అంతా క్రిష్ణమయం నా ఒడలెల్ల క్రిష్ణమయం
కనుల నిండుగా గోవింద రూపం
నాలుక పండించే వాసుదేవ మంత్రం
కర్ణముల కింపయ్యనే క్రిష్ణ లీలలు
నాసిక శ్వాసించే గోపి లోలుని వనమాలికా గంధం
అంతా క్రిష్ణమయం నా ఒడలెల్ల క్రిష్ణమయం
హృదయ కమలమున కోరి నిల్పితి కమల నాభుని
కరముల పురిగొల్పితి కరి వరదుని సేవకు
ఉదరం వాసమయ్యే దామోదరునకు
పాదములు నర్తించే రాదా ప్రియ మురళీ రవముకు
అంతా క్రిష్ణమయం నా ఒడలెల్ల క్రిష్ణమయం
శిరము నుండి కొనగోటి వరకు నర నరముల
నలు చెరగులా నడుచు చుండె నీల మేఘ శ్యాముడు
తనువుకు చైతన్యమై , కార్యములకు కర్తయై
సుఖ దుఖంబుల భోక్తయై నా ప్రభువై నిలిచేనే గోవిందుడు
అంతా క్రిష్ణమయం నా ఒడలెల్ల క్రిష్ణమయం
No comments:
Post a Comment