Tuesday, September 1, 2009

jIvitam


జీవితం ఈ రోజుల్లో సాధారణంగా అందరి నోట విన బడే భారీ డైలాగ్ .జీవితం బోర్ కొట్టేస్తుందోయ్ ఏమిటో ఈ జీవితం .లేవటం ఆఫీసులకు పరుగెత్తటం ఇంటికి చేరటం ……కంటికి కునుకు పట్టిందనుకునేలోపే తెల్లారటం .మళ్ళి చక్రం మొదలు ఈ రోజంతా భారం గా గడిచిందోయ్ రేపన్న కాస్త సంతోషