సృష్ట్యాదివి నీవు సృష్టి అంతము నీవు ఆది అంతముల
నడుమ సాగు జీవన యానపు మూల కారణమగు కర్మ
రూపుడవు నీవు కర్మ ఫలముల దోషము పరిహరించి
ఆరోగ్య మీయవే లక్ష్మీకిరణ్ ప్రియభాంధవా
జల ప్రళయ ఘోష తక్క జీవమేది మిగలని చోట చేప
రూపమెత్తి చుక్కాని పట్టి సత్య వ్రతుని కాచి వెలుగు రేఖలు
వెదజల్లిన మత్స్యరూపధారి మా పాపములు హరియించి
ఆరోగ్య మీయవే
లక్ష్మీకిరణ్
ప్రియభాంధవా గురువాయూరప్ప
బొటనవ్రేలి ప్రమాణమున బ్రహ్మ నాశిక నుండి బయల్వెడి క్షణ
కాలంబున సకల భువన ప్రమాణంబు పెరగి నీట మునిగిన నేల
నుద్ధరించి ధరణీ ధరుడైవితివి యజ్ఞ వరాహ మూర్తి నన్నుద్ధరించి
ఆరోగ్య మీయవే
లక్ష్మీకిరణ్
ప్రియభాంధవా గురువాయూరప్ప
అనంత జలరాశి జొచ్చి అసురుని వధియించి వేదరాశి ని
తెచ్చి జీవ జాతికి చైతన్య మిచ్చినాడవు హయగ్రీవుడా నా
హృదిని జొచ్చి అంధకారము బాపి జ్ఞాన జ్యోతులు వెలిగించి
ఆరోగ్య మీయవే
లక్ష్మీకిరణ్
ప్రియభాంధవా గురువాయూరప్ప
మంధర పర్వతము కవ్వము చేసి వాసుకిని తాడుగా చుట్టి
సురాసురులెల్ల పాల సముద్రము చిలుకు వేళ నీట మునుగు
కవ్వము కుదురు చేయగా కూర్మరూపుడ వైతివి కరుణతోడ
ఆరోగ్య మీయవే
లక్ష్మీకిరణ్
ప్రియభాంధవా గురువాయూరప్ప
కలడు కలండని నిశ్చయాత్మక బుద్ధి తో మనో వాక్ కర్మలను
నీకర్పించిన బాలుని ప్రహ్లాదుని మాట నిజము చేయ స్తంభము
నుండి వెలువడిన నారసింహుడవు నా బుద్దిని నీపై స్థిర పరచి
ఆరోగ్య మీయవే
లక్ష్మీకిరణ్
ప్రియభాంధవా గురువాయూరప్ప
వామనుడై మూడడుగులు యాచించి రెండడుగులతో
ముల్లోకము లాక్రమించిన త్రివిక్రమా మూడవ అడుగు
మా హృదయ పద్మము నందుంచి త్రిగుణముల గెలిపించి
ఆరోగ్య మీయవే
లక్ష్మీకిరణ్
ప్రియభాంధవా గురువాయూరప్ప
నీ పాద స్పర్శతో పుడమి తల్లి పులకించగా నలు చెరగుల
నడయాడితివి నరుడవై నారాయణా శ్రీరామ నామాంకితుడవై
నీ నామ స్మరణామృత ధారలలో తనువెల్ల తడిసిపోగా
ఆరోగ్య మీయవే
లక్ష్మీకిరణ్
ప్రియభాంధవా గురువాయూరప్ప
క్రిష్ణ క్రిష్ణా యన్నంతనే ఎద పొంగు మది వేణుగాన మాలపించు
గోవర్ధనమెత్తి గో సమూహము నెల్ల కాచి గోవిన్దుడవైతివి మా మది
ఆనంద బృందావని చేయగా అహంకార కాళింది పై తాండవ మాడుచు
ఆరోగ్య మీయవే
లక్ష్మీకిరణ్
ప్రియభాంధవా గురువాయూరప్ప
సంకటములు హరియించు నీ పాద పద్మముల చూపుతూ
నిలచితివి కనులెదుట వేంకట రమణా గోవిందా యనుచు
కర్మలు నీ పాదార్పితములు చేసి తిరుమల గిరులను చేరగ
ఆరోగ్య మీయవే
లక్ష్మీకిరణ్
ప్రియభాంధవా గురువాయూరప్ప
No comments:
Post a Comment