ఆదివారం …జనవరి 3,2010 తెల్లవారుజాము 5.00 గంటలు
హయత్ నగర్
ఆదివారమంటేనే కొంచెం బద్ధకం మనసును ఆవరిస్తుంది
అల్లాంటిది చలిపులి బయట గర్జిస్తుంటే
దుప్పటి ముసుగులో వెచ్చని రక్షణకోరుకునే దేహం అంత తేలికగా
ఎలా బయటకు వస్తుంది
అటుదొర్లి ఇటుదొర్లి ముడుచుకుని మొత్తం మీద లే లేరా వెధవాయ్ అంటూ
అందిస్తూ ………బస్ స్టాండ్ చేరుకొని అప్పటికే కదలటానికి సిద్దం గా వున్న విజయవాడ
బస్ ఎక్కి కూర్చున్న
చలికాలపు ఉదయం ఎక్కడికీ అత్యవసర పయనం
శీతల పవనాలు వణుకు పుట్టిస్తుంటే మనసులో బ్రమిస్తున్న ఆలోచనాతరంగాలు
కాల చక్రాన్ని కొన్ని యేండ్ల వెనుకకు పరిగేట్టిస్తుంది
కొన్ని సంగతులు …………. మనసు పొరల మరుగున పడిపోయిన కొన్ని
సంగతులు గుర్తుకొస్తున్నాయి
ఎప్పుడో 20 సంవత్సరాలకు ముందున్న 6 వసంతాల కాలంలో (1985 to 1990)
పుష్పించిన స్నేహ కుసుమాలను ఏరికుర్చుకునే ప్రయత్నం ఇన్నేళ్ళ తరువాత
చేయటం ….కడు విచిత్రం
ఆ కుసుమాలు మరుగున పడినప్పటికీ వడలకపోవటం బహు విచిత్రం
అలా ఆలోచనలలో మునిగివున్న మనసు కాలచక్రం పరుగెడుతున్న వేగంలో
బస్సు చక్రాన్ని పరుగేట్టించని వాహనచోదకుడిని తిట్టుకుంటూ చుట్టుపరికించి
చూసేసరికి విజయవాడ సరిహద్దుకు చేరుకున్నాం అప్పటికి సమయం మధ్యాహ్నం 12 గంటలు
హమ్మయ్య ….ఇంకో గంటలో గుంటూరు కు చేరుకుంటాం
గుంటూరు …………..నాకెంతో ప్రియమైన వూరు
నా జన్మస్తలం వున్న జిల్లాగానే కాక , నా జీవనగమనంలో అధిక కాలం గడిపిన వూరు …….గుంటూరు
మనం ఎదురుచూస్తున్న ఘడియ రాబోతుందని మురిసే సమయానికే వెంచేస్తాయి వూహించని మలుపులు
అప్పటిదాకా పరుగెడుతున్న బస్సుచక్రం ఒక్కసారిగా ఆగిపోయింది .ఇంకా 10 కి మీ
దూరం వుంది . కనుచూపుకు అందనంత దూరం నుండే వాహనాలు నిలిచిపోయివున్నాయి
వెంటనే గుర్తుకు వచ్చాడు మన్మధుడు
సోనాలి బెంద్రే కోసం నాగార్జున పరుగెత్తిన విధమే ఇప్పుడు మన ముందున్న మార్గం
ఆటోలు తిరిగే ఆవకాశం లేదు . ఎడ్ల బండ్లు సినిమాలకే పరిమితం
ఈదుదామంటే కాలువ లేదు …మనకు ఈత రాదు
మిగిలింది కాలి నడక
వాహనాల బారులను దాటుకుంటూ నారాయణా నాకేమిటీ పరీచ్చ అనుకుంటూ నడుస్తున్నంతలో బహుశా నా ప్రశ్నకు బదులివ్వ దలచాడేమో , ఒక యువకుడు నవ్వుకుంటూ నా పక్కన నిలిచి తన మోపెడ్ మీద చోటిచ్చి చిట్టినగర్ లో దించాడు
(మనకు ఎటువంటి సమస్య ఎదురైనా అందుకు ఇతరులనో లేక మనలనో నిందించుకోకుండా
ఆ నిందేదో నారాయణుడిపై మోపి అంతా మంచే జరుగుతుందని పదే పదే చెప్పుకుంటే
ఆ సమస్య ఖచ్చితంగా 60% పరిష్కారమవుతుంది మనకు మానసిక వత్తిడి తగ్గుతుంది )
సరే అక్కడినుండి గుంటూరు చేరుకొని మన పయనపు ఆఖరి మజిలి చేరుకునే సరికి
సరిగ్గా 2 గంటలు
సుకుమారి నుదుటి మీద సింధూరం లా చక్కని పేరు హోటల్ సింధూరి
చిన్నగా తలుపు తెరచి చూస్తే
ఏమి జరుగుతుందిక్కడ …………అసలేం జరుగుతుంది
తరువాత చెప్పుకుందాం ………కాసేపు
విశ్రాంతి
--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA