పండు వెన్నెల
చిరు సవ్వడులు చేస్తూ జల జలా పారుతున్న యమున
చన్దురుని కిరణాలు తాకి పసిడి వర్ణం లో మేరుస్తున్న రేణువులతో కూడిన మృదువైన ఇసుక తిన్నెలు
అట్టి అందమైన రాతిరిలో ……ఆ యమునా తీరాన
సకల గుణ రాశి, మదుర సామ్రాజ్యాధిపతి వేల పున్నమి చన్దురుల మరిపించు ముద్దు మోము వాడు
అందరూ పొన్దతగిన వాడు
ఆ మువ్వ గోపాలుడు
తన చుట్టూ నిలిచిన చంచల స్వభావాన్ని కలిగి, తమ కోరికలను కనుల భావాల ద్వారా తక్క మాటల తో వెల్లడి చేయటానికి అశక్తులైన అమాయకపు గోపికలు
వారిపై తాను కూడా శరత్కాలపు చంద్రుని చూపులవన్టి చల్లని ప్రేమ పూర్వక చూపులను ప్రసరిస్తు అదే సమయంలో తన అమృతమయమైన దృక్కులతో క్రిగంట నిత్యం తన వక్షాస్తాలంలో నివసించే ఆ మహా లక్ష్మి ని చూస్తున్న ఆ ముద్దు మోవి వాడు
ఈ లక్ష్మి కిరణుల ముంగిట ముత్యమై నిలచినట్టి వాడు
(లక్ష్మి దేవి ఎల్లప్పుడు శ్రీమన్నారాయణుని తోనే ఉంటుంది. ఆయన క్రొత్త అవతారం ధరించినపుడల్ల తాను కూడా అవతరిస్తూనే వుంటుంది. చివరకు వామానావతారం (బ్రహమాచారి) లో కూడా ఆయన హృదయం లో లక్ష్మి అలానే ఉంది. అందుకే, బలి వద్దకు దానం కోసం వచ్చినపుడు తన వక్షాస్తాలాన్ని జింకా చర్మం తో కప్పివుంచుతాడు. లేకుంటే ఆ తల్లి తన దయాపూర్వక చూపులనుబలి పై ప్రసరింప చేస్తున్నపుడు అతనీనుండీ సంపద దూరం చేయటమ్ సాధ్యం కాదు కదా) (శ్రీ లీలా శుకులు..క్రిష్ణ కర్ణామ్రుతమ్)