చిలకరింపుమా దయాజలధి మాపై ఘనశ్యామా
మానస తరంగాల మధురభక్తి మొలకెత్తి మాధవా
సంసారజలధి దాటి మోక్షఫలమొంద ముకుందా
హరిని చేరనివ్వని అరివర్గమును ఛేదించి మురారీ
నిర్మల నిరతిశయ ప్రేమభావనతోడ రాధామాధవా
విశ్వవీక్షణలో సర్వము నిన్ను కాంచ వాసుదేవా
గోలోకం నుండి గోకులం చేరితివా యదునందనా
No comments:
Post a Comment