కలహమునకు కాలు దువ్వించు కుజుని కట్టడి చేయలేక
కమల సదృశములగు నీపాదముల నాశ్రయించితి సహన
కంకణం కంఠసీమ నిలిపి మృదు వచనములు పలికించవే

లక్ష్మీకిరణు హృదయ నివాసీ గోవిందా దామోదరా
చిరాకు ప్రేరేపించు సౌమ్య రూపుడగు బుధుని తాళలేక
శాంతము కోరి నీ పాదముల శరణు జొచ్చితి శాంతమూర్తీ
నీ చూపుల చల్లదనంతో హృది చల్లబరిచి శాంతత నొసగవే

లక్ష్మీకిరణు హృదయ
నివాసీ గోవిందా దామోదరా
నీ దారి నడవనెంచిన నా పాదములను పెడదారి పట్టించ
సద్గురుడు బృహస్పతి పూనిన వేళ దిక్కుతోచక నీ పాద
పద్మముల పై దృష్టి నిలిపితి దయాళు నీ దారి చూపవే
సద్గురుడు బృహస్పతి పూనిన వేళ దిక్కుతోచక నీ పాద
పద్మముల పై దృష్టి నిలిపితి దయాళు నీ దారి చూపవే
లక్ష్మీకిరణు హృదయ నివాసీ గోవిందా దామోదరా
భాగ్యముల నొసగు భార్గవుడు నను అభాగ్యుడిగా
చేయ నెంచినవేళ శ్రీయ:పతీ నా శిరము శ్రీ కరముల
నిత్య సేవఁలొందు నీ పాదముల నిలుపు భాగ్యమొసగవే
చేయ నెంచినవేళ శ్రీయ:పతీ నా శిరము శ్రీ కరముల
నిత్య సేవఁలొందు నీ పాదముల నిలుపు భాగ్యమొసగవే
లక్ష్మీకిరణు హృదయ నివాసీ గోవిందా దామోదరా
చేసిన చేష్టలు ఛాయలా వెన్నంటి ఛాయానందనుడు
ప్రతిక్రియల రూపంబున ఇచ్చు ఫలములు పరితపింప
చేయ చల్లని నీ పాదంబుల పడితి చిత్తస్థైర్య మొసగవె
ప్రతిక్రియల రూపంబున ఇచ్చు ఫలములు పరితపింప
చేయ చల్లని నీ పాదంబుల పడితి చిత్తస్థైర్య మొసగవె
లక్ష్మీకిరణు హృదయ నివాసీ గోవిందా దామోదరా
ఆరోగ్యమొసగు దినకరుడు ప్రతికూల భావనలతో తనువును
తపింపచేయు వేళ తానే నీవని తలచిన మాత్రమున శతకోటి

సూర్యప్రభల వెలుగు నీ పాదముల పై నా భావనలు నిలుపవే
లక్ష్మీకిరణు హృదయ నివాసీ గోవిందా దామోదరా
ఆహ్లాదమిచ్చు చందురుడు మనఃసంద్రమును ఆటుపోట్ల
కల్లోలపరచువేళ విశ్వ మోహనుఁడా మా మనంబుల నీ
పాదరేణువుల స్పర్శతో కదలికలు లేని క్షీరాబ్ధి చేయవే
లక్ష్మీకిరణు హృదయ నివాసీ
గోవిందా దామోదరా
చంచల చపలత్వముల రాహుకేతులు నన్నల్లరి పాల్చేయు వేళ
తిరుమల గిరులపై స్థిరముగా నిలచిన నీ పాదముల నాశ్రయించితి
నీ నామస్మరణ ఎరుక తప్ప అన్యములేమి కోరని బుధ్ధినొసగుమా
కల్లోలపరచువేళ విశ్వ మోహనుఁడా మా మనంబుల నీ
పాదరేణువుల స్పర్శతో కదలికలు లేని క్షీరాబ్ధి చేయవే
లక్ష్మీకిరణు హృదయ నివాసీ
గోవిందా దామోదరా
చంచల చపలత్వముల రాహుకేతులు నన్నల్లరి పాల్చేయు వేళ
తిరుమల గిరులపై స్థిరముగా నిలచిన నీ పాదముల నాశ్రయించితి
నీ నామస్మరణ ఎరుక తప్ప అన్యములేమి కోరని బుధ్ధినొసగుమా
లక్ష్మీకిరణు హృదయ నివాసీ గోవిందా దామోదరా
కమల లోచనా వేన వేల కాంతులు విరజిమ్ము నీ
కనులు కురిపించు మాపై కారుణ్యామృత బిందువులు
మము దహించు కర్మఫలముల కాలాగ్నులు చల్లారగా
లక్ష్మీకిరణు హృదయ నివాసీ గోవిందా దామోదరా
కాలు మడతపడదాయే కనురెప్ప మూత పడదాయే కాలం
కదిలిపోతున్నా కాయం కదలనీయక కాలచక్రంలో తిరిగాడు
మా పై దయావర్ష మనుగ్రహించ నిలచితివా తిరుమలగిరిపై
లక్ష్మీకిరణు హృదయ నివాసీ గోవిందా దామోదరా
No comments:
Post a Comment