Monday, December 9, 2024

ముకుందమాలా స్తోత్రం-3

చింతయామి హరిమేవ సంతతం
మందమంద హసితాననాంబుజం
నందగోపతనయం పరాత్ పరం
నారదాదిమునివృందవందితమ్ ॥ ౮ ॥

తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం    
 వలే మా  మనస్సులను  రంజింపజేయు   మందస్మిత 
వదనార  విందా   పరమ  సత్యమైనట్టివాడ  నంద గోప తనయా
  నారదాది  మునింద్రులచే  కీర్తించబడు  హరీ  ఎల్లప్పుడూ  
నిన్నే   తలచెదను

కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే.       

శ్రమముషి భుజవీచివ్యాకులేఽగాధమార్గే ।
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్నః ఖేద మద్యత్యజామి ॥ ౯ ॥

నీ  కర  చరణాలనే  పద్మాలతో  నిండి

చల్లని  వెన్నల  బోలు  చూపులను  ప్రసరించు నీ  

చక్షువులే  చేప  పిల్లలుగా  కల  హరిరూపమనే  

సరోవరం లో  కొద్ది  జలాన్ని సేవించి  జీవనయానపు  

బడలిక  నుండి  పూర్తిగా  సేద తీరెదను   


సరసిజనయనే సశంఖచక్రే
మురభిది మా విరమస్వ చిత్త రంతుమ్ ।
సుఖతరమపరం న జాతు జానే
హరిచరణస్మరణామృతేన తుల్యమ్ ॥ ౧౦ ॥

కలువ పూల వంటి  కనులతో , శంఖు చక్రాల  తో  

విరాజిల్లు  మురారి  స్మరణ    ఓ మనసా ! ఎన్నటికి  

మరువకు  అమృతతుల్యమగు  హరి  పాద పద్మాలను  

తలచుటకన్నను  తీయని తలంపు  మరి  లేదు  కదా


మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః
నామీ నః ప్రభవంతి పాపరిపవః స్వామీ నను శ్రీధరః ।
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః ॥ ౧౧ ॥

ఓ  అవివేకపూరితమైన మనసా ! నీ   స్వామి  శ్రీధరుడు  చెంత  నుండగా  

మృత్యువు గూర్చి  నీవొనరించిన  పాపకర్మల ఫలితాన్ని గూర్చిన చింత  ఏల ?.

ఇంకను  ఆలస్యమేల?   తొందరపడు  అత్యంత  సులభుడైన   నారాయణుని 

 పాదాలను నీ  భక్తి  తో  బంధించు  నీ  బంధనాలు  తెంచుకో




భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం
సుతదుహితృకలత్రత్రాణభారార్దితానామ్ ।
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతో నరాణామ్ ॥ ౧౨ ॥

జనన మరణాలనే  రెండు  ఒడ్డుల  కూడిన  సాగరం లో  

వచ్చిపోయే  కెరటాల  వలె  నానా  జన్మల  పాలై

రాగ  ద్వేషాలనే  సుడిగుండంలో  చిక్కుకుని

భార్యా  పుత్రులు , సంపదలనే  వ్యామోహపు  మకరాల

కోరలకు  చిక్కి  చితికిపోతున్న  నాకు  మత్స్యరూపధారి   హరీ  నీవే   దిక్కు . 

దాటశక్యం కాని  సంసార  సాగరం  చూసి

దిగులు  చెందకు  ఆందోళన  విడుము

నిర్మల  ఏకాగ్రచిత్తంతో  ధ్యానించు

నరకాసుర సంహారి  నావలా  మారి  నిన్నావలి  తీరం  చేర్చగలడు

No comments: