తెలిమబ్బు తెరల చాటు దాగితివో
పూల మకరందం మాటు చేరితివో
కోయిల కుహు కుహు స్వరాల ఒదిగితివొ
సెలయేటి గలగల ల ఇమిడితివో
అగుపడవో అజ్ఞాత వాసి అగుపడవో
నెమలి నడకలో ఒప్పితివో
రాజహంస హొయలలొ రాజిల్లితివో
మల్లెల పరిమళాల గుబాళించితివో
పూలతల కోమలత్వాన నిలిచితివో
అగుపడవో అజ్ఞాత వాసి అగుపడవో
మెరుపువై మెరిసేవో విరిజల్లువై కురిసేవో
తడి ఆరని పెదవులపై చిరునవ్వువై చిగురించేవో
హృదిని మీటి అలజడులు రేపి అదృశ్యమైతివో
అగుపడవో అజ్ఞాత వాసి అగుపడవో
అగుపడవో అజ్ఞాత వాసి అగుపడవో
No comments:
Post a Comment