Monday, May 25, 2009

పాపం aandhrulu


మహా పాపులు ఓ తంతు ముగిసింది. మరోసారి ఆంధ్రులు ద్రుతరాశ్ట్రుడి కౌగిలి లో నలిగి పోనున్నారు మరి ఈ దుస్థితి కి కారణం ముఖ్యం గా ఇద్దరు ఒకరు …. .అమాయకులైన ప్రజలను ప్రాంతీయ భావోద్వేగాలకు గురి చేసి వారి భావోద్రెకాలను పెట్టు బడిగా తన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకున్నవడు మరోకడు….. తనతో ఎటువంటి బన్దుత్వమ్ లేకున్నా, తమ రక్త సంబంధికులకు కూడా ఇవ్వని గౌరవాన్ని ఇస్తూ, తన కోసం ప్రాణాలివ్వటానికి సైతం వెనుకాడని అభిమానుల రక్తాన్ని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినవాడు మార్పు తెస్తా మార్పు తెస్తా నన్టు…….. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకున్నట్లు, సీట్లు అమ్ముకుని రాజకీయాలలో ఎవరు ఊహిన్చని మార్పు తెచ్చిన చీడ పురుగు తెగులు పాకిన్దేమో, వీడిని చూసి , తెలంగానం ఆలపించిన వాడు సైతం…. వేలం గానమాలాపిన్చాడు గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా పోరాడేవాడు ……యోధుడు, నిజమైన సైన్యాధ్యక్షుడు వారిని అనుసరిన్చేవారికి గెలిస్తే రాజ్యం. ఓడితే ….వీర స్వర్గం. అలాకాక, నమ్మి వెంట నడిచేవారి జీవితాలను ఫణమ్ గా పెట్టి, వారి ఆత్మ గౌరవాన్ని వేలం కట్టే వారి వెంట నడిస్తే చివరకు మిగిలేది? అభిమానులు ఆలోచించుకోండి ఇంకా నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న మూర్ఖత్వమ్ విడండి విలువైన మీ జీవితాలను ఇలాంటి వారి కోసం వ్యర్ధమ్ చేసుకోకండి మీ ఉన్నతిని కోరి మీ కోసం తపిన్చే మీ వారి గురించి మాత్రమే ఆలోచించండి

Wednesday, May 20, 2009

వానా కాలం


అప్పటి వరకు భానుని ప్రతాపాగ్ని కి బీటలు వారి బీడు బారిన భూమి తొలకరి జల్లు స్పర్శతో పులకరించి వెలువరించే మట్టి గంధపు వాసన ఆస్వాదించాల్సిందే కానీ , వివరించటం సాధ్యం కాదు నల్లని దట్టమైన నీరుకావి రంగు పంచె కట్టిన వాన దేవుడి పలకరింతకు ప్రతిగా ,
పుడమి కాంత లేత ఆకు పచ్చ చీర తో సోయగాలు చిందిస్తుంది.
అప్పటి వరకు నీలి వర్ణం లో నిర్మలం గా ఉన్న ఆకాశం నల్లని దట్టమైన రంగు లోకి మారి మేఘ గర్జనాలతో పిడుగులు కురిపిస్తుంది
వెలిగి పోతున్న చంద్రుడు నల్ల మబ్బు చాటున దాగిన వేళ మిణుగురల కాంతి దారి చూపుతుంది
ఎండిన గొంతుకతో నోళ్ళు తెరిచిన పిల్ల కాలువలు , బిర బిరా పరుగులు
వరకు బంధు మిత్రులతోను , కళల పోషణ లోను సేద దీరిన రైతన్న తిరిగి వ్యవసాయానికి సిద్దమవుతాడు వారి నాట్ల తో పంట చేలు సందడి గా వుంటాయి
ఆ సందడి సవ్వడి విన్న ఓ సినీ కవి…..ఇలా పాడుకుంటున్నాడు
ఓరి…. ఓరి……. వారి చేలో ఒంగుని చిన్నది నాటేస్తున్టే తొంగి చూసిన సూరీడైనా డన్గై పోతడురో
అంటూ
ఇంటి ముందు కాలువ కట్టిన నీటి ని చూస్తు, కాగితపు పడవలు చేసి వాటి తో పాటుగా మనం ఆ నీటి లో షీకారు కెళితె
ఎంతటి అందమైన వానా కాలపు బాల్యమో కదా
లాహిరి ……….లాహిరి లో
చూరు నుండి కారుతున్న వర్షపు నీటి ధారలను చూస్తు, వేడి వేడి పల్లీలకు కారం అద్దుకు తింటూంటే………
వాహ్ వా ఏమీ రుచి అనరా మైమరచి
ఆకాశపు నుదితి నుండి రాలైన నీటి చుక్క చినదాని కింది పెదవి పై చేరి ముత్యపు చినుకై మురిసిపోతుంది.
సాయంకాలం షీకారు కెళ్ళిన చిన్నది చిన్నవాడు ఒక్కసారిగా వాన జల్లు లో తడిసిపోతే
చెలి శిరము నుండి నాశిక మీదుగా, చిరు గడ్డం చేరి ఒక్క వుదుటన ఎదను తాకుతున్న జలధారలు చినవాడి గుండెల్లో గుబులు రేపుతుంటే,
దూరంగా పడిన పిడుగుపాటుకు చెలి తత్తరపాటూ తో జతగాడి ని హత్తుకుపోతే
పుట్టిన ప్రణయ కావ్యమే
చిట పట చినుకులు పడుతూ వుంటే
చెలికాదే సరసన వుంటే
చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగేడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దోయి.
వడగాడ్పులతో ఉడుకెత్తించిన వేసవినిక పొమ్మంటు
రాబోయే వర్షాకాలానికి రా రమ్మని, రా రారమ్మని ఆహ్వానం పలుకుతూ యెంతటి రొమాంటిక్ కాలమీ వర్షాకాలం
ప్రకృతిని ఆస్వాదించమని భగవంతుడు ఇచ్చాడు
కోరి వినాశనకరం గా మనిషి చేసుకుంటున్నాడు

Saturday, April 25, 2009


క్రిష్ణ ఆ పేరు వినగానే మన కనుల ముందు కదులాడుతుంది ఒక సుందర రూపం.
కనురెప్ప వేయాలంటేనే, అమ్మో అంత కాలం పాటు ఆ రూపాన్ని చూడకుండా వున్డగలమా అని రెప్పపాటు కూడా మరచి చూసేన్త సమ్మోహన రూపం
శిఖీ పిన్ఛ మౌళి
పొడుగైన అందమైన వత్తైన ఉంగరాల జుట్టు దానిపై శోభాయమానంగా రీవీ గా నిలచిన నెమలి పించం
తిరుపతి లడ్డు వలె నోరూరించే తీయని వదనమ్
పద్మపు రెక్కల వంటి ఎర్రని అరచేతి యందు అందమైన వేణువు
నిత్య యవ్వనం తో ఆలరారు , లక్ష్మి కిరణుల పాలి ఘన పారిజాతం ఆ గోపాల కృష్ణుడు.
యవ్వన వతులైన గోపకాన్తలు తమను తాము మరచి ఆ నిత్య యవ్వనుడిని చూసి పరవశించి పోతున్నారు
మురళి రావం అక్కడి వాయువులను తన మదుర తరంగాలతో నింపి వేయగా ఆ గాలిని పీల్చిన గోపకాన్తలు, నాగస్వారానికి నర్తిన్చే నాగుల వలె తపిన్చిపోతున్నారు
అందుకే అన్నమయ్య అంటాడు
అదే చూడరే మోహన రూపం 1 పది కోట్లు గల భావజ రూపం
వెలయగ పదారు వేల మగువలను ! అలమిన ఘన మోహన రూపం

మదన మయూకపు ఈకలతో అలంకరించబడిన కృష్ణ వర్ణపు శిరోజాలు శంఖపు వెనుక భాగాని పోలిన మెడ ను దాటి భుజాల పై వేలాడుతూ మనోజ్ఞంగా ఉన్నాయి.
అహా! ఎంతటి మహద్భగ్యం పశు పక్ష్యాదులు కూడా ఆ పరంధామునకు సేవ చేసి తరించుటకు ఊత్సుకతను ప్రదర్శిస్తున్నాయి.
గోవిందుని స్పర్శతో గోమాతలు పాల ధారలను కురిపిస్తున్నవి
దట్టమైన వానా మబ్బు వర్ణంలో మనోహరం గా ఉన్న కృష్ణుని చూసి పరవశించిన నెమలి తన పించ్ాన్ని బహుకరించింది
నంద కిశోరునికి కస్తూరి మృగం అందమైన తిలకాన్ని అద్ది చరితార్ధమయ్యింది
పూబాలలు సుకుమారుని కంట సీమను ఆక్రమించుకుని సాఫల్యత పొందాయి.
అశ్వాలు కురుక్షేత్ర సంగ్రామం లో ఈ రధ సారధునికి సేవ చేసి తరించాయి
వికసించిన తామర బోలు ముఖారావిందం తో, తీయని నగవులు చిందించు పెదవులతో, ఆనందాన్ని కురిపించు కనులతో కూడిన ఆ బాల కృష్ణుని దివ్య మనోహర రూపం నా హృదయమంతా నిండి వుంది ఓ అల్లరి పిల్ల వాడా ఎన్నడు నా హృదయాన్ని వీడకు

