Monday, June 17, 2013
హర నీ కనులతో కాంచిన హరి వైభవం
పోతన మనసును తాకి భాగవత కధా సుధగా జాలు వారే కద
శివ నీ స్మరణలో నలిగిన రామ నామ రసం
తులసీదాసు హృదిని చేరి రామ చరిత మానస మయ్యే కద
భవ హరి భక్తుల వైభవమెరిగిన నీ మానసం
హనుమ గా మారి భక్త జనులపాలిట కామదేనువయ్యే కదా
శంకర విష్ణు స్మరణ ఫలిత మెరిగిన నీ జ్ఞానం
ఆది శంకరులు గా మారి గోవింద నామ ప్రవాహ మొనర్చె కదా
సాంబ సదా శివ నారాయణ హృదయమెరిగిన మీ హృదయం
గరళాన్ని పానం చేసి లోక రక్షకుడివై నిలిచే కదా
క్రిష్ణ శివుని సామర్ధ్య మెరిగిన నీ మేధస్సు
అర్జునుడి అమ్ముల పొదిలో పాశుపతమై నిలిచే కదా
నారాయణా మన్మధ వైరి మనస్సేరింగిన మీరు
నారాయణి ని హరుని అర్ధాంగి ని చేసి మురిసితిరి కదా
హరి హర ఒకరిపట్ల నొకరు కడు ఆత్మీయ భావంతో మీరుండ
వీరు గొప్పంటే కాదు వారు గొప్పని భేధ భావం చూపే మా
మనస్సుల మాయ పొరలు తొలగించుమా హరిహరా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment