Tuesday, December 24, 2024

ముకుందమాలా స్తోత్రం-12

 


తత్త్వం ప్రసీద భగవన్ కురు మయ్యనాథే
విష్ణో కృపాం పరమకారుణికః ఖిల త్వమ్ ।
సంసారసాగరనిమగ్నమనంత దీన-


ముద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోఽసి ॥ ౩౪ ॥

ఓ  హరీ ! ఓ పురుషోత్తమా ! ఓ విష్ణు

నీవు దయా సముద్రుడవు

పాపులకు మరల మరల ఈ  భవసాగరమే

  గతి అగుచున్నది

నీ దయావర్షం  నాపై కురిపించి

నన్ను ఉద్దరించు ముకుందా


క్షీరసాగరతరంగశీకరా –
సారతారకితచారుమూర్తయే ।
భోగిభోగశయనీయశాయినే
మాధవాయ మధువిద్విషే నమః ॥ ౩౯ ॥


పాల కడలిలో అలల తుంపరలు దేహాన్ని తాకుతూ

నీలాకాశాన తారకలు వలె మెరుయుచుండగా

శేషతల్పం మీద సుఖాసీనుడవైన  మాధవా

మధుసంహారీ నీకివే నా మనఃపూర్వక  ప్రణామములు


Monday, December 23, 2024

ఆనందనిలయా

 అమృతము కన్న మిన్నయగు క్షీరము

తాగనెంచిన క్రిష్ణుని మక్కువ గని గోవిందుని
పార్శ్వము నుండి పుట్టుకొచ్చె సురభి లేగ తోడుగా పాల 
ధారలతో గోలోక బృందావని పరవళ్ళు తొక్కగా

భూభారము తొలగించు భారమున భువి చేరిన
పృధ్వీ భారనాశనునకు అలసట తీర్చి ముదము
గూర్చ గోలోకము వీడి గోకులము చేరె గో గోవత్స
సమూహము లెల్ల వురకలెత్తు  ఉత్సాహమున


  సురభి సంతుకు సంతసంబు చేయ వనంబులందు వేణువులూదితివి లేగల పదఘట్టన లో రేగిన ధూళి ఎర్రచందనం వోలే
అలుముకొంటివి ప్రేమతోడ కంఠముల కావలించుకొంటివి ఇంచుక కరుణతోడ లక్ష్మీకిరణులకు నీ ఆలింగనపు ఆనందమిమ్మా
ఆనందనిలయా

హసిత చంద్రమా


    

నిండు జాబిలి సగమై నుదురు గా నిలిచే
సంధ్యాకాంతి కుంకుమ రేఖలా భృకుటి మెరిసె
మిలమిల మెరయు తారకలు అరమోడ్పు కనుల తళుకులీనె
చంద్రికాహాసినీ నాశికాగ్రమున వజ్రపు తునక కాంతులీనె
బింబాధరపు పగడపు కాంతులతో మోము మామిడి మధురిమల ముద్దుగొలిపే
తెల్లని ముత్యాల పలువరుస మల్లెల మొగ్గలు వర్షించె
హసిత చంద్రమా అనురాగ సంద్రమా అందుకొనుమా అభినందన చందనాలు

ముకుందమాలా స్తోత్రం-11

 



దారా వారాకరవరసుతా తే తనూజో విరించిః
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గః ప్రసాదః ।
ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీ తే
మాతా మిత్రం బలరిపుసుతస్త్వయ్యతోఽన్యన్నజానే ॥ ౩౨ ॥



క్షీర సాగరుని కుమార్తె నీ అర్ధాంగి

ముల్లోకాలు సృష్టించు బ్రహ్మ నీ కుమారుడు

నిన్ను గూర్చిన స్తుతులే  పవిత్ర వేదాలు

సకల దేవతా సమూహము నీ సేవక పరివారము

ముక్తి  నోసగుటయే నీవు  ఆడు  ఆట

దేవకీ  నీ  తల్లి

శత్రువులకు అభేద్యుడగు అర్జునుడు నీ మిత్రుడు

ఇంత  మాత్రమే నాకు తెలుసు  ( నీవు తప్ప తెలుసుకోదగినది వేరేది  లేదు కదా )


శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం

కేన ప్రాపుర్వాంఛితం పాపినోఽపి ।
హా నః పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాదిదుఃఖమ్ ॥ ౨౬ ॥

ఓం నమో నారాయణా అని స్మరించినంత మాత్రాన

పాపులు కూడా ఉద్దరించబడుతున్నారు  . అట్టిది

పూర్వ  జన్మలలో  ఎన్నడు  నారాయణుని  నామ స్మరణ  

చేయకుంటినేమో  ఇప్పుడు  గర్భావాసపు  దుఖాన్ని 

భరించవలసివచ్చే 


ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితమ్ ।
సమాహితానాం సతతాభయప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీమ్ ॥ ౩౮ ॥


 హృదయ మధ్యమున  పద్మపత్రంలో  

అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు ని నిలిపి

సదా ధ్యానించు వారలకు సకల భయాలు

తొలగి విష్ణుపదం సన్నిహితమవుతున్నది



స్నేహితుడా

 


చెలికాండ్రు గోపబాలక సమూహముతో అచ్చట 
ముచ్చటలాడుతూ వనములందు వారు తెచ్చిన 
చద్దిఅన్నము అదరమున ఆరగించితివి 

హితుడవని విశ్వసించి నీ చెంత చేరిన సుధాముని 
చేలమున దాగిన అటుకులు ప్రీతితో గుప్పెడు  స్వీకరించి 
 సిరిసంపదలు అడగకనే అపారముగా ఒసగితివి 

ప్రియసఖుడగు ఫల్గుణి రధసారధివై 
భీష్మద్రోణాది భీకర మకరములతో 
ఉప్పెనలా వచ్చిన కౌరవ సేనా సాగరమును 
ఒడుపుగా దాటించి ఆత్మబంధువై నిలిచివుంటివి 


హితుడవని ఆత్మీయుడవని నమ్మి 
నీ పాద పద్మములు మా హృదిని 
నిలిపితిమి లక్ష్మికిరణుల ఆర్తి నెఱింగి 
ఆప్తుడవై నీ స్నేహ మాధుర్యము రుచి 
చూపవయా గోపీజనవల్లభా గోవిందా 

Saturday, December 21, 2024

ముకుందమాలా స్తోత్రం-10

 

వ్యామోహ ప్రశమౌషదం మునిమనోవృత్తి ప్రవృత్త్యౌషధం
దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనై కౌషధమ్ ।
భక్తాత్యన్తహితౌషధం భవభయప్రధ్వంసనై కౌషధం
శ్రేయఃప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీకృష్ణదివ్యౌషధమ్ ॥ ౨౪ ॥

 వ్యామోహం నుండి చిత్తశాంతి  నొసగు  ఔషధం  

ముని పుంగవుల చిత్త  ఏకాగ్రత నొసగు  ఔషధం

దానవ  చక్రవర్తులను నియంత్రించు  ఔషధం

ముల్లోకాలకు  జీవమొసగు  ఔషధం

భక్తులకు హితమొనర్చు  ఔషధం

సంసార భయాలను తొలగించు  ఔషధం  

శ్రేయస్సు నొసగు  ఔషధం  

ఓ మనసా  ! తనవితీరా  ఆస్వాదించు

శ్రీకృష్ణ  దివ్యౌషధం


ఇదం శరీరం పరిణామపేశలం
పతత్యవశ్యం శ్లధసంధిజర్జరం
కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే
నిరామయం కృష్ణరసాయనం పిబ//

ఈ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది

కండరాలు అరిగి నొప్పికి గురి అవుతాయి

ఏదో ఒకరోజు పండుటాకులా రాలిపోతుంది

ఓ  అమాయకుడా ! నయం చేయలేని నానా రకాల మందుల

వెదుకులాట మానుకో  దివ్యమైన అమృతమయమైన  

శ్రీకృష్ణ  నామౌషధాన్ని  మనసారా  త్రాగుము


కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం

 

కృష్ణుడు జగద్గురువు  కృష్ణుడు  సర్వలోక రక్షకుడు

కనుక ఎల్లప్పుడూ కృష్ణుని పాదాలని ఆశ్రయించేదను  

లోకం లోని మన శత్రువులను నిర్జించి కృష్ణుడు మనలను  

కాపాడును .కృష్ణా  నీకు నమస్కారము

కృష్ణుని నుండే అన్ని  జగములు పుట్టుచున్నవి

జగములన్నియు  క్రిష్ణునిలోనే  ఇమిడియున్నవి

కృష్ణా ! నేను  నీ  దాసుడను

ఎల్లప్పుడూ  నా  రక్షణాభారం వహించు

Friday, December 20, 2024

ముకుందమాలా స్తోత్రం-9

 


తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్
మధు క్షరన్తీవ సతాం ఫలాని ।
ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే
నామాని నారాయణ గోచరాణి ॥ ౩౦ ॥

ఓ  నాలుకా  ! చేతులు  జోడించి వేడుకొనుచుంటిని

తేనే  వలె చవులూరించు పరమ సత్యమైన పలువిధముల 

నారాయణ  నామామృతాన్ని  పదే  పదే  చప్పరించు

మనసుకు ఆహ్లాదాన్ని కలిగించు


నమామి నారాయణపాదపంకజం
కరోమి నారాయణపూజనం సదా ।
వదామి నారాయణనామ నిర్మలం
స్మరామి నారాయణతత్త్వమవ్యయమ్ ॥ ౩౫ ॥

నారాయణా  ! నీ  పాద పంకజమునకు  నా  నమస్సులు

నారాయణా  ! సదా  నీ  పూజలో  పరవశించెదను  

నారాయణా  ! నీ  నిర్మల  నామాలను నిత్యం  స్మరించెదను

నారాయణా  ! నీ  తత్వాన్నే  ధ్యానించెదను  


శ్రీనాథ నారాయణ వాసుదేవ
శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే ।
శ్రీపద్మనాభాచ్యుత కైటభారే
శ్రీరామ పద్మాక్ష హరే మురారే ॥ ౩౬ ॥

అనంత వైకుంఠ ముకుంద కృష్ణ

గోవింద దామోదర మాధవేతి ।
వక్తుం సమర్థోఽపి న వక్తి కశ్చిత్
అహో జనానాం వ్యసనాభిముఖ్యమ్ ॥ ౩౭ ॥

శ్రీనాధా   నారాయణా  వాసుదేవా

శ్రీకృష్ణా  భక్త ప్రియా  చక్రపాణీ 

శ్రీ పద్మనాభ  అచ్యుతా  కైటభారి

శ్రీరామ  పద్మాక్షా  హరీ  మురారీ

 

 అనంతా   గోవర్ధనగిరిధారీ   ముకుందా  

కృష్ణా  గోవిందా  దామోదరా  మాధవా

ఎట్టివారలమైనను ఎ ఒక్క  నామమైనను

స్మరించవచ్చు  కాని  ఏది  స్మరించలేక

 ప్రమాదముల వైపు  పరుగెడుచున్నాము