Wednesday, October 1, 2008

షాపింగ్ shopping


సాయం సమయం 6.30 కావస్తుంది………గుండెల్లో దడ దడ ఇంతలో ఆకాశం లో ధట్తంగ కమ్ముకున్న మేఘం …….రక్షిస్తుండిలే అని మినుకు మినుకుమన్న ఆశ…….. వాన పడితే ఏమీ మొక్క మోలుస్తుందా అన్న హుకుం…….. కమ్ముకున్న….కురియని వరుణుడు………వెళ్ళక తప్పని …పరిస్థితి ఏమిటో ఈ వరుణుడు… ఈ మధ్య అందరికి స్త్రీ పక్ష పతమ్ పెరిగిపోతుంది…దీనిని తీవ్రం గా ఖండిస్తున్న. అదిగో కూతావేటు దూరంలో ధఘధగా మెరుపులతో విద్యుల్లథ కాంతులతో మగువల మానస చోరిణి…………..మగవారి పాలిత మానసిక క్షోబినీ…… ముద్డొచ్చే ముద్దబంతుల సమాహారం……..చూద్డమన్న చూడనివ్వనీ ఇంతుల చీరంగం అపూర్వ సోయగాల వస్త్ర లోకం……నిమిషాల్లో జేబులు ఖాళీ చేసే మాయా ప్రపంచం అదే ……………

వస్త్రలత

బహుశా లోనికి వెళ్ళాక టెన్షన్ తో పుట్టే వేడిని challarchataanikaa .అన్నట్లు….ఐస్ క్రీమ్ కోన్ తో సముదాయింపు. సరే అదుగిడామ్ లోనికి…………….బాగుంది………..ఎతుచూసినా…………శిల్ప సుందరీమణులకు వన్నె తెచ్చిన వెలుగు జీలుగుల వస్త్రమాలికలు……….. ఆహ..అని మురిసెంత లోపే………….చూడండి………అన్ని వైపులా……..ఏ షాప్ ముందు డిస్ప్లే లో డ్రెసస్ బాగున్నాయో………ఆ షాప్ లోకి వెలదామ్…………..గాండ్రింపూ.


సిల్క్ డ్రెస్ సౌందర్యమా………..కాటన్ డ్రస్ సౌకర్యమా……….సతీమణి సందిగ్ధత……..

ముందు అసలు ఏదో ఒక షాప్ లోకి వెలదామ్……..పతి దేవుడి వెడ్కోలు….

అబ్బా….అంత తోదరైతే ఎలా మీకు……..అందుకే మా కొలీగ్స్ తో రావాలి…….. మెమైతే 10 షాపులు తిరిగి……….200 రకాల డ్రెస్సులు చూసి……ఆది అలా ఉంది …..ఇది ఇలా ఉంది అని వాటి గూర్చి చెప్పుకుని……….చివరకు ఏమీ కొనకుండా 4 గంటలు కాలక్షేపం చేస్తాం తెలుసా……పెళ్ళాం నిరసన.

అవును, ఇప్పుడు డ్రెస్ ఎందుకు…………ఎలెక్ట్రికల్ రైస్ కుక్కర్ అయితే………అలా పడివుంటది కదా………..నా మొగుడు ఇన్క్రిమెంట్ తో నాకు కొనిచ్చడన్న గుర్తుగా……..ఆలి సరికొత్త ఆలోచన…….

మళ్లీ మొదలు……….మంగళగిరి చెనెతల ప్రపంచం నుండి………..డిజిటల్ షాప్ జాణవులే ……….నేరాజాణావులే…………

రైస్ కుక్కర్ లనుంది సాగిన సందడి……………………వాషింగ్ మెషిన్ తో బ్రైన్ వాష్ చేయటం తో సమాప్తి అయ్యింది………. కుక్కర్ సెలెక్ట్ చేయగానే………….పవర్ కట్………….రాబోయే రోజుల్లో ఆది మనకివ్వబోయే షాక్ లకు ఇండికేషన్. 1200 లతో డ్రెస్ కొనుకుందామని వెళ్ళి 12600 కు డ్రెస్ వాష్ చేసే యంత్రానికి టెండర్ వేయటం ద్వారా ఆ షాపింగ్ ముగిసింది తాత్కాలికంగా…… చివరకు ఏమీ కొన్నాము షోపింగ్ లో……….వెనుతిరిగి చూస్తే……… 2 మిరప బజ్జీ……..2 ఆలు బజ్జీ……………50గ్ర్యామ్స్ జిలెబి

with the inpiration of STAR trekker
(startrekker.rediffiland.com/ )