Tuesday, September 1, 2009
jIvitam
జీవితం ఈ రోజుల్లో సాధారణంగా అందరి నోట విన బడే భారీ డైలాగ్ .జీవితం బోర్ కొట్టేస్తుందోయ్ ఏమిటో ఈ జీవితం .లేవటం ఆఫీసులకు పరుగెత్తటం ఇంటికి చేరటం ……కంటికి కునుకు పట్టిందనుకునేలోపే తెల్లారటం .మళ్ళి చక్రం మొదలు ఈ రోజంతా భారం గా గడిచిందోయ్ రేపన్న కాస్త సంతోషం ‘గా వుండాలని పెద్ద నిర్ణయం తీసుకుంటాం ఈ లోపు ఆ రేపు రాను వస్తుంది పోను పోతుంది కోరుకున్న సంతోషం మాత్రం కనుచూపుమేరలో కానరాదు నిజానికి ప్రతి మనిషి కోరుకునేది సంతోషం . అది ఎంత మంది పొందగలుగుతున్నారు చెప్పటం కష్టమే నాకు డబ్బుల్లేవ్ కాని వుంటే చాలా సంతోషం గా గడిపేవాడిని చాలా అమాయకపు మాట అంబాని సోదరులను తీసుకోండి .డబ్బు కుప్పలు గా మూలుగుతుంది తమ్ముడిని ఎదగనియకుండా ఎలా అడ్డుకోవాలో అని నిరంతరం అన్న ఆలోచన అన్న ఎప్పుడు ఎ విధం గా దెబ్బ తీస్తాడో తమ్ముడి తంటాలు ఆనందం అంటే వీక్ఎండ్ మందు పార్టీ లలోను , అవకాసమున్నంతకాలం విచ్చలవిడి జీవితాన్ని గడిపి తరువాత ప్రేమ గా పలుకరించేవారు కరువై మానసికం గా ఒంటరి గా మారి విషాదాంతాలు తెచ్చుకోవటం కాదు అందరికి కనువిప్పు మైఖేల్ జాక్సన్ ………కుప్పలు తెప్పలుగా సంపద , జనాల్లో పేరు కాని వ్యక్తిగతజీవితమ్ …అబ్బో పరమ దారుణం .శరీరం శిధిలమై , ఒక్క ముద్దా కడుపార తినలేక మరి ఆనందం అంటే ..సత్యాన్ని గ్రహించటం ……నిత్యమైన సత్యం కోసం అన్వేషించటం మనం గడిపే జీవితాన్ని ఒకసారి పరిశిలించి చూడండి …..మన చుట్టూ వున్న జీవజాలానికి మనకు ఎమన్నా తేడా వుందేమో వుంది ఒక్కటే ……..మనం వుండటానికి సిమెంట్ గోడలు , నాలుగు మెతుకుల కోసం పరుల వద్ద సేవ, బాంక్ బాలన్సులు వాటికి రేపటి ఆలోచన లేదు …….ఎక్కడ వీలైతే అక్కడ తలదాచుకుంటాయి వాటికి నిర్దేశించిన జీవితాన్ని క్రమం తప్పకుండా గడుపుతాయి . సమయం వచ్చినపుడే సంభోగిస్తాయి మనం ఎప్పుడు సంపాదన కోసం , ఇంద్రియ సుఖాల కోసం , ఆకలి తీర్చుకోవటం కోసం ..వీటికోసమే జీవిస్తున్నాం .కాకపొతే ఎవరికి చేతనైన పని వారు చేస్తున్నారు మరి మనం పశు పక్ష్యాదులకన్న ఎ విధం గా గొప్ప ఇలాంటి జీవితం లో ఆనందం ఎక్కడ దొరుకుతుంది అందుకే మానవ జన్మ పరమార్ధమైన సత్యాన్వేషణ చేసే వారే ఆనందపు అంచులు చూడగలరు సత్యం అంటే భగవంతుడు ………. ఆయన గూర్చి అన్వేషణ , ఆయన గాధలు వినటం ఆయన నామాన్ని నిత్యం స్మరించటం , ఆయన గుణాలను కిర్తించటం భగవంతుని సాలోక్య , సారూప్య , సామీప్య , సాయుజ్యాన్ని పొందటానికి ప్రయత్నించటం అదే మనిషి కర్తవ్యమ్ . అదే నిజమైన ఆనందానుభూతి ని అందించే గొప్ప మార్గం సత్యాన్ని అన్వేషించాతానికి గురువు తోడు అవసరం అయితే ఈ రోజుల్లో .గురువుల పేరిట మనిషి బలహినతలతో ఆడుకునే మాయగాళ్ళు అధికమైపోయారు . కనుక సద్గురువును పట్టుకోవటం మనవల్ల కాదు కనుక చక్కగా భగవంతుని గుణగణాలను మనోహరం గా వర్నిచిన పోతన భాగవతం , మహా భారతం రామాయణాలను రోజు ఒక 10 నిమిషాలు చదవటం , అన్నమయ్య , రామదాసు వంటి మహానుభావుల కీర్తనలు ఒక్కటైనా మనకు చేతనైన విధంగా పాడుకోవటం , మన నాలుక తేలిగ్గా పట్టుకోగల భగవన్నామం ఏదైనా ఒకటి ఎంచుకుని పదే పదే దానిని స్మరించటం రోజు వారి క్రమబద్దం గా చేస్తుంటే అప్పుడు మాత్రమే ఆనందపు అసలు రుచి చూడగలరు . లేకుంటే మేము చాలా ఆనదంగా వున్నమన్న భ్రమలో పాతాళానికి దిగాజారిపోగలం ఆలోచించుకోండి .ఎవరి జీవన విధానం వారిది కాదనగల వారెవ్వరూ
Thursday, August 13, 2009
భువన మోహన
భువన మోహన
ఆకాశం నుండి జాలు వారుచున్న పూల ధార వలె , శివుని వింటి నుండి దూసుకు వస్తున్న బాణ పరంపరవలె మదనుని చెరకు వింటిని తలపింపచేయు కనుబోమలతో అర్ధ నిమీలిత నేత్రాలనుండి ఎడతెరపి లేని , ప్రేమతో నిండిన , చీకట్లు తొలగితే తమను వీడిపోతాడన్న భయం తక్క మరే బెరుకు లేని నిశితమైన చూపులతో ఆ గోపకాంతలు ఆ జగన్మోహనా కారుడి సౌందర్య మధువును ఆస్వాదిస్తున్నారు . ఎర్రని దొండపండు వంటి , తేనెలూరు పెదవుల నుండి వెలువడుచున్న కాంతితో వెలుగుచున్న ఆ కృష్ణుని ముఖ సౌందర్యం చూపులను ప్రక్కకు తిప్పనీయకున్నది ఎర్ర తామర రెక్కలను పోలిన అరచేతులలో వున్న వేణువు , పెదవుల తీయదనాన్ని తన వేణుగాన తరంగాలలో నింపుకుని కర్ణ పుటాలను సోకి మనసులో మదుర భావనలు రేకెత్తిన్చుచున్నది గోపికల నుదుటి కుంకుమతో నిండిన కృష్ణుని దేహం అరుణ వర్ణపు భానుని వలె శోబిల్లుతుంది . భహుశా ఇట్టి లోకైక నిత్య సత్య సౌందర్యాన్ని చూచే కాబోలు రుక్మిణి ఇలా భావించింది .
ప్రాణేస ని మంజు భాషణలు వినలేని
రంద్రముల కలిమి యేల !
పురుష రత్నమా ! నీవు భోగింపగా లేని
తనులత వలని సౌందర్యమేల
మోహన ! నిన్ను పొడగానగా లేని
చక్షురింద్రియముల సత్వమేల !
దయిత ! ని యధరామృతం బానగా లేని
జిహ్వకు ఫల రస సిద్ది యేల !
నీరజాత నయన ! ని వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణమేల !
ధన్య చరిత ! నీకు దాస్యంబు సేయని
జన్మ యేల ? ఎన్ని జన్మములకు ?
