Thursday, April 2, 2009

గురు స్థానం


మన జీవన గమనం సాఫీ గా సాగాలంటే ఒక సద్గురువు అవసరం. కానీ నేటి వార్తమాన కాల పరిస్థితుల్లో మనకు సమకాలీనూడైన గురువు లభించటం కల్ల. అయితే సుమారు ఓ వంద సంవత్సారాల క్రితం వరకు అక్కడక్కడ ఇలాంటి గురువులు ఉండేవారు. వారిలో సాయి బాబా లాంటి వారు కొందరు. అయితే ఇలాంటివారిలో మనకు తగ్గ గురువును ఎంచుకోవటం ఎలా ఏ గురువు నివసించిన దివ్య క్షేత్రాన్ని దర్శించినపుడు, మన శరీరం అప్రయత్నంగా గుగుర్పాటుకు గురి అవుతుందో , కంట నీరు ఉబుకుతుందో గొంతు గద్గుదమవుతున్దో అట్టి వారిని మనం గురువులుగా స్వీకరించ వచ్చు. (అయితే ఇలాంటి కొన్ని లక్షణాలు నేటి వార్తమాన కాలపు ఆడంబర స్వాముల ఐశ్వర్యాన్ని చూసినపుడు కూడా కలగవcచు…..జాగురూకత అవసరం.) గురువును ఎంచుకున్న తరువాత ఆ గురువు గారి భోధలను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి అప్పుడే ప్రయోజనమ్ కలుగుతుంది. ఒకసారి బాబా మాటలు కొన్ని మనం మననమ్ చేసుకుంటే…. ఈ ఫకీరు నిజంగా ఇవ్వగలిగిన దానిని ఎవ్వరూ కోరటం లేదు, నా వద్దకు వచ్చి కూడా అందరు చెత్తను కోరుతున్నారు…. ఇది ఆయన ఆవేదన గురువు యొక్క కర్తవ్యం…….జ్ఞానాన్ని భోధించటం……భగవంతుని చేత నిర్దేసింపబడిన మార్గం లో నదవటానికి అవసరమైన సహకారం, భగవంతుని పాదాలు చేరుకోవటానికికావాల్సిన త్రోవా చూపటం. ఇది వదిలేసి, బాబా మాకు ఆది చేయి, ఇది చేయి….నీ పదాలకు వెండి తొడుగు చేయిస్తామ్, నీకు బంగారు కిరీటమ్ పెట్టిస్తాం అంటూ……..ఎన్నెన్నో లంచాలు….. మనం దేవుడికి అంతూ లేని లంచాల ఆశ చుపుతూ, ఇంకో ప్రక్క , రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్టామ్….లంచగొందులు ఎక్కువ అవుతున్నారని. మరోసారి….బాబా తన తోటి వాడిని విమర్శిస్తున్న వ్యక్తి తో వాడి అశుద్దాన్ని నీవేందుకు శుబ్రమ్ చేస్తున్నవని కోప్పడతారు…. ఇది మనం చాలా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయమ్.ఎవరైనా మన పట్ల చెడుగా ప్రవుర్తించినా, లేక మనకు ఇబ్బంది కలిగించినా అతడిని మనం తెగ విమర్శించేస్తూ వుంటాం. అలా చేయటమన్టె అతడు చేసిన తప్పులను మనం కడిగివేస్తున్నట్లు……..బాగా గుర్తుంచుకోండి. బోర్ కొట్టెస్తుందా మళ్ళి మాట్లాడుకుందాం.

1 comment:

Indian Minerva said...

ఇది వదిలేసి, బాబా మాకు ఆది చేయి, ఇది చేయి….నీ పదాలకు వెండి తొడుగు చేయిస్తామ్, నీకు బంగారు కిరీటమ్ పెట్టిస్తాం అంటూ……..ఎన్నెన్నో లంచాలు….. మనం దేవుడికి అంతూ లేని లంచాల ఆశ చుపుతూ, ఇంకో ప్రక్క , రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్టామ్….లంచగొందులు ఎక్కువ అవుతున్నారని