పద్మ సరోవర తీరాన కిశోరీ కిశోరులై
విహరించు వేళ పరవశించిన పుడమి
గర్భాన అరుణకాంతులతో విప్పారే
పద్మ సమూహం బొకటి పద్మాక్షి పద్మాక్షులు
వికసిత పద్మ వదనులై చూచుచుండ
కాంచిన మా మది పద్మ వనంబయ్యె
ఓ పద్మనాభ ప్రియా అడుగిడవమ్మా
ఆదరమున పద్మ నయనంబుల వాని తోడుగా
హృదయ మధ్యమున పద్మపత్రంలో
అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు
సదా ధ్యానించు వారలకు సకల భయాలు
తొలగి విష్ణుపదం సన్నిహితమవుతు
యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రౌ ద్విజన్మపదపద్మశరావభూతామ్ ।
తేనాంబుజాక్షచరణాంబుజషట్పదేన
రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ ॥ ౪౦ ॥
నా మిత్రులు జ్ఞాన మూర్తులు
కవిత్వ సామ్రాజ్యంలో రారాజులు
ద్విజోత్తములు (ద్విజన్మవరుడు , పద్మ శరుడు) .
నేను కులశేఖర చక్రవర్తి ని
ఈ పద్య కుసుమాలు పద్మాక్షుని
చరణాంబుజములకు
భక్తి ప్రపత్తులతో సమర్పితం
కుంభేపునర్వసౌజాతం కేరళే చోళపట్టణే ।
కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయే ॥
ఇతి ముకుందమాలా సంపూర్ణా ॥
ఓ హరీ ! ఓ పురుషోత్తమా ! ఓ విష్ణు
నీవు దయా సముద్రుడవు
పాపులకు మరల మరల ఈ భవసాగరమే
గతి అగుచున్నది
నీ దయావర్షం నాపై కురిపించి
నన్ను ఉద్దరించు ముకుందా
క్షీరసాగరతరంగశీకరా –
సారతారకితచారుమూర్తయే ।
భోగిభోగశయనీయశాయినే
మాధవాయ మధువిద్విషే నమః ॥ ౩౯ ॥
పాల కడలిలో అలల తుంపరలు దేహాన్ని తాకుతూ
నీలాకాశాన తారకలు వలె మెరుయుచుండగా
శేషతల్పం మీద సుఖాసీనుడవైన మా
మధుసంహారీ నీకివే నా మనఃపూర్వక ప్రణామములు
అమృతము కన్న మిన్నయగు క్షీరము
దారా వారాకరవరసుతా తే తనూజో విరించిః
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గః ప్రసాదః ।
ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీ తే
మాతా మిత్రం బలరిపుసుతస్త్వయ్యతోఽన్యన్నజానే ॥ ౩౨ ॥
క్షీర సాగరుని కుమార్తె నీ అర్ధాంగి
ముల్లోకాలు సృష్టించు బ్రహ్మ నీ కుమారుడు
నిన్ను గూర్చిన స్తుతులే పవిత్
సకల దేవతా సమూహము నీ సేవక పరివారము
ముక్తి నోసగుటయే నీవు ఆడు ఆట
దేవకీ నీ తల్లి
శత్రువులకు అభేద్యుడగు అర్జును
ఇంత మాత్రమే నాకు తెలుసు ( నీవు తప్ప తెలుసుకోదగినది వేరేది లే
శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాంఛితం పాపినోఽపి ।ఓం నమో నారాయణా అని స్మరించినంత మాత్రాన
పాపులు కూడా ఉద్దరించబడుతున్నా
పూర్వ జన్మలలో ఎన్నడు నారా
చేయకుంటినేమో ఇప్పుడు గర్భావాసపు దుఖాన్ని
భరించవలసివచ్చే
ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితమ్ ।
సమాహితానాం సతతాభయప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీమ్ ॥ ౩౮ ॥
హృదయ మధ్యమున పద్మపత్రంలో
అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు
సదా ధ్యానించు వారలకు సకల భయాలు
తొలగి విష్ణుపదం సన్నిహితమవుతు