కథమహమితి చేతో మా స్మ గాః కాతరత్వమ్ ।
సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా
నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యమ్ ॥ ౧౩ ॥
దాటశక్యం కాని సంసార సాగరం చూసి
దిగులు చెందకు ఆందోళన విడుము
నిన్నావలి తీరం చేర్చగలడు
తృష్ణాతోయే మదనపవనోద్ధూతమోహోర్మిమాలే
దారావర్తే తనయసహజగ్రాహసంఘాకులే చ ।
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ ॥
కోరి వరించిన భార్య తత్ఫల సంతానం
సంపదలనే
మూడు భంధనాలపై
మదనుడిమోహబాణపు తాకిడికి
పెంచుకున్న వ్యామోహంతో
జనన , జీవన మరణాలనే
మూడు సరస్సులలో పలుమార్లుమునకలేస్తున్న
నాకు ముకుందా నీ భక్తి అనే పడవలో
కొద్ది చోటు కల్పించు
పృథ్వీరేణురణుః పయాంసి కణికాః ఫల్గుస్ఫులింగో లఘుః
తేజో నిశ్శ్వసనం మరుత్ తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః ।
క్షుద్రా రుద్రపితామహప్రభృతయః కీటాః సమస్తాః సురాః
దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధిః ॥ ౧౯ ॥
ముకుందా! నీ కడగంటి చూపు తో పృథ్వి ధూళి రేణువు సమమవ్వు
అనంత జలధి ఒక్క బిందు పరిమాణమయ్యే
బడబాగ్ని చిన్న అగ్నికణం గా గోచరిస్తుంది
ప్రచండమైన వాయువు చిరుగాలి లా ఆహ్లాదపరుస్తుంది
అంచులేరుగని ఆకాశం చిన్న రంధ్రమై చిక్కపడుతుంది
సమస్త దేవతా సమూహం బృంగ సమూహాలను మరిపిస్తుంది
కృష్ణా సమస్తము నీ పాద ధూళి లోనే ఇమిడియున్నది కదా
No comments:
Post a Comment