వెండికొండపై తెల్లని వర్ణంలో ప్రకాశించు
సదాశివుడు సకల శుభాలు నోసగుగాక
నల్లనివాడు పద్మనయనంబులవాడగు నారాయణుడు
సదా మనలను గాచుగాక
ఎర్రని వర్ణంతో శోభిల్లు సర్వమంగళను సగభాగంగా కలిగి
వున్న శంకరుడు సర్వమంగళకరమగు జీవితమొసగుగాక
పసుపుపచ్చని పసిడి పీతాంబరదారియగు విష్ణువు అష్టైశ్వర్యాలు
ప్రసాదించునుగాక
ఆకుపచ్చని ప్రకృతికాంతను తన ఆధీనంలో వుంచుకున్న పశుపతి
మనసుకు ఆహ్లాదమొసగుగాక
నీలవర్ణపు తారకలను బ్రమింపజేయు పాలకడలి అలలబిందువులతో
నిండిన దేహం కల నాగ శయనుడు మనలకు తన పాదపద్మముల కడ చోటునోసగుగాక
కాషాయాంబరధారి కాశీ విశ్వనాధుడు మనకు మోక్షమొసగును గాక
అందరికి ఆనందకరమైన హొలీ శుభాకాంక్షలు
--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA

No comments:
Post a Comment