అప్పటి వరకు భానుని ప్రతాపాగ్ని కి బీటలు వారి బీడు బారిన భూమి తొలకరి జల్లు స్పర్శతో పులకరించి వెలువరించే మట్టి గంధపు వాసన ఆస్వాదించాల్సిందే కానీ , వివరించటం సాధ్యం కాదు నల్లని దట్టమైన నీరుకావి రంగు పంచె కట్టిన వాన దేవుడి పలకరింతకు ప్రతిగా ,
పుడమి కాంత లేత ఆకు పచ్చ చీర తో సోయగాలు చిందిస్తుంది.
అప్పటి వరకు నీలి వర్ణం లో నిర్మలం గా ఉన్న ఆకాశం నల్లని దట్టమైన రంగు లోకి మారి మేఘ గర్జనాలతో పిడుగులు కురిపిస్తుంది
వెలిగి పోతున్న చంద్రుడు నల్ల మబ్బు చాటున దాగిన వేళ మిణుగురల కాంతి దారి చూపుతుంది
ఎండిన గొంతుకతో నోళ్ళు తెరిచిన పిల్ల కాలువలు , బిర బిరా పరుగులు
వరకు బంధు మిత్రులతోను , కళల పోషణ లోను సేద దీరిన రైతన్న తిరిగి వ్యవసాయానికి సిద్దమవుతాడు వారి నాట్ల తో పంట చేలు సందడి గా వుంటాయి
ఆ సందడి సవ్వడి విన్న ఓ సినీ కవి…..ఇలా పాడుకుంటున్నాడు
ఓరి…. ఓరి……. వారి చేలో ఒంగుని చిన్నది నాటేస్తున్టే తొంగి చూసిన సూరీడైనా డన్గై పోతడురో
అంటూ
ఇంటి ముందు కాలువ కట్టిన నీటి ని చూస్తు, కాగితపు పడవలు చేసి వాటి తో పాటుగా మనం ఆ నీటి లో షీకారు కెళితె
ఎంతటి అందమైన వానా కాలపు బాల్యమో కదా
లాహిరి ……….లాహిరి లో
చూరు నుండి కారుతున్న వర్షపు నీటి ధారలను చూస్తు, వేడి వేడి పల్లీలకు కారం అద్దుకు తింటూంటే………
వాహ్ వా ఏమీ రుచి అనరా మైమరచి
ఆకాశపు నుదితి నుండి రాలైన నీటి చుక్క చినదాని కింది పెదవి పై చేరి ముత్యపు చినుకై మురిసిపోతుంది.
సాయంకాలం షీకారు కెళ్ళిన చిన్నది చిన్నవాడు ఒక్కసారిగా వాన జల్లు లో తడిసిపోతే
చెలి శిరము నుండి నాశిక మీదుగా, చిరు గడ్డం చేరి ఒక్క వుదుటన ఎదను తాకుతున్న జలధారలు చినవాడి గుండెల్లో గుబులు రేపుతుంటే,
దూరంగా పడిన పిడుగుపాటుకు చెలి తత్తరపాటూ తో జతగాడి ని హత్తుకుపోతే
పుట్టిన ప్రణయ కావ్యమే
చిట పట చినుకులు పడుతూ వుంటే
చెలికాదే సరసన వుంటే
చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగేడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దోయి.
వడగాడ్పులతో ఉడుకెత్తించిన వేసవినిక పొమ్మంటు
రాబోయే వర్షాకాలానికి రా రమ్మని, రా రారమ్మని ఆహ్వానం పలుకుతూ యెంతటి రొమాంటిక్ కాలమీ వర్షాకాలం
ప్రకృతిని ఆస్వాదించమని భగవంతుడు ఇచ్చాడు
కోరి వినాశనకరం గా మనిషి చేసుకుంటున్నాడు
No comments:
Post a Comment