మెరుపు
వాన కావి చీర చుట్టుకున్న ఆకాశ కాంత నడుముకు చుట్టుకున్న వడ్డాణపు కాంతి మెరుపు
చెలి నగుమోము పై పూచే చిరు దరహాస చంద్రిక మెరుపు
దొండ పండు వంటి పెదవులపై పూచే ముత్యపు బిందువులను తాకిన సూర్య కాంతి స్పందన మెరుపు
విచ్చుకున్న పెదవుల నడుమ తళుకు మంటున్న ముత్యాల పలువరుస పూయించే కాంతి మెరుపు
గులాబీ రెక్కల వంటి చెలి బుగ్గల సిగ్గు మరక మెరుపు
నల్లని సిగలో తురుముకున్న మల్లెల సొబగు మెరుపు
నెచ్చెలి ఆలోచనలతో హృదయాకాశం లో వెల్లివిరిసే ఆనందాతిశయమ్ మెరుపు
No comments:
Post a Comment