
నిజం నీవు నీడను నేను
నిశ్శభ్దమ్ నేను ఛేదించే వేణు గాన తరంగం నీవు
మౌనం నేను ఆహ్లాదం కలిగించే మదుర భాషణ నీవు
తీరం నేను నిన్ను తాక ఎగిసిపడే కెరటం నీవు
మండించే వడగాల్పు నేను
సేద తీర్చు శీతల పవనం నీవు
ఉదయ సంధ్యలో భానుని తొలి కిరణం నేను
నా స్పర్శ తో వికసించే నవ కమలం నీవు
మలి సంధ్యలో చందురుని అమృత కిరణం నేను
పరవశించే కలువ బాలవు నీవు
ధీర గంభీరంగా సాగే సముద్రుడను నేను
నన్ను చేర పరవళ్ళు తొక్కుతూ పారే నిర్మల నది తుంగ వు నీవు
మాదురీ మదురిమల గ్రోల పరుగులుతీసే తుమ్మెద ఝూంకారం నేను
ఎద మదువుని పంచి హృదయంలో బందీం చే పూబాలవు నీవు
తొలకరి చిరు జల్లు నేను
నా తాకిడి కి తన్మయత్వం తో నన్నలుముకునే మట్టి గంధపు వాసన నీవు
నిన్ను తాక వచ్చు మలయ మారుతం నేను
నాలో పరిమళాలు నింపే మల్లి వి నీవు
ప్రేమ తాపంతో ఎగసిపడే అలవు నీవు
బంధించే గట్టును నేను
చిరు గాలి స్పర్శకు చిగురుటాకులా వణికే అధరమ్ నీవు
ని అధర స్పర్శ కోరి పెదవుల పై బాగాన నిలిచిన స్వేద బిందువు నేను
చిలిపితనం, ప్రేమ కలబోసిన అమాయకపు అల్లరి పిల్లవు నీవు
ని అల్లరి నా ఎదలో జన్మ జన్మలకు ఝుల్లరి చేయలని కోరుకునే ప్రేమ పీపాసి ని నేను
నిజం నీవు నిన్నంటే నేను
No comments:
Post a Comment