Saturday, November 23, 2024
కలల బంధీ
సంసార కూపపు చీకటికొట్టంలొ
నావారలను బంధపు వలువ దాల్చి
భాధ్యత ల సంకెళ్ళలో బంధీనైతీ
మకరి నోట చిక్కిన కరి కి ముక్తి నిచ్చినట్లు
సంసారపు మకరి నొటపడి సతమతమౌ నను
నీ బాహుబంధనాలలో బంధీనై
ఆనందపారవశ్యమున ఓలలాడు గోపిక ను
చేయవయా ముకుందా
నీ కలువ కనుల కొలను లో కమలంలా విరియాలని
తామరల మకరందం గోలు మధుపం లా
నీ అధరసుధలు గ్రోలు గోపితుమ్మెద కావాలని
మల్లియల పరిమళాలు నింపుకుని పరవశించు
పిల్లగాలి తెమ్మెరలా
పారిజాత పరిమళాలతొ ఓప్పారు నీ దేహ సౌరభాన్ని నాతనువెల్లా నిలుపుకునే నీ
గోపికను కావాలని
నీ పెదవుల తీయదనాన్ని నింపుకుని ప్రకృతినెల్ల
పరవశింప చేయు వేణునాద తరంగాల్లా
నా ఆలోచనలన్నీ నీ ఊహల తేనె తుంపరలతో నిండి నా తనువెల్లా వెల్లువలా నీ ప్రేమ మధువులతో నిండాలని
కలల బంధీనై క్రిష్ణా! పగలనక రేయనకా
నీ పిలుపుకై వేచివుంటి
సంసారపు సంకెళ్ళు తెంచి నీ భక్తిపాశాలతో
నను బంధించు అమృతాబ్ధి పుత్రి ప్రియవల్లభా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment