ఈశ్వరా మహేశ్వరా నా మాయను చేకొనరా
మాయా సోమరి రేపు మాపనుచు నీ మానస పూజను మరపు చేస్తున్నది
అదును చూసిన మాయ కాముడు మనసును మురిపించి నిన్నే మరిపిస్తున్నాడు
బుద్ది విబ్రాంతి తో నీదారిని వీడి పలుదారుల పరుగిడిచున్నది
గమ్యమెరుగని గమనంతో హృదయం అలజడితో అలసిపోతుంది
క్షణమాగని కాలం ఈ కట్టె ను పడగొట్టుటకై పరుగులు తీస్తున్నది
విరామమెరుగని ఆరాటం ఆనందాన్ని ఆవిరిచేస్తున్నది
ఈ అగమ్య స్తితిలో దొరికేరా హర నీ నామ సంకీర్తనమనే దివ్యాస్త్రమొకటి
ఓం నమో నారాయణాయ నలిగిన నవనాడులుప్పొంగెర నిను తలచి తలచి
ఇక నీమాయను నీవే చేకొనర ఈశ్వరా మహేశ్వరా!
No comments:
Post a Comment