(పోతన భాగవతం )
Wednesday, July 15, 2009
aarOgya sUtram
అందుకోసం ఒక పని చేద్దాం ప్రతి రోజు ఉదయం ప్రశాంతం గా విష్ణు ధ్యానం లో గడుపుదాము ఈ విధంగా ధ్యానం చేద్దాం మన దేహం లో 70 శాతం నీరే వుంటుంది నీరు నారాయణుని వీర్యం నుండి ఉద్భవించింది వీర్యం తేజో వంతమైనది , చైతన్య స్వరూపం అందుకే నీరు మనకు ప్రాణాధారమైనది (మనలో చెడు భావాలు , కోపోద్రేకాలు వచ్చినపుడు కొన్ని రకాల ఆమ్లాలు (రసాయనాలు ) ప్రేరేపితమవుతాయి అవే మన శరీరం లో పేరుకుని రోగకారక క్రిమి ఉత్పాదనకు కారణమవుతాయి కనుక రోగాలు రాకుదదంటే మనం మన ఆలోచనలు నియంత్రించుకోవాలి . అది కుదరదు కనుక ఈ చిట్కాలు పాటిద్దాం ) ప్రళయకాలం లో వటపత్ర సాయి గా సమస్త లోకాన్ని రక్షించే నారాయణుని మనసులో భావన చేసుకుందాం ఎ విధంగా అంటే మర్రి ఆకు మీద , చిన్ని శిశువు రూపంలో , నోటి యందు కుడి కాలి బొటన వ్రేలు పెట్టుకుని అమాయకపు చూపులతో వున్న ఆ వెన్న దొంగ రూపాన్ని భావించుకోవాలి ముందు చెప్పుకున్నాం కదా శరీరం అంతా నీటి తో నిండి వుంటుందని కాలి వేళ్ళ నుండి మొదలు పెట్టి తల వెంట్రుకల వరకు , ప్రతి అవయవాన్ని కూడా స్పర్శిస్తూ మర్రి ఆకు అనే తెప్ప మీద శిశువు రూపం లో వైద్య నారాయణుడు సాగిపోతున్నట్లు , ఆయన స్పర్స తాకిన చోట అంతా పేరుకుపోయిన చెడు అంతా తొలగి , చక్కని ఆరోగ్యవంతమైన భాగం గా మారినట్లు భావన చేయండి ఇలా రోజు క్రమం తప్పకుండా ఒక 15 నిమిషాలు చేయండి ఆరోగ్యం మీ సొంతం అలాగే రోజు , పరగడుపున , ఏదైనా తినటానికి 40 నిమిషాలముందు 4 గ్లాసుల మంచి నీరు త్రాగండి నీరు మీ శరీరం లో పేరుకున్న వ్యర్ధ రసాయనాలు కరిగించి బయటకు నెట్టి వేస్తుంది మరి నీరే నారాయణుడు కదా
Thursday, July 9, 2009
హనుమ వస్తుండు …….అవును నిజం మా ఇంటికి వస్తుండు
Wednesday, June 24, 2009
ప్రేయసీ
ప్రేయసీ (krishna saastri gaari.........krishna paksham nundi)
ప్రేయసీ ప్రేయసీ ప్రియుడనే ప్రేయసీ !
వేయి కన్నులు దాల్చి వెదుకుచున్ననే !
నల్ల మేఘాలలో నాయమా దాగంగ ?
తల్లడిలవో నన్ను తలచి రావో !
మెరుపు వై యోయ్యారి యెరపు వై
యరసి నంతనే మబ్బు తెరల దాగితివా !
తళుకు మని కనిపించి వలపు వెల్లువ ముంచి
వలపించి మాయమై వనట గూర్చితివా !
నల్ల మబ్బుల నింగి నా సౌధ రాజమ్ము
నల్ల మబ్బే ప్రియుడు నన్ను గోరకుమా
ఆడుచును బాడుచును హాయిగా నవ్వుచును
పాడు మేఘాలతో పరుగెత్తే మెరపు