క్రీగంట కామేశ్వరుని కాంచిన కామేశ్వరి మనః స్పందనగా
విఘ్నములు బాప విఘ్నేశ్వరుడివై మనస్సులు రంజింప
సుముఖుడవై చెంత నిలచిన గణపతి మాపై కరుణ తోడ
సిద్ది బుద్దులొసగవె వందనమిదియే మీకు సిద్ది వినాయకా.
మనోవాణి మనోజ్ఞముగా పరుగులెత్తించ నీ పాదద్వయము నా
హృది ని నిలిపితి వాణీ పరవళ్లు తొక్కు క్రిష్ణ వేణి తరంగాల వోలే
భావాల మాలికలు నా మదిలోన పలికించవే మృదు మధుర
మంజుల శార్వాణి మీకిదే మా వందనం తల్లి భారతీ
ఇతరుల తప్పు లెన్నఁబోయిన వేళ వారి చేష్టితముల ప్రేరణ గా
నిన్ను గాంచి విష్ణుమాయా విలాసిని నీ పాదముల నాశ్రయించితి
సహన భూషణము నాకాభరణము చేసి శాంతత నొసగవే మదికి
లక్ష్మీకిరణు ప్రియతనూజా రాజ రాజేశ్వరీమాత శరణు శరణు
ప్రతినింద చేయ వాడి పదములు వాడ మనసు మూలిగే ఉదయ
సంధ్యలో తల్లీ నిన్ను స్తుతించ పేర్చిన అక్షరములనే కూర్పు మార్చి
పలుకుటెంచి శుద్ధ వాక్కు నొసగవే వాగ్వాదినీ ఎల్ల వేళలా
లక్ష్మీకిరణు
ప్రియతనూజా రాజ రాజేశ్వరీమాత శరణు శరణు
పరుల తృప్తే మన ప్రశాంతత కు కారణంబగు ఇతరుల సంతసంబే
మన మానసంబునకు శాంతి నొసగునన్న సత్యంబు నెరిగితి తల్లీ
అత్రి హృదయమే నా హృదయము చేసి లోక క్షేమంబు కోరనెంచవే
లక్ష్మీకిరణు
ప్రియతనూజా రాజ రాజేశ్వరీమాత శరణు శరణు
హృదయ పూదోటలో పూచు భావాల మాలిక మూలం నీవు ఆ
మాలిక నీదు నామాల పరిమళముల తప్ప వేరు వాసనలు వెదజల్ల
నివ్వని భారము నీదే తనువెల్ల తేజోమయమై వెలుగ తనుమధ్యా
లక్ష్మీకిరణు
ప్రియతనూజా రాజ రాజేశ్వరీమాత శరణు శరణు
చెట్టుకు కట్టె నొకరు ప్రకృతిఏ తానైనఁ పరంజ్యోతి ని రాతికి కట్టెనొకరు
జగములనెల్ల దాల్చిన దామోదరుని మా కాయంబుల నిలచిన నిను
మనంబులతో పట్టు నేర్పు నొసగు భారము నీదే మూలాధారైక నిలయా
లక్ష్మీకిరణు
ప్రియతనూజా రాజ రాజేశ్వరీమాత శరణు శరణు
అహంకార రక్కసి నా వివేకమణచి సహజ ప్రేమను
చిదుముతున్నవేళ సమయానికి తగు ఆలోచనల
ఊతమిచ్చి చేదుకొనవే ప్రియంకరీ బంధములు నిలుప
చిదుముతున్నవేళ సమయానికి తగు ఆలోచనల
ఊతమిచ్చి చేదుకొనవే ప్రియంకరీ బంధములు నిలుప
లక్ష్మీకిరణు
ప్రియతనూజా రాజ రాజేశ్వరీమాత శరణు శరణు