Tuesday, January 29, 2013
హే క్రిష్ణా
హే క్రిష్ణా నా మనసమనే మడుగులోకి దూకేదెన్నడో
కాముడనే కాళిందిని మదించుటెప్పుడొ
కాలం కాయం కరిగిపోతున్నవి కాని
నా మనసు మాత్రం నీ పాదాలను పట్టలేకున్నది
నీవు నిత్యమూ సత్యము అన్న నిజం తెలిసిన అలుసేమో నీ పట్ల
ఇవి తాత్కాలికము అశాశ్వతము అనే భయమూ పొతే దొరకవేమొనన్నా బెంగ
నిన్ను ఇప్పుడు కాకపొతే ఇంకేపుడైనా పట్టుకొవచ్చులేనన్న అలసత్వం
ఆనందానికి ఆనందపు బ్రాంతి కి తేడా తెలుసుకోలేని మూర్ఖత్వం
నీ పాదపద్మపు మకరందం గ్రోలలేని నిస్సార జీవన గమనం లోకి నన్ను నేట్టివేస్తున్నవి క్రిష్ణా
నీవు మాత్రం నీ దయావర్షాన్ని నాపై కురిపించాటాన్ని వాయిదా వేయబోకు
వెన్నుకు దన్నుగా నిలచిన నీ చైతన్యాన్ని హృదయాన్ని తాకకుండా
హృదయ పద్మం వికసించకుండా చేయటంలో కామ సర్పం సఫలమైతే
దాని నల్లని గరళం శరీరమంతా వ్యాపించకుండా నల్లనయ్య పాదాలను పట్టుకోవటంలో బుద్ధి విఫలమైనది
వ్యాధులతో శరీరం వ్యాకులతతో మనసు సతమతమవుతున్నా
మాయతో కప్పబడిన బుధ్ధి నిన్ను స్మరించలేకున్నది
నిన్ను వదలి మలిన దేహాలవైపు పరుగులుతీస్తున్నది
మాయకు సోదరుడవు మాయాతీతుడవు
మాయతో కప్పబడిన మా మనస్సనే యమునలో విహరించు మాయను ఛేదించు
ఈ దేహాన్ని బృందావనం చేయి నీ ప్రేరణతో ఉదరం లో ఉద్భవించే అక్షరాలను పారిజాతాలుగా ధరించు
ఉపిరి లో వేణుగానాలను ఆస్వాదించు ఉచ్చ్వాస నిశ్వాస లలో ఊయల లూగు
నా కంటి పాపలనే కాంతులీను మణులుగా ధరించు నన్నుద్ధరించు ఉద్దవ బాంధవా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment