చెలికాండ్రు గోపబాలక సమూహముతో అచ్చట
ముచ్చటలాడుతూ వనములందు వారు తెచ్చిన
చద్దిఅన్నము అదరమున ఆరగించితివి
ముచ్చటలాడుతూ వనములందు వారు తెచ్చిన
చద్దిఅన్నము అదరమున ఆరగించితివి
హితుడవని విశ్వసించి నీ చెంత చేరిన సుధాముని
చేలమున దాగిన అటుకులు ప్రీతితో గుప్పెడు స్వీకరించి
సిరిసంపదలు అడగకనే అపారముగా ఒసగితివి
ప్రియసఖుడగు ఫల్గుణి రధసారధివై
భీష్మద్రోణాది భీకర మకరములతో
ఉప్పెనలా వచ్చిన కౌరవ సేనా సాగరమును
ఒడుపుగా దాటించి ఆత్మబంధువై నిలిచివుంటివి
హితుడవని ఆత్మీయుడవని నమ్మి
నీ పాద పద్మములు మా హృదిని
నిలిపితిమి లక్ష్మికిరణుల ఆర్తి నెఱింగి
ఆప్తుడవై నీ స్నేహ మాధుర్యము రుచి
చూపవయా గోపీజనవల్లభా గోవిందా
No comments:
Post a Comment