సాగర కన్యకా
నీలి కాంతుల కెరటాల శోభలే
నీ కురుల అల్లికలో చిక్కుకునే
అలల పాల నురగల తెల్లదనమే
నీ పలువరుస మెరుపులై మెరిసే
ఇసుక తిన్నెల మెత్తదనమే
నీ మేని మృదుత్వమై మురిసే
చవులూరించు సాగర ఘోష
నీ కంఠ ధ్వనిలో చేరి మమ్మలరించే
రూపుదాల్చిన సంద్రపు నిత్య చైతన్యమే
నీవు సాగర సౌరభమా
No comments:
Post a Comment