సకల విద్యాధిదేవతవు వినయభావమున
సాందీపుని శిష్యరికం చేసి గురుబావమునకు
గౌరవమద్దినాడవు
సహాధ్యాయి సుధామునికి సమయానుకూలంగా
సకలైశ్వర్యములిచ్చి వినయపూర్వక విద్య విలువ
తెల్పినాడవు
సమరాంగమున సవ్యసాచి ని కార్యోన్ముఖుని
చేసి గీతాచార్యుడవై జగద్గురువై భాసిల్లినాడవు
సదానందా జీతపు పాఠాలు తప్ప జీవన సారం
నేర్పలేక చదువుల గుడులు బడులు గా మిగిలిపోయే
సద్గురునాథా జగన్నాథా జ్ఞాన జ్యోతులు వెలిగించి
భావితరాల భవిత ను తీర్చిదిద్ద వేగిరమే రమ్ము
పురుషోత్తమా లక్ష్మీకిరణ్ ప్రియభాంధవా
No comments:
Post a Comment