
Monday, February 25, 2013
నిజం నీవు నీడను నేను

Friday, February 15, 2013
హరి హర ! ఓ చిన్న విన్నపం

వినయమనే అమృత బిందువులు నాకు అందించు
హరి
సంసారమనే సముద్రంలో నీవు విహరించు
శాంతం అనే సౌధంలో నన్నుంచు
శివ
నాలోని మదనుడిని నీవు తీసుకో
నీ వైరాగ్య భావన నాకు ఇవ్వు
క్రిష్ణ
నాలోని అరిషడ్ వర్గమనే ఆరు తలల పాముపై నీవు నాట్యమాడు
నీ పాద పద్మముల మకరందం గ్రోలు మనస్సునివ్వు
శంభు:
అమంగళ మగు ఆలోచనలను హరించు
మంగళకరమగు ఆలోచనలను ప్రేరేపించు
ధరణీధర
సకల జీవులలో నిన్నే కాంచు కనులనివ్వు
మా భారం వహించు మమ్మను అనుగ్రహించు
Thursday, February 7, 2013
నీ పాద పద్మముల వైపు నా గమ్యం గమనం
నూనూగు మీసాల నూత్న యవ్వన కాలం నుండి నడి సంధ్యకు కాయం కదిలినా
ఊహల సౌందర్య లోకం నుండి అనుభవాల రాపిడిలో కాయం పండినా
మనసు మాత్రం పచ్చితనం వీడలేదు పుండరీక వరదా !
అలవికాని ఆలోచనలతో సతమతమవుతూ
అందుకోరాని వాటికి ఆరాటపడుతూ
ఉహాలోకంలో విహరిస్తూ వాస్తవంలో నిట్టూరుస్తూ
నీ ఉనికిని మరచి కల్లోల జగత్తులో కాయం కరిగిపోతున్నది అజామిళోద్దారక !
పూల మకరందం కోసం అర్రులు చాచు తుమ్మేదలవలె
దీపపు కాంతుల వైపు పరుగులుతీయు చిమ్మెటల వలే
కాంతా కనకాదులకై పరితపిస్తూ శాంతిని విడచి విలపిస్తూ
పట్టవలసిన నీ పాదాలు పట్టలేక పతిత తీరాల వైపు పయనిస్తున్నది పురుషోత్తమా !
ఇంతటి కారు చీకటిలో కల్లోల కడలికి ఆవలి వైపున
మిరుమిట్లు గొలిపే ఆశా దీపం వెలిగిపోతున్నది
తరచి తరచి చూచిన మది కాంచెను కనకపు కాంతులతో
లలిత లావణ్య ముగ్ద మనోహరం గా ప్రకాశిస్తున్న నీ పాద పద్మం
భక్తి అనే పడవలో నీ నామమనే తెడ్డు ఊతంగా ఇచ్చి నా గమ్యం గమనం నీ వైపుకు త్రిప్పుకో పద్మ నాభుడా !
Wednesday, February 6, 2013
అజ్ఞాతవాసి అగుపడేనిదిగో నీ ఆనవాలు
Tuesday, January 29, 2013
హే క్రిష్ణా
హే క్రిష్ణా నా మనసమనే మడుగులోకి దూకేదెన్నడో
కాముడనే కాళిందిని మదించుటెప్పుడొ
కాలం కాయం కరిగిపోతున్నవి కాని
నా మనసు మాత్రం
నీ పాదాలను పట్టలేకున్నది
నీవు నిత్యమూ సత్యము అన్న నిజం తెలిసిన అలుసేమో నీ పట్ల
ఇవి తాత్కాలికము అశాశ్వతము అనే భయమూ
పొతే దొరకవేమొనన్నా బెంగ
నిన్ను ఇప్పుడు కాకపొతే ఇంకేపుడైనా పట్టుకొవచ్చులేనన్న అలసత్వం
ఆనందానికి ఆనందపు బ్రాంతి కి తేడా తెలుసుకోలేని మూర్ఖత్వం
నీ పాదపద్మపు మకరందం గ్రోలలేని నిస్సార జీవన గమనం లోకి నన్ను నేట్టివేస్తున్నవి
క్రిష్ణా
నీవు మాత్రం నీ దయావర్షాన్ని నాపై కురిపించాటాన్ని వాయిదా వేయబోకు
వెన్నుకు దన్నుగా నిలచిన నీ చైతన్యాన్ని హృదయాన్ని తాకకుండా
హృదయ పద్మం వికసించకుండా చేయటంలో కామ సర్పం సఫలమైతే
దాని నల్లని గరళం శరీరమంతా వ్యాపించకుండా నల్లనయ్య పాదాలను పట్టుకోవటంలో బుద్ధి విఫలమైనది
వ్యాధులతో శరీరం వ్యాకులతతో మనసు సతమతమవుతున్నా
