Sunday, December 15, 2024

ముకుందమాలా స్తోత్రం-5

 మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్పదాబ్జే
మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యాన్యదాఖ్యానజాతమ్ ।
మాస్మార్షం మాధవ త్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్
మాభూవం త్వత్సపర్యాపరికరరహితో జన్మజన్మాంతరేఽపి ॥ ౧౫ ॥

మాధవా  ! నీ పాదపద్మాలపై  నమ్మిక లేనివారి  వైపు

                                               నా  చూపులు  తిప్పనివ్వకు

నీ  కమనీయ గాధా విశేషాలు తప్ప ఇతరములేవి నా చెవి చేరనియకు

నిన్ను  గూర్చిన  ఆలోచన లేనివారి తలంపు నాకు రానీయకు

నీ  సేవా భాగ్యమునుండి  ఎన్ని జన్మలెత్తినా నను దూరం చేయకు


జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణిద్వంద్వ సమర్చయాచ్యుతకథాః శ్రోత్రద్వయ త్వం శృణు ।
కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ ముకుందపాదతులసీం మూర్ధన్ నమాధోక్షజమ్ ॥ ౧౬ ॥


ఓ  నాలుకా ! కేశవుని కీర్తనలు  ఆలాపించు

ఓ  మనసా ! మురారి  స్మరణలో  మునకలేయుము

ఓ  చేతులారా ! శ్రీధరుని  సేవలో  నిమగ్నమవ్వుడు

ఓ  చెవులారా  ! అచ్యుతుని  లీలలను  ఆలకింపుడు   

ఓ  కనులార  ! కృష్ణుని  సౌందర్య  వీక్షణలో  రెప్పపాటు  మరచిపోండి

ఓ  పాదములారా ! ఎల్లప్పుడూ  హరి  ఆలయమునకే  నను  గోనిపొండి

ఓ  నాశికా  ! ముకుందుని  పాద ద్వయంపై  నిలచిన  పవిత్ర  తులసి  సువాసనలను

                  ఆస్వాదించు

ఓ  శిరమా  ! అధోక్షజుని  పాదాల  ముందు  మోకరిల్లు



హే లోకాః శ్రుణుత ప్రసూతిమరణవ్యాధేశ్చికిత్సామిమాం
యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః ।
అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం
తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికమ్ ॥ ౧౭ ।



యాజ్ఞావల్క్యాది   మహర్షులచే  తెలియజేయబడిన

జరా  వ్యాధి  మరణాల  నుండి  ముక్తి  కలిగించు

దివ్యోషధం  జనులారా  మన  హృదయాలలో  అంతర్జ్యోతి

వలె , కృష్ణ  నామం  తో  ఒప్పారుచున్నది . ఆ  నామామృతాన్ని

త్రావి  పరమపదం  పొందుదాం

No comments: