Friday, December 13, 2024

ముకుందమాలా స్తోత్రం-4

భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం 
 కథమహమితి చేతో మా స్మ గాః కాతరత్వమ్ । 
 సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా 
 నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యమ్ ॥ ౧౩ ॥  
 దాటశక్యం కాని  సంసార  సాగరం  చూసి 
దిగులు  చెందకు  ఆందోళన  విడుము 
నిర్మల  ఏకాగ్రచిత్తంతో  ధ్యానించు
నరకాసుర సంహారి  నావలా  మారి   
నిన్నావలి  తీరం  చేర్చగలడు  

 తృష్ణాతోయే మదనపవనోద్ధూతమోహోర్మిమాలే 
దారావర్తే తనయసహజగ్రాహసంఘాకులే చ । 
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ 
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ ॥ 

 కోరి  వరించిన  భార్య  తత్ఫల  సంతానం సంపదలనే 
 మూడు  భంధనాలపై  మదనుడిమోహబాణపు   తాకిడికి
   పెంచుకున్న  వ్యామోహంతో జనన , జీవన  మరణాలనే   
మూడు  సరస్సులలో  పలుమార్లుమునకలేస్తున్న   
 నాకు  ముకుందా  నీ   భక్తి  అనే  పడవలో కొద్ది  చోటు  కల్పించు    


పృథ్వీరేణురణుః పయాంసి కణికాః ఫల్గుస్ఫులింగో లఘుః
 తేజో నిశ్శ్వసనం మరుత్ తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః ।
 క్షుద్రా రుద్రపితామహప్రభృతయః కీటాః సమస్తాః సురాః 
దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధిః ॥ ౧౯ ॥ 

 ముకుందా!  నీ  కడగంటి  చూపు తో పృథ్వి  ధూళి  రేణువు  సమమవ్వు అనంత  జలధి  ఒక్క  బిందు  పరిమాణమయ్యే   
బడబాగ్ని  చిన్న   అగ్నికణం  గా  గోచరిస్తుంది ప్రచండమైన  వాయువు  చిరుగాలి  లా  ఆహ్లాదపరుస్తుంది 
 అంచులేరుగని   ఆకాశం  చిన్న  రంధ్రమై  చిక్కపడుతుంది సమస్త  దేవతా  సమూహం  బృంగ  సమూహాలను  మరిపిస్తుంది
 కృష్ణా  సమస్తము  నీ  పాద  ధూళి   లోనే  ఇమిడియున్నది  కదా 

Thursday, December 12, 2024

సాంద్రానంద

 సాంద్రానంద  సదానందా

ఆనందకంద  అరవిందనేత్రా

సుధామ సౌమిత్ర  సదాశివ ప్రియా

అర్జున ప్రియంకర  అరిష్టాఘసుర సంహారా

వేణుగానలోల  వేదవేదాంత విహారా

నవనీత చోర   నరకాసుర సంహారా

విశ్వరూపధర   వృందావన విహారా

నంద నందనా  నీలమేఘ వర్ణుడా

రుక్మిణీ మనోహర  రాసకేళీ వినోద విహారా

నారదాది మునిబృంద వందిత  నగరాజ పుత్రి 
ప్రియ సహోదరా

రామానుజ  రాధారమణా  రాధికా ప్రియా 

గోవర్ధన గిరిధారీ   గోపీ మానస హృదయ విహారీ 

కామరాజ జనక   కాళిందీ శిరో రంగస్థల నాట్యకేళీ విహారీ  

 గోప గోవత్స పరిపాలక   గోవింద నామధారీ 

కరుణాంతరంగా   కుబ్జా సౌందర్య ప్రదాతా 

సాంద్రానందా   లక్ష్మీ కిరణ్ ప్రియనందన శరణు శరణు 

మదన మోహనా

 మదన మోహనా,



స్వామి చరణ కమలములు సోకగనే పులకరించిన పుడమి ,
ఆ మదన మోహనుడిని తన పచ్చని కొంగు  చాటు చూసి పులకించే,
నవ వధువు వలె సిగ్గుతో  చెక్కిలి ఎరుపు ను  దాచి,
సుకుమార సుందర కోమల చరణములు కాపాడుటకై పుడమి తన
ఎదనుఁ చందనము వలె  శీతలము కావించే,
ప్రకృతి దేవి తన పురుషుని చూసి తన యవ్వన పుష్పములు అర్పించే ,
శుక  శారి చిలుకలు స్తవము చేయగా వృందావని పులకించగా
త్రిభంగి తన చరణ  ద్వయముతో భూమాత ను పావనము గావించె.  

Tuesday, December 10, 2024

సప్త శ్లోకీ భగవద్గీత 

 


భగవద్గీతా సారమైన సప్త శ్లోక సంగ్రహం 


ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ |

యఃప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ || 1

భగవానుడు చెప్పుచున్నారు 

పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ, ఓం కారమును జపిస్తూ, శరీరము నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమ గతిని పొందును.