మనస్సు అనే మానస సరోవరమ్లో విరబూసిన కమలం వలె కడు కమనీయమ్ గా ఉంది ఆ కమలనాభుని ముఖార విందం.
నింపారైన నునుపైన ఆయన బుగ్గలు , ఆ సరోవరమ్లో తళుకు మంటున్న అద్డం వలె మెరయుచూ, ఆ సరస్సును అద్దపు ప్రతిబింబం వలె ప్రతిఫలింప చేయుచున్నవి.
ఆ కమలాక్షుని కనులు, పద్మరాగా మణులవోలే, ఒక పెద్ద కమలంలో ఆరవిచ్చిన రెండు చిన్ని కమలాలవలే ఆకర్షించుచున్నవి.
ఆయన ముఖ కమలమన్థా కూడా, వేణువు నుండి వెలువడుచున్న అమృత స్వరాలతో పులకితమై, భక్తుల మనస్సులను, మకరన్దమ్ తేనెటిగలను ఆకర్షించినటుల ఆకర్షిస్తున్నది.
హే కృష్ణా……… విశయవాసనాసక్తిని వీడి, ని పాదపద్మముల దూళి సేవించ మనస్సు కలిగిన వాడనై ని వైపు పరుగులు తీయునటుల చేయవయ్య

పైపైనే సంసార భన్ధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా
నిగమానిగమాన్త వర్ణీత మనోహర రూప
నగరాజధరుడా నారాయణా

Thursday, April 23, 2009


పండు వెన్నెల

చిరు సవ్వడులు చేస్తూ జల జలా పారుతున్న యమున

చన్దురుని కిరణాలు తాకి పసిడి వర్ణం లో మేరుస్తున్న రేణువులతో కూడిన మృదువైన ఇసుక తిన్నెలు

అట్టి అందమైన రాతిరిలో ……ఆ యమునా తీరాన

సకల గుణ రాశి, మదుర సామ్రాజ్యాధిపతి వేల పున్నమి చన్దురుల మరిపించు ముద్దు మోము వాడు

అందరూ పొన్దతగిన వాడు

ఆ మువ్వ గోపాలుడు

తన చుట్టూ నిలిచిన చంచల స్వభావాన్ని కలిగి, తమ కోరికలను కనుల భావాల ద్వారా తక్క మాటల తో వెల్లడి చేయటానికి అశక్తులైన అమాయకపు గోపికలు

వారిపై తాను కూడా శరత్కాలపు చంద్రుని చూపులవన్టి చల్లని ప్రేమ పూర్వక చూపులను ప్రసరిస్తు అదే సమయంలో తన అమృతమయమైన దృక్కులతో క్రిగంట నిత్యం తన వక్షాస్తాలంలో నివసించే ఆ మహా లక్ష్మి ని చూస్తున్న ఆ ముద్దు మోవి వాడు

ఈ లక్ష్మి కిరణుల ముంగిట ముత్యమై నిలచినట్టి వాడు

(లక్ష్మి దేవి ఎల్లప్పుడు శ్రీమన్నారాయణుని తోనే ఉంటుంది. ఆయన క్రొత్త అవతారం ధరించినపుడల్ల తాను కూడా అవతరిస్తూనే వుంటుంది. చివరకు వామానావతారం (బ్రహమాచారి) లో కూడా ఆయన హృదయం లో లక్ష్మి అలానే ఉంది. అందుకే, బలి వద్దకు దానం కోసం వచ్చినపుడు తన వక్షాస్తాలాన్ని జింకా చర్మం తో కప్పివుంచుతాడు. లేకుంటే ఆ తల్లి తన దయాపూర్వక చూపులనుబలి పై ప్రసరింప చేస్తున్నపుడు అతనీనుండీ సంపద దూరం చేయటమ్ సాధ్యం కాదు కదా) (శ్రీ లీలా శుకులు..క్రిష్ణ కర్ణామ్రుతమ్)

Wednesday, April 22, 2009

krishNaa


ప్రియ భగవత్ బందువులారా వేగిరమే రన్డు

ఈ లక్ష్మీ కిరణుల ముద్దు బిడ్డడిని చూడండి

స్వతరుణీమణులైన శ్రీ దేవి , భూదేవి, నీల బృందావనంలో ఉన్న ఆ మురిపాల కృష్ణుడి సమ్మోహన రూపాన్ని చూసి పులకితమైన మనస్సుతో గగన తలమ్ నుండి పారిజాతాలతోను, కోరిన కోరికలు తీర్చే కల్పతరు పుష్పాలతో అర్చిస్తున్నారు

మరో వైపు అమాయకపు పల్లె పడతులు గోపికలు మల్లీ మందారాలు, పున్నాగాలతో ఆ చిన్ని కృష్ణుడిని మున్చెత్తుతున్నరు.

