ఉగాది---------దేవుడు
నూతన వత్సరం. విరోధి నామం…….
సాధారణ జనులకు విరోదులెవ్వరూ
ధర్మం తప్పిన ప్రభువులు……
ఇదేమీ ఖర్మమో తెలుగు ప్రజలకు తమ విరోధులను తామే ఎంపిక చెసుకోవాల్సిన అగత్యం విరోధి నామ సంవత్సరం తొలి
కడు ……… కడ్డూరమ్.
ఈ సమయంలో ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకొమ్మంటే ( అత్యాశ కదూ….అయిన ఈ దేవుడి అభయహస్తం మనలకు వరాలు కురిపిస్తుంటే ఆ దేవుడు ధైర్యం చేయగలడా)
సాహసించి వచ్చి కోరుకొమ్మంటే కొన్ని కోరరాని కోరికలు ……
దేవుడా ఇప్పుడు ఉన్న ధూష్టుదే (ఎవరికైనా నొప్పిగా ఉందా……నిజం నొప్పిగానే ఉంటది ..అదే దాని సహజ న్యాయం) మరల వస్తే
అయ్యా లోకాఢ్యక్షా…….
కొత్తగా మిన్గటానికి వారికి గాని, వారి బకాసుర పుత్ర రత్నాలకు గాని భూములు ఏవీ కనిపించకుండుగాక
పిల్ల కాలువలపై సైతం ప్రాజెక్టులు కట్టవలెనన్న కోరిక కలుగకుండు గాక
నగరాల్లో 24 గంటలు నీటికి బదులు బీరు పంపిణీ చేయవలెనన్న తలంపు రాకుండు గాక
అంతా ఉచితం అంటూ అటు విద్యార్ధులు ఇటు ప్రభుత్వం ఫీజులు కట్టక, ఇప్పటికే విలువలూడిన విద్యారంగపు వలువలూడ దీయకున్దురు గాక
ఓట్ల కోసం ముస్లిం నాయకులు మానవత్వం పై దాడి చేస్తున్నా మూగపోయి చోద్యమ్ చూస్తున్న ఈ నాయకులకు తాము మనుషులకు పుట్టామన్న నిజం గుర్తుండు నటుల చేయుగాక.
సత్యమో అసత్యమో తెలియని విధంగా సాఫీగా సాగుతున్న వ్యాపారాలను పుత్రుల కోసం, అల్లుళ్ల కోసం దిగజార్చ కున్దురు గాక
కోరికాల చిట్టా పెరుగుతుందా…… ..ఇక అడగనులే
దేవుడా ఇక హైటెక్కు ఎక్కువైన బాబు గారు వస్తే
చరిత్ర పాఱాలు నేర్పుతుందని, గతానుభవాల ఆధారం గానే వర్తమానం లో భవిష్యత్ రూపొందించుకోవాలన్న జ్ఞానం ప్రాసాదించు.
కలరు టి వి ల కన్నా కనీస సౌకర్యాల కల్పన ముఖ్యమన్న తెలివిడి ప్రసాదించు
పల్లెలు పచ్చగా, పంట చేలు నిండుగా కళ కళ లాడుతున్నపుడే ప్రజలు సంతోషం గా ఉంటారన్న కనువిప్పూ కలిగించు.
సంక్షేమ పధకాల కన్నా స్వయం ఉపాధి కల్పించటం ముఖ్యమని తెలియచెప్పు
ఇక మూడవది……..వద్దులే బాబు………..
ఏ విధంగా హింసిస్తారో, ఏ రూపమ్ లో దొపిడి చేస్తారో తెలియని దొంగల దెబ్బ కన్నా, తెలిసిన దొంగలే బెటరు
(అయిన అధికారం లోకి రాక ముందే తొటి మానవుల అవయవాల మీద తమ అధికార పునాదులు నిర్మించుకోవటానికి సిద్దపడ్డ వారు…………పదవి లోకి వస్తే……………?)
ఓ దేవుడా……………… అన్నిటికన్నా ముందు ………….
ఉచితం గా తినే తిండి కన్నా , కాయ కష్టం తో సంపాదించుకున్న గంజి నీళ్ళు రుచికరము, ఆరోగ్యప్రదము అన్న గ్రహీంపు నాకెల్లపుడు గుర్తుంచుకొనెట్లు చేయి
ప్రభుత్వాలు ఓట్ల కోసం ప్రవేశ పెట్టిన క్షేమాకారం కానీ సంక్షేమ పధకాల ఉచ్చు లో చిక్కుకుని భవిష్యత్ తరాల వారి బ్రతుకు బన్డలు కానివ్వని ఇంగిత జ్ఞానం నాకు ఇవ్వు.
ఈ నా వేడుకోలు ఈ విరోధి నామ సంవత్సరంలో నాకెవ్వరూ విరోధులను ఇవ్వకుండా చూడూము తండ్రి నారాయణా
No comments:
Post a Comment