గత కాలపు జ్ఞాపకాల దొన్తరలను కదిలిస్తే రాలిపడిన కొన్ని గురుతులు ఇవి ఆది ఒక బాల సన్యాసుల ఆశ్రమం. నాటి గురుకుల విద్యను ఆదర్శంగా చేసుకుని, ఎర్పాటు చేయబడిన
ప్రభుత్వ గురుకులం
ప్రభుత్వ గురుకులం
తాడికొండ……..గుంటూర్ జిల్లా…..అప్పట్లో ఆది పదో తరగతి రాంకుల ఖిల్లా. వూరి చివర కొండ దిగువున, చెట్ల నడుమ ప్రశాంత సదనమ్. ఇవన్ని ఐదో క్లాసు నుండి పదో తరగతి వరకు సాగిన ప్రస్థానం లో కొన్ని జ్ఞాపకాలు. ఆదమరచి నిదుర పోతున్న వేళ, కర్ణకట్టోరమ్గా ఈల వేస్తూ నిద్రా భంగం చేసిన వ్యాయామ పంతులు అనుచరులు
గ్రౌండులో పరుగులు పెట్టించినా కాలం జ్ఞాపకం
గ్రౌండులో పరుగులు పెట్టించినా కాలం జ్ఞాపకం
(ఇప్పుడు ఆ పని వంటికి పట్టిన కొవ్వు చేస్తుంది) క్లాస్ టీచర్ హోదాలో మా సైన్స్ పంతులు, మా డార్మెటరీ కి వచ్చి అందరి మొలతాళ్ళు పట్టిచూసిన జ్ఞాపకం, (తడిగా వున్నయో లేవో అని, స్నానం చేసారో లేదో అని పరీక్ష అన్నమాట…..మొలతాళ్ళూ మాత్రమే తడుపుకున్న రోజులు కొన్ని)
తరువాత అల్పాహారం రోజుకో వెరైటీ….. అపటికిన్కా అధికారులు,నాయకులు అంతగా చెడి పోలేదు…….పదార్ధాలు కమ్మగానే ఉండేవి చపాతీ ఉన్న రోజుల్లో, ఇద్దరు ముగ్గురు పిల్లల సహాయం తీసుకునేవాళ్ళు…దానికి చాలా పోటీ ఎందుకంటే…………..చెప్పాలా ఆది కూడా నేను
ఇక అసెంబ్లీ ముగిసి తరగతి గదుల్లోకి అడుగిడితే నల్ల బోర్డు పై తెల్ల అక్షరాలు వ్రాస్తున్న టీచరు తలపై తొంగి చూస్తున్న నల్ల తాచు కొండ ప్రాంతం కదా….మాతో పాటు, మంద్ర గబ్బాలు, గోధుమ వనె త్రాచులు, ఆరడుగుల జెర్రిగొడ్లు………..అదో భయానక జ్ఞాపకం చీర్ఫుల్ అన్న పదానికి అర్ధం తెలుసుకోమని ఆంగ్ల పంతుళమ్మా ఆజ్ఞ పనామా బ్లేడ్ తో పక్కా వాడిని పర్రున చీరటమ్ అంటూ అర్ధం చెప్పిన మరో ఆంగ్ల పంతులు (ఈ సమాధానం ఆ పంతుళమ్మా గారికి చెబితే ఆ పర్యవసానం.?) సమ్ మెట్ట తామరాస్ ఇన్ ది కొలన్ అంటూ ఆ పంతులు గారి చెణకులు అదో జ్ఞాపకం చదువు దేమున్ది మూలన ఉన్న ముసలమ్మ కూడా చదువుతుంది …శ్రద్ద…. శ్రద్ద ముఖ్యమంటూ వక్కాణించే మరొక పంతులు గారు ఇలా నాడు చదువు నేర్పిన గురువుల గురుతులన్ని పేరు పేరునా జ్ఞాపకం (బంగా రెడ్డి గారు, మోహన రావు గారు, ప్రభాకర రావు గారు, హరి బాబు గారు, వెంగయ్య గారు,డేవిడ్ రాజు గారు,
శాస్త్రి గారు, విజయ లక్ష్మి గారు, రాజేశ్వరి గారు, వెంకట రమణీ గారు,శ్యామా సుందరరావు గారు, వెంకటేశ్వర్లు గారు ఇలా
ఎందరో మహానుభావులు, అందరికి పాదాభివందనాలు)
శాస్త్రి గారు, విజయ లక్ష్మి గారు, రాజేశ్వరి గారు, వెంకట రమణీ గారు,శ్యామా సుందరరావు గారు, వెంకటేశ్వర్లు గారు ఇలా
ఎందరో మహానుభావులు, అందరికి పాదాభివందనాలు)
సశేషం………