బాల్యం ఒక తీయని జ్ఞాపకం.
వెనుతిరిగి చూస్తే లెక్కలేనన్ని అనుభూతులను ఆనందాలను కనులముందు కదిలిస్తుంది.
వేగం గా పరుగెడుతున్న యాంత్రిక జీవనం లో అలసిన మనసును తిరిగి వురకలు వేయించు ఓషదం.
జీవితమనే కావ్యం లో అందమైన గీతిక
అందులోని కొన్ని చరణాలను కదిపి చూస్తే , రాలిపడ్డ రాగమాలికలివి
మామూలుగా, ఇంట్లో ఒక ఆడ పిల్ల తిరుగుతుంటేనే లక్ష్మి కళ వుట్టిపడుతున్దన్టారు
అలాంటిది మువ్వురు మహా లక్ష్మిలు ఒక చోట చేరితే?
ఇంకేమన్నా ఉందా………. ఇల్లు పీకి పందిరి వేయరూ…….
అలా ఆట పాటలతో, చిలిపి చేష్టాలతో సందడిగా సాగిపోయిన నా చిననాటి జ్ఞాపకాలే నాకు నిజమైన నేస్తాలు.
వాటి లో కొన్ని
బహుశా అమ్మమ్మ ఒడిలో విన్న కథల ప్రభావమేమో,
నాతో గొడవ పడిన ప్రతీసారి మా అక్కా నన్ను శపిస్తున్డేది
చేతి లో చెంబు పట్టుకుని నీళ్ళు చిమ్ముతూ …………కుక్కవై పో…అని
బిక్కమొగమ్ వేసుకుని నేనున్టే
మా అత్త, ఎవరైనా శపిన్చినపుడు చేయి అడ్డం పెట్టుకున్టె ఆది ఫలించదని వూరడిన్చేది.
ఓ! గుట్టు తెలిసిందిగా మా అక్కా మాయాల మరాటీ ….నేను ..బాల నాగమ్మ……… ఒంటి చేత్తో శాపం తిప్పికొడతా పెద్దలు వద్డన్నది చేయటమే బాల్యం.
మా అక్కకు నాకు జీవ్వు మనిపిన్చే చింత పులుపంటే తగని మక్కువ. ఎవరు చూడకుండా ఇద్దరం పిల్లుల్ల వంటింట్లోకి దూరి డబ్బాలు వెతికి మరీ సాధించేవాళ్ళం…..చింతపండు ని.
ఏవరూ చూడలేదని , ఓ మూలకు చేరి చింత పులుపు ఆస్వాదిన్చేవేళ
అలా చింతపండు తింటే చెవుడు వస్తుందే…….నానమ్మ ప్రేమతో కూడిన బెదిరింపు
ఆ పులుపు ముందు ఈ పుల్లని మాటలు రుచించేవి కావు.
ఓ రోజు మా ఇంటికి వచ్చిన పెద్దాయన……..చెవుడు తో ఇబ్బంది పడేవాడు ఎంత అరచి చెప్పిన వినబడేది కాదు.
అంటే ఈయన కూడా చిన్నప్పుడు బాగా చింత పండు తిన్నాడన్నమాట,
ఆ క్షణం మొదలు…..చింత పండు వాడిన పదార్ధమేది మా దరి చేరనివ్వలేదు .
ఇక వానాకాలం వచ్చిందంటే ఆ సంతోషమే వేరు
కాగితపు పడవను ఇంటి ముందు నిలిచిన నీటి మదుగులో వదిలి కేరింతలు కొడుతూ, ఆది ఎక్కడ టైటానిక్ లా మునుగుతుందో అని రాత్రి పూట నిదుర కాచి ఆ కాగితపు పడవను కాచుకున్న క్షణాలు………
మేరుస్తున్న ఆకాశపు కెమెరా కు మా అక్కా నేను మెరుపు తీగల వలె ఫోజులిచ్చినా క్షణాలూ
ఈ చిన్ని గుండెలో ఇంకా పదిలం.
వెనకింటిలోకి దొంగల్లా జొరబడి నేరేడు పండ్లు తెచ్చుకున్న కాలం ఓ తీపి గుర్తు.
ఇక ముగ్గురం ఒక చోట చేరి పెద్ద ఆరిన్దాల్లా………..
సైకిల్ తొక్కతమంటే ఇష్టపడే అక్కయ్య పెద్దయ్యాక సైకిల్ కొనుక్కుంటానంటే,
తనకన్నా పైమెట్టులో వుండాలన్న పంతం కల నేను….కారు కొంటానన్నను
చిట్టి చెల్లి …………పెద్దక్క .రెండు చక్రాలు, చిన్నక్క……….నాలుగు చక్రాలు……..నేను ఏంచక్క మూడు చక్రాలున్న ఆటో కొన్టనన్నది.
ఇడ్లీ అన్న ఆటో అన్న ఇశ్టపడే తనను, అయితే ఒక డ్రమ్ములో చట్నీ, ఇంకో డ్రామ్ము లో ఇడ్లీ లేసుకుని ఆటో లో తిరగమని ఉడికించిన క్షణం.
ఇంటికి వచ్చిన ఆతిది కోసం పెద్ద గిన్నె లో టి కాస్తున్న చెల్లిని, బకెట్ నిండుగా తీసుకెళ్ళి, తాగటానికి ఒక మగ్ కూడా ఇవ్వమని ఆటపట్టిన్చిన క్షణం అన్ని నా మది లో పదిలం
ఈ అనుబందాలు ఆప్యాయతలు కలకాలం నిలిచిపోవాలని చిన్ని కృష్ణుని కోరుకుంటున్నా.
1 comment:
బావున్నాయండీ ..మీ బాల్య స్మృతులు ....బంగారు బాల్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం ....
Post a Comment