మాయతో కప్పబడిన బుధ్ధి నిన్ను స్మరించలేకున్నది
నిన్ను వదలి మలిన దేహాలవైపు పరుగులుతీస్తున్నది
మాయకు సోదరుడవు మాయాతీతుడవు
మాయతో కప్పబడిన మా మనస్సనే యమునలో విహరించు మాయను ఛేదించు
ఈ దేహాన్ని బృందావనం చేయి
నీ ప్రేరణతో ఉదరం లో ఉద్భవించే అక్షరాలను పారిజాతాలుగా ధరించు
ఉపిరి లో వేణుగానాలను ఆస్వాదించు
ఉచ్చ్వాస నిశ్వాస లలో ఊయల లూగు
నా కంటి పాపలనే కాంతులీను మణులుగా ధరించు
నన్నుద్ధరించు ఉద్దవ బాంధవా
Thursday, December 6, 2012
అజ్ఞాతవాసి
ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు
పలకరింపులనే తొలకరింపులను మాపై
చిలకరింపు ఎదురుచూపులతో ఎండిన
కనుల కోలనులలో కలువలు పూయించు
ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు
తడి తడి తళుకులతో అలరారు లేలేత
చిగురుటాకుల పెదవులపై చిరునవ్వులు
కురిపించు ఆప్తుని ఆదరం లేక అవిసిపోయిన
అధరాలపై ఆనందపు జల్లులు కురిపించు
ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు
జ్ఞాపకాల దొంతరలను కదిలించి తీపి
గురతుల ఆనవాళ్ళను పెకలించి
మోడువారిన గుండె గూటిలో నీ చిలిపి
అల్లరుల చిరుగజ్జెలు మోగించు
ఓ అజ్ఞాతవాసి జ్ఞాతం లోకి పయనించు
చేతిలో చేతిని కలిపి చూపులో చూపుని
నిలిపి నీడను కాను నీలో సగాన్ని
అని నాలో నిలిచిపో
Saturday, November 24, 2012
మాయ
చాలా చిన్న పదం
చాలా లోతైన పదం
అందరికి అనువైన పదం
ఎవ్వరికి అంతుబట్టని పదం
ఎవ్వరు అతీతులు కాని పదం
ఈ జగం లోని జనులందరిచే ఆ జగన్నాటక సూత్రదారి జనార్ధనుడు ఆడించే ఆటకు ఆయువుపట్టు ఈ మాయ
మాయ చేతికి చిక్కని వాళ్ళు మాయకు లొంగని వాళ్ళు లోకం లో లేనే లేరు
కొందరిని రూప లావణ్యాలతోను లో మరికొందరిని సిరి సంపదల రూపంలోనూ ఇంకొందరిని అధికార దర్పం రూపం లోను , ఇలా నానా రకాల జనులను నానా రకాలుగా మోహ పరచి
వారి పలు రకాల వింత చేష్టలను వినోదంగా వీక్షిస్తుందీ మాయ
అంతటి శక్తివంతమైంది ఈ మాయ
అసలు ఇంతకూ ఏమిటి ఈ మాయ ? ఎవరు ఈ మాయ ,
ఈ లోకంలో అత్యంత శక్తివంతులెవ్వరు ......ఇంకెవ్వరు.....నారాయణుడు ........నారాయణి
ఆ నారాయణి అంశ ......మాయ
నారాయణి మరో పేరు దుర్గ మాత
తానే మాయా స్వరూపం కనుక దుర్గమ్మ కను సన్నలలో మాయ చరిస్తూ వుంటుంది
ఆ నారాయణుడికి సోదరిగా బృందావనంలో మహా మాయగా అవతరించింది కనుక ఆ క్రిష్ణునికి విధేయంగా వుంటుంది
సకల శుభదాయకుడు ఆ శివునికి సగమై సర్వమంగళ గా శుభాలు కలిగించేది ఈ దుర్గమ్మ కనుక ఆ మాయ ఈ పరమేష్టిని కూడా చేరదు
కనుక మాయను దాటాలంటే మాయాతీతులైన ఈ మువ్వురి ఆరాధన మనకు తప్పనిసరి .
అందుకే ముఖ్యమైన మాసాలన్ని కుడా హరి హర పూజకు అనువుగా వుంటాయి.
కార్తీకం లో శివ పూజ ఎంతటి విశేషమో దామోదరుడి పూజ కూడా అంతే ఆవశ్యకం
హరిహరులను సేవిద్దాం మాయను చేదిద్దాం
Subscribe to:
Posts (Atom)