పరుగులెడుతున్నది మధుర ఫలమని
పక్షులు భ్రమింప
పక్షులు భ్రమింప
కదులుచున్నది మకరందపు తుట్టెయా
యని తుమ్మెదలు తృళ్లిపడ
ఈ సుందర కుసుమమే లోకాల పుష్పించేనో
యని పుష్ప బాలలు సిగ్గుచెంద
ఈ సుకుమారుని పాదమెంతటి సుతిమెత్తనో యని
లేలేత గరిక అచ్చెరువొంద
కలువ కనుల సూర్య తేజపు కాంతులీన
బృందావన వీధుల తిరుగాడు ముగ్ధమనోహర
బాలముకుందుని గని ప్రౌఢగోపికల వలువలు
వదులాయే
చిన్ని క్రిష్ణా నీ ఈ రూపం మా హృదిలో స్థిరపడి
కడలి అలల వలే ఎగసిపడే మా చిత్తంబులకు
కుదురుతనం కూర్చుగాక
No comments:
Post a Comment