
బృందావన వీదుల తిరిగేని దేవకీ సుతుడు
గోపికల మురిపించు సింగారముల తోడను
వెన్న మీగడల దొంగిలించు నొకమారు
ఆల మందల అంబా రవముల మురిసేనోకమారు బృందావన
ఆటపాటల గోపబాలకుల అలరించు నొకమారు
అల్లరి చేష్టలతో రక్కసుల దునుమార్చు నొకమారు బృందావన
గోవర్ధనమెత్తి ఇంద్రుని అహమణిచే నొకమారు
గోవత్స బృందమంతయు తానై గోకులమునకు ముదమోనర్చే నొకమారు బృందావన
కాళింది శిరమున తాండవమాడే నొకమారు
గోపికల కూడి సరస సల్లపములాడే నొకమారు బృందావన
యశోద మమతల త్రాటికి బంది అయ్యేనోకమారు
విస్వమునెల్ల నోట బంధించి చూపే నొకమారు బృందావన
వలువలు దాచి గోపికల వ్యామోహ ధనం దోచే నొకమారు
భిక్ష కోరి బ్రహ్మణ సతుల మోక్షమొసగే నొకమారు బృందావన
ఎల్లమారులు నా మనోబృందావనమున నడయాడి
రోగములను పాపములను పరిహరించే ని వాసుదేవుడు బృందావన
pic: stiphen
No comments:
Post a Comment