వేడుక తోడ గోపకులమంతయు అద్దిన
రంగుల తో నేలకు దిగివచ్చిన హరివిల్లాయని
ముచ్చటగొలుపు మోముతో హరి కడు విలాసముతో
ఢమ్ ఢమ్ ఢమ్ యనుచు చేసిన ఢమరుక ధ్వనులతో
గోపాంగనల గుండెలు ఝల్లుమన మోములు ఎరుపెక్కే
కంసాదుల గుండెలు దడ దడలాడే మోములు నల్లబడే
ఇంద్రాదుల గుండెలు ఉప్పొంగ మోములు తెల్లబడే
ప్రకృతి కాంత పులకింతలతో ఆకుపచ్చని కాంతులీనే
సంబరపు ధ్వనులతో అంబరం నీలివర్ణపు సొబగులద్దుకునే
ఢమ ఢమ సవ్వడులు సోకి భగభగ లాడు భానుడు పసిడి కాంతుల
సోముడాయే
ఏడు రంగుల పూబాలలు ఎదను విచ్చి సువాసనలు వెదజల్లుతూ
బాల క్రిష్ణుని మురిపించే
జీవితమే రంగులమయం శ్రీరంగపతీ నీవు తోడుంటే

No comments:
Post a Comment