Wednesday, July 17, 2013

తెలిమబ్బు తెరల చాటు

తెలిమబ్బు తెరల చాటు దాగితివో 
పూల మకరందం మాటు చేరితివో 
కోయిల కుహు కుహు స్వరాల ఒదిగితివొ 
సెలయేటి గలగల ల ఇమిడితివో 
అగుపడవో అజ్ఞాత వాసి అగుపడవో 
 
 
 
 
 
 
నెమలి నడకలో ఒప్పితివో 
రాజహంస హొయలలొ రాజిల్లితివో 
మల్లెల పరిమళాల  గుబాళించితివో 
పూలతల కోమలత్వాన నిలిచితివో 
అగుపడవో అజ్ఞాత వాసి అగుపడవో
 
 
 
 
 
 
 
 
 
మెరుపువై మెరిసేవో విరిజల్లువై కురిసేవో 
తడి ఆరని పెదవులపై చిరునవ్వువై చిగురించేవో  
హృదిని మీటి అలజడులు రేపి అదృశ్యమైతివో 
అగుపడవో అజ్ఞాత వాసి అగుపడవో

Monday, July 15, 2013

ఈశ్వరా మహేశ్వరా నా మాయను చేకొనరా మాయా సోమరి రేపు మాపనుచు నీ మానస పూజను మరపు చేస్తున్నది అదును చూసిన మాయ కాముడు మనసును మురిపించి నిన్నే మరిపిస్తున్నాడు బుద్ది విబ్రాంతి తో నీదారిని వీడి పలుదారుల పరుగిడిచున్నది
గమ్యమెరుగని గమనంతో హృదయం అలజడితో అలసిపోతుంది క్షణమాగని కాలం ఈ కట్టె ను పడగొట్టుటకై పరుగులు తీస్తున్నది విరామమెరుగని ఆరాటం ఆనందాన్ని ఆవిరిచేస్తున్నది ఈ అగమ్య స్తితిలో దొరికేరా హర నీ నామ సంకీర్తనమనే దివ్యాస్త్రమొకటి ఓం నమో నారాయణాయ నలిగిన నవనాడులుప్పొంగెర నిను తలచి తలచి ఇక నీమాయను నీవే చేకొనర ఈశ్వరా మహేశ్వరా!