పోకిరి ప్రేమ.
కాలేజీ ముగించుకుని రూం కు చేరుకునేసరికి……
రూం లోపల వెలుపల దట్టమైన మేఘా వ్రుతాలు.
ఆకాశం రూం లోకి వచ్చిందా లేక మా రూమే ఆకాశం లోకి ఎగిరిందా చిన్న పాటి సన్ధిగ్దత.
కాసేపు తర్జన భర్జనల్ అనంతరం ఆది సిగరెట్ పొగ అని మా ముక్కులు నిర్ధారించాయి.
అంటే పేకాటరాయుళ్ళ బృందామేదైనా విచ్చేసిందా అనుకుంటూ లోపలికి తొంగి చూస్తె………
ఆశ్చర్యం…………..ఒకే ఒక్కడు……..
కారు మబ్బు వంటి కలరులో వెలిగి పోతూ, గోంగలీ పురుగుల వంటి పెదవుల నడుమ, సుకుమారమైన సిగరెట్టును నిర్ధాక్ష్యణ్యం గా వూదేస్తూ……..
మిడిగుడ్ల వంటి కనులలో అంతులేని విషాద గీతికలు మిటకరిమ్ప చేస్తూ…
సముదాయింపులు, బెదిరింపులతో కారణ మేమిటని, ఆరా తీస్తే
ఎవరో కోమలాంగి తన కాలిజోడు చూపించిందని …………
మాకు నవ్వాగలేదు……..లెక్కించే పనిలో పడ్డామ్……..గజనీ దండయాత్రల్లా ఇది పదునేనిమిదవ సారి……
మన స్తాయి కి పరిమితి ఉంటుంది కానీ మన ఆశలకు కాదుగా….
వాళ్ళేమో పండు వెన్నెలలు……….వీడేమో మిట్ట మద్యాహ్నపు అమావాస్య
వాళ్ళేమో సరస్వతీ పుత్రికలు………..వీడు పరమానందయ్య పరమ శిష్యుడు
వారు కట్లెట్లు కబాబ్లు ……..వీడు కాసులు విదల్చాలన్టే నీటి లోనుండి - బయట పడిన చేప పిల్ల
ప్రేమకు అంతరాలు లేకున్నా, ప్రేమికుడికి వెన్నుముక అయినా వుండాలి కదా ఆది అర్ధ సున్న.
వాడి భాధ చూసిన మిత్రబ్రందం ఎలాగైతేనేమి ఒక గంతకు తగ్గ బొంత ను ఎర్పాటు చేశారు……
ఆది మూన్నళ్ళ ముచ్చటగా మిగిలింది.
పార్టీల పేరుతో పైసలన్ని ఖర్చు కాగా మసిబారిన పెదవులపై నూసి రాల్చె సిగరెట్ పీక మాత్రమే మళ్లీ దిక్కయ్యింది సోగ్గాడె చిన్ని నాయనా ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
రేడియో లో పాట మంద్ర స్తాయిలో వినిపిస్తుంది.
పుండు మీద కారం చల్లుతూ.
No comments:
Post a Comment