వినండి

ఆ గోపాలుని వేణు నాద తరంగా ధ్వనులను

మనసులోని వ్యాకులతను తొలగించి, ప్రశాన్తతను చేకుర్చు ఆ సుమదుర వేణు గాన తరంగాలు చెవిన sOki

పాలు కుడుచుచున్న లేగదూడలు ఆకలి మరచి, అమ్మను విడచి చిన్ని కిశొరుని చెంతకు ఎలా పరుగులు తీస్తున్నయో

గడ్డి మేయు చున్న పశువులూ అంత కన్నా రుచికరమైన ఆ మదురిమలను గ్రోల వేగిరమే కృష్ణుని చెంతకు పరుగులు తీస్తున్నవి

ఆటపాటలలో నిమగ్నమైన ఆ గోప బాలూరు ఒక్కసారిగా ఆ గాన వాహినిలో తడిసి మైమరచిపోతున్నరు. మలయసమేరమ్ తో పాటుగా మంద్ర స్తాయి లో చెవిన సోకిన వేణుగాన తరంగాలు శరీరాన్ని పులకింప చేయగా, తామున్న స్టితి ని కూడా మరచి గోప కాంతలు జారిపోతున్న దుస్తులతో కొందరు, పుర్తిగాని అలంకరణాలతో కొందరు, చేస్తున్న పనులను అలాగే వదలి ఇంకొందరు కృష్ణుని చేర ఎలా పరుగులు తీస్తున్నరో చుడండి

కోరిన వారికి మొక్షాన్ని, ఆది కోర శక్తి లేని వారాలకు వారికి అవసరమైన ఇహ లోక సౌఖ్యాలను ఇవ్వగల సమర్ధుడు నిరాకారుడైనప్పటికీ, సమ్మోహనకరమైన ఈ అందాల గోప బాలుడిగా నిలచిన లక్ష్మి కిరణుల ముద్దు బిడ్డడికి ప్రణామాలతో

Tuesday, April 14, 2009

పోకిరి ప్రేమ.


పోకిరి ప్రేమ.
కాలేజీ ముగించుకుని రూం కు చేరుకునేసరికి……
రూం లోపల వెలుపల దట్టమైన మేఘా వ్రుతాలు.
ఆకాశం రూం లోకి వచ్చిందా లేక మా రూమే ఆకాశం లోకి ఎగిరిందా చిన్న పాటి సన్ధిగ్దత.
కాసేపు తర్జన భర్జనల్ అనంతరం ఆది సిగరెట్ పొగ అని మా ముక్కులు నిర్ధారించాయి.
అంటే పేకాటరాయుళ్ళ బృందామేదైనా విచ్చేసిందా అనుకుంటూ లోపలికి తొంగి చూస్తె………
ఆశ్చర్యం…………..ఒకే ఒక్కడు……..
కారు మబ్బు వంటి కలరులో వెలిగి పోతూ, గోంగలీ పురుగుల వంటి పెదవుల నడుమ, సుకుమారమైన సిగరెట్టును నిర్ధాక్ష్యణ్యం గా వూదేస్తూ……..
మిడిగుడ్ల వంటి కనులలో అంతులేని విషాద గీతికలు మిటకరిమ్ప చేస్తూ…
సముదాయింపులు, బెదిరింపులతో కారణ మేమిటని, ఆరా తీస్తే
ఎవరో కోమలాంగి తన కాలిజోడు చూపించిందని …………
మాకు నవ్వాగలేదు……..లెక్కించే పనిలో పడ్డామ్……..గజనీ దండయాత్రల్లా ఇది పదునేనిమిదవ సారి……
మన స్తాయి కి పరిమితి ఉంటుంది కానీ మన ఆశలకు కాదుగా….
వాళ్ళేమో పండు వెన్నెలలు……….వీడేమో మిట్ట మద్యాహ్నపు అమావాస్య
వాళ్ళేమో సరస్వతీ పుత్రికలు………..వీడు పరమానందయ్య పరమ శిష్యుడు
వారు కట్లెట్లు కబాబ్లు ……..వీడు కాసులు విదల్చాలన్టే నీటి లోనుండి - బయట పడిన చేప పిల్ల
ప్రేమకు అంతరాలు లేకున్నా, ప్రేమికుడికి వెన్నుముక అయినా వుండాలి కదా ఆది అర్ధ సున్న.
వాడి భాధ చూసిన మిత్రబ్రందం ఎలాగైతేనేమి ఒక గంతకు తగ్గ బొంత ను ఎర్పాటు చేశారు……
ఆది మూన్నళ్ళ ముచ్చటగా మిగిలింది.
పార్టీల పేరుతో పైసలన్ని ఖర్చు కాగా మసిబారిన పెదవులపై నూసి రాల్చె సిగరెట్ పీక మాత్రమే మళ్లీ దిక్కయ్యింది సోగ్గాడె చిన్ని నాయనా ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
రేడియో లో పాట మంద్ర స్తాయిలో వినిపిస్తుంది.
పుండు మీద కారం చల్లుతూ.

Thursday, April 2, 2009

గురు స్థానం


మన జీవన గమనం సాఫీ గా సాగాలంటే ఒక సద్గురువు అవసరం. కానీ నేటి వార్తమాన కాల పరిస్థితుల్లో మనకు సమకాలీనూడైన గురువు లభించటం కల్ల. అయితే సుమారు ఓ వంద సంవత్సారాల క్రితం వరకు అక్కడక్కడ ఇలాంటి గురువులు ఉండేవారు. వారిలో సాయి బాబా లాంటి వారు కొందరు. అయితే ఇలాంటివారిలో మనకు తగ్గ గురువును ఎంచుకోవటం ఎలా ఏ గురువు నివసించిన దివ్య క్షేత్రాన్ని దర్శించినపుడు, మన శరీరం అప్రయత్నంగా గుగుర్పాటుకు గురి అవుతుందో , కంట నీరు ఉబుకుతుందో గొంతు గద్గుదమవుతున్దో అట్టి వారిని మనం గురువులుగా స్వీకరించ వచ్చు. (అయితే ఇలాంటి కొన్ని లక్షణాలు నేటి వార్తమాన కాలపు ఆడంబర స్వాముల ఐశ్వర్యాన్ని చూసినపుడు కూడా కలగవcచు…..జాగురూకత అవసరం.) గురువును ఎంచుకున్న తరువాత ఆ గురువు గారి భోధలను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి అప్పుడే ప్రయోజనమ్ కలుగుతుంది. ఒకసారి బాబా మాటలు కొన్ని మనం మననమ్ చేసుకుంటే…. ఈ ఫకీరు నిజంగా ఇవ్వగలిగిన దానిని ఎవ్వరూ కోరటం లేదు, నా వద్దకు వచ్చి కూడా అందరు చెత్తను కోరుతున్నారు…. ఇది ఆయన ఆవేదన గురువు యొక్క కర్తవ్యం…….జ్ఞానాన్ని భోధించటం……భగవంతుని చేత నిర్దేసింపబడిన మార్గం లో నదవటానికి అవసరమైన సహకారం, భగవంతుని పాదాలు చేరుకోవటానికికావాల్సిన త్రోవా చూపటం. ఇది వదిలేసి, బాబా మాకు ఆది చేయి, ఇది చేయి….నీ పదాలకు వెండి తొడుగు చేయిస్తామ్, నీకు బంగారు కిరీటమ్ పెట్టిస్తాం అంటూ……..ఎన్నెన్నో లంచాలు….. మనం దేవుడికి అంతూ లేని లంచాల ఆశ చుపుతూ, ఇంకో ప్రక్క , రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్టామ్….లంచగొందులు ఎక్కువ అవుతున్నారని. మరోసారి….బాబా తన తోటి వాడిని విమర్శిస్తున్న వ్యక్తి తో వాడి అశుద్దాన్ని నీవేందుకు శుబ్రమ్ చేస్తున్నవని కోప్పడతారు…. ఇది మనం చాలా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయమ్.ఎవరైనా మన పట్ల చెడుగా ప్రవుర్తించినా, లేక మనకు ఇబ్బంది కలిగించినా అతడిని మనం తెగ విమర్శించేస్తూ వుంటాం. అలా చేయటమన్టె అతడు చేసిన తప్పులను మనం కడిగివేస్తున్నట్లు……..బాగా గుర్తుంచుకోండి. బోర్ కొట్టెస్తుందా మళ్ళి మాట్లాడుకుందాం.