స్థానే హృషీకేశ! తవ ప్రకీర్త్యా, జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, సర్వే సమస్యంతి చ సిద్ధసంఘాః || 2

అర్జునుడు పలికెను : హే హృషీకేశా (ఇంద్రియములకు అధిపతి), సమస్త జగత్తు నిన్ను కీర్తించుచూ ఆనందహర్షములతో ఉన్నది, మరియు నీ పట్ల ప్రేమతో నిండిపొయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుతున్నారు మరియు ఎంతో మంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు.


భగవాన్ ఉవాచ :
సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్ |
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి || 3

సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు.

కవిం పురాణమనుశాసితారమణోరణీయాంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 4

భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు.


ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || 5

వేదములే ఆకులు గా కలిగిన రావి (అశ్వత్థ ) చెట్టు యొక్క 

వేరు భాగం పైకి, శాఖలు కిందకు వేలాడుతూ నిత్యం వృద్ధి 

చెందుతూ చిరాయువు తో వుంటుంది దీనిని అర్ధం చేసుకున్నవారు 

మాత్రమే వేదాలను తెలుసుకొనగలరు 

సర్వస్య చాహం హృది సన్నివిష్టో, మత్తః స్మృతిర్‌జ్ఞానమపోహనంచ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ || 6

నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు విస్మృతి (మర్చిపోవుట) కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదముల అర్థమును తెలిసినవాడను నేనే.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్వై మాత్మానం మత్పరాయణః || 7
ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి.
|| ఇతి శ్రీ మద్భగవద్గీతానూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే సప్తశ్లోకీ గీతా ||

Monday, December 9, 2024

ముకుందమాలా స్తోత్రం-3

చింతయామి హరిమేవ సంతతం
మందమంద హసితాననాంబుజం
నందగోపతనయం పరాత్ పరం
నారదాదిమునివృందవందితమ్ ॥ ౮ ॥

తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం    
 వలే మా  మనస్సులను  రంజింపజేయు   మందస్మిత 
వదనార  విందా   పరమ  సత్యమైనట్టివాడ  నంద గోప తనయా
  నారదాది  మునింద్రులచే  కీర్తించబడు  హరీ  ఎల్లప్పుడూ  
నిన్నే   తలచెదను

కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే.       

శ్రమముషి భుజవీచివ్యాకులేఽగాధమార్గే ।
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్నః ఖేద మద్యత్యజామి ॥ ౯ ॥

నీ  కర  చరణాలనే  పద్మాలతో  నిండి

చల్లని  వెన్నల  బోలు  చూపులను  ప్రసరించు నీ  

చక్షువులే  చేప  పిల్లలుగా  కల  హరిరూపమనే  

సరోవరం లో  కొద్ది  జలాన్ని సేవించి  జీవనయానపు  

బడలిక  నుండి  పూర్తిగా  సేద తీరెదను   


సరసిజనయనే సశంఖచక్రే
మురభిది మా విరమస్వ చిత్త రంతుమ్ ।
సుఖతరమపరం న జాతు జానే
హరిచరణస్మరణామృతేన తుల్యమ్ ॥ ౧౦ ॥

కలువ పూల వంటి  కనులతో , శంఖు చక్రాల  తో  

విరాజిల్లు  మురారి  స్మరణ    ఓ మనసా ! ఎన్నటికి  

మరువకు  అమృతతుల్యమగు  హరి  పాద పద్మాలను  

తలచుటకన్నను  తీయని తలంపు  మరి  లేదు  కదా


మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః
నామీ నః ప్రభవంతి పాపరిపవః స్వామీ నను శ్రీధరః ।
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః ॥ ౧౧ ॥

ఓ  అవివేకపూరితమైన మనసా ! నీ   స్వామి  శ్రీధరుడు  చెంత  నుండగా  

మృత్యువు గూర్చి  నీవొనరించిన  పాపకర్మల ఫలితాన్ని గూర్చిన చింత  ఏల ?.

ఇంకను  ఆలస్యమేల?   తొందరపడు  అత్యంత  సులభుడైన   నారాయణుని 

 పాదాలను నీ  భక్తి  తో  బంధించు  నీ  బంధనాలు  తెంచుకో




భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం
సుతదుహితృకలత్రత్రాణభారార్దితానామ్ ।
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతో నరాణామ్ ॥ ౧౨ ॥

జనన మరణాలనే  రెండు  ఒడ్డుల  కూడిన  సాగరం లో  

వచ్చిపోయే  కెరటాల  వలె  నానా  జన్మల  పాలై

రాగ  ద్వేషాలనే  సుడిగుండంలో  చిక్కుకుని

భార్యా  పుత్రులు , సంపదలనే  వ్యామోహపు  మకరాల

కోరలకు  చిక్కి  చితికిపోతున్న  నాకు  మత్స్యరూపధారి   హరీ  నీవే   దిక్కు . 

దాటశక్యం కాని  సంసార  సాగరం  చూసి

దిగులు  చెందకు  ఆందోళన  విడుము

నిర్మల  ఏకాగ్రచిత్తంతో  ధ్యానించు

నరకాసుర సంహారి  నావలా  మారి  నిన్నావలి  తీరం  చేర్చగలడు

Saturday, December 7, 2024

ముకుందమాల 2

నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్భవ్యం భవతు భగవన్పూర్వకర్మానురూపమ్ ।
ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేఽపి
త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు ॥ ౫ ॥

ఓ  దేవాధి దేవా !
నేనెంత   నిరాసక్తుడైనప్పటికి  పూర్వ కర్మల  వాసనా బలం  చేత
ధర్మాచరణ , భోగ  భాగ్యాల  అనురక్తి  నను  విడకున్నవి 
కాని  నేను  నిన్ను  కోరే  గొప్పదైన  వరం  ఒక్కటే , జన్మ  జన్మలకు
కూడా  ని  చరణారవిన్దాలు   సేవించుకునే  భాగ్యం  కల్పించు

దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామమ్ ।
అవధీరితశారదారవిందౌ
చరణౌ తే మరణేఽపి చింతయామి ॥ ౬ ॥

ఓ  నరకాసుర  సంహార !
 
దివి , భువి  లేక  నరకం  నీవు  నాకు  ప్రసాదించే 
నివాసమేదైనప్పటికిని , మరణ  సమయంలో
శరత్కాలపు  నిర్మల  సరోవరంలో  వికసించిన
నవ  కమలములవంటి  ని  పాదములు  నా  మనో  నేత్రంలో  నిలుపు  చాలు

కృష్ణ త్వదీయపదపంకజపంజరాంతం
అద్యైవ మే విశతు మానసరాజహంసః ।
ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తైః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే ॥ ౭ ॥

కృష్ణా ! నా  మనసనే  సరోవరంలో

 రాజహంసవలె  విహరించు . ప్రాణ దీపం

 కొడగడుతున్నవేళ   కఫావాత పిత్తాలతో  

 నిండిన  జ్ఞానేంద్రియాలు  నిన్నెలా  తలచగలవు

 కనుక  ఇప్పటినుండే  నీ  పాద  పద్మాలను

 నా  హృదయంలో  నిల్పెద

Friday, December 6, 2024

 ॥ ముకుందమాలా స్తోత్రం ॥ (1)

ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే ।



తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్ ॥

శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి
భక్తప్రియేతి భవలుంఠనకోవిదేతి ।
నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి
ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద ॥ ౧ ॥

  ఓ  ముకుందా   
శ్రీవల్లభ  వరదా  భక్తప్రియా  దయాసాగరా
నాధా , జగన్నివాసా , శేషశయనా 
ప్రతి  దినం  అమృతమయమైన  ని  నామాలను
స్మరించు  వివేచన  కలిగించు  

జయతు జయతు దేవో దేవకీనందనోఽయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః ।
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః
జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః ॥ ౨ ॥

దేవకీనందన  దేవాధిదేవ  జయము  జయము
క్రిష్ణా  వృష్టి  వంశ  ప్రదీప  జయము  జయము
నీల మేఘశ్యామ  జయము  జయము
ధర్మ రక్షక  జయము  జయము
 

ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంతమియంతమర్థమ్ ।
అవిస్మృతిస్త్వచ్చరణారవిందే
భవే భవే మేఽస్తు భవత్ప్రసాదాత్ ॥ ౩ ॥

  ఓ  ముకుందా
శిరము  వంచి  ప్రణమిల్లి  మిమ్ములను  యాచిస్తున్నాను     
నా  రాబోవు  జన్మలెట్టివైనను  మి  పాద పద్మములను
మరువకుండునటుల  మి  దయావర్షం  నాపై  అనుగ్రహించుము  

నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతోః
కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుమ్ ।
రమ్యారామామృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతమ్ ॥ ౪ ॥

  ఓ  హరి !
 
కుంభిపాక  నరకములనుండి , జీవితపు  ద్వంద్వముల  నుండి
రక్షించమనో ,
మృదువైన లతల  వంటి  శరీరంతో  కూడిన  రమణీమణుల పొందుకోరి
నిన్ను  ఆశ్రయించలేదు
 చావు  పుట్టుకల  చక్రబంధం  లో  చిక్కుకున్న  నా  మదిలో
జన్మ  జన్మకు  ని   పాదపద్మములు  స్థిరంగా  వుండునట్లు
అనుగ్రహించుము  చాలు