Monday, March 23, 2009

evarIme


నేచ్చెలి నుదిటి పై చిరుగాలికి అటునిటు వూగుతున్న నీలి కురులు నాతో వుసులాడ వేగిరమే రమ్మంటున్నవి
శుక్ల పక్షపు నవమి నాటి చంద్రుని బోలు చెలి ఫాల భాగం నులి వెచ్చని పెదవుల స్పర్శ కోరి ఎదురు చూస్తున్నట్లున్నది కలువల వంటి కనులు కోటి భావాలు పలికిస్తూ మనసున మధుర భావనలు రేకెత్తించు చున్నవి
సంపెంగ సువాసనలు వెదజల్లెడు నాశిక నా ఉచ్వాస నిశ్స్వాసలను ద్విగుణికృతం చేస్తున్నది
లేత చిగురుల వంటి చినదాని చెక్కిళ్ళు గులాబీ వర్ణం లో అలరారుతూ హృదయంలో అలజడులు సృష్టిస్తున్నవి.
అలివేణి ఆధారాల పై ఆవిష్కృతమైన చిరు చెమట బిందువులు సూర్య కాంతి సోకి ఆణి ముత్యాల వోలే ఆకర్షించుచున్నవి
అహా! ఎవరీమె
అరుణ కాంతులీనుటూ , మనసులో మల్లెలు పూయిస్తున్న ముద్ద బంతి మోము చూదామని మేలి ముసుగు తొలగించేంతలో
కప్పుకున్న దుప్పటి లాగేస్తూ, ముఖం పై నీళ్ళు చిమ్ముతూ… ఏడు గంటాలయినా ఇంకా నిదుర మత్తు వదలటమ్ లేదా అంటూ…… ఎదురుగా…………………………………………………………………………………………………… …………………………………………………………………………………………………… (పెళ్ళైన వాళ్ళైతే ఒకరు……..పెళ్ళీ కానీ వారైితే…..ఇంకొకరు)pic:www.startrekker.deviantart.com

No comments: