నిరంతర ఆలోచన ప్రవాహములే నీ అలంకారపు
పుష్పమాలికలూ
ఉచ్ఛ్వాస నిశ్వాసములే ముత్తెపు ఊయల పందిరి
మము కప్పిఉంచు మాయ యే నీ పట్టు పీతాంబరములు
కనులను ఆకర్షించు విలాసములే నీ రూప లావణ్యములు
వీనులకు విందు చేయు వాక్ప్రవాహములే నీ మువ్వల సవ్వడులు
కష్టముల కడలియే పాల సముద్రమని
చేయు కర్మలే నీదు సేవలని
మంచి చెడుల వేదన విడచి కలడో లేడో నన్న వూగిసలాట వీడి
ఈ దేహమే బృందావనమని మా మది యే నీదు మందిరమని
నవ ద్వారములే నిను చేరు నవ విధభక్తిమార్గములని భావన చేసి
హృదయ పద్మమే ఆత్మ స్వరూపుడగు రాధాకృష్ణుల ఆసనమని
ఎరుకతోడ నిను కాంచు కనులను ఈ లక్ష్మీకిరణులకొసగి ఊపిరి
తీయు ప్రతిక్షణం ఓ మధుర క్షణం గా అనుభూతి పొందు
అదృష్టమీయవయా సాంద్రానందా సదానందా
No comments:
Post a Comment