వేణుగాన తరంగాలు వీనుల తాకిన తోడనే
తడబడిన హృదయాలతో త్వరపడి పరుగులు
తీసిరి గోపాంగనలు బృందావని వైపు వడివడిగా
తామున్న తీరును మరచి వేణుగోపాలుని చేర
తడబడిన హృదయాలతో త్వరపడి పరుగులు
తీసిరి గోపాంగనలు బృందావని వైపు వడివడిగా
తామున్న తీరును మరచి వేణుగోపాలుని చేర
వేణువు ఆలాపన ఆలకించగనే అంబారావముల
పొదుగుల పాలధారలు పొంగించే యిబ్బడిముబ్బడిగా
సురభి సంతు ఒద్దికగా గోపాలుని చేతులలో ఒదిగే
లేగలు గంతులు మాని ప్రకృతియెల్ల పరవశించే
నిమిషమైన నిలకడగా నీ వేణుగాన స్వర ఝరులు
ధ్యానించ నానా విధముల గాలుల తాకిడిలో మది
చెదరుచుండె గోవిందుడా నీ వేణుగాన తరంగాల
లీనమై ఆహ్లాదమొందు అనుభవమీయవయా లక్ష్మీ కిరణులకు
No comments:
Post a Comment