారుతున్న వర్షపు నీటి ధారలను చూస్తు, వేడి వేడి పల్లీలకు కారం అద్దుకు తింటూంటే………
వాహ్ వా ఏమీ రుచి అనరా మైమరచి
ఆకాశపు నుదితి నుండి రాలైన నీటి చుక్క చినదాని కింది పెదవి పై చేరి ముత్యపు చినుకై మురిసిపోతుంది.
సాయంకాలం షీకారు కెళ్ళిన చిన్నది చిన్నవాడు ఒక్కసారిగా వాన జల్లు లో తడిసిపోతే
చెలి శిరము నుండి నాశిక మీదుగా, చిరు గడ్డం చేరి ఒక్క వుదుటన ఎదను తాకుతున్న జలధారలు చినవాడి గుండెల్లో గుబులు రేపుతుంటే,
దూరంగా పడిన పిడుగుపాటుకు చెలి తత్తరపాటూ తో జతగాడి ని హత్తుకుపోతే
పుట్టిన ప్రణయ కావ్యమే
చిట పట చినుకులు పడుతూ వుంటే
చెలికాదే సరసన వుంటే
చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగేడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దోయి.
వడగాడ్పులతో ఉడుకెత్తించిన వేసవినిక పొమ్మంటు
రాబోయే వర్షాకాలానికి రా రమ్మని, రా రారమ్మని ఆహ్వానం పలుకుతూ యెంతటి రొమాంటిక్ కాలమీ వర్షాకాలం
ప్రకృతిని ఆస్వాదించమని భగవంతుడు ఇచ్చాడు
కోరి వినాశనకరం గా మనిషి చేసుకుంటున్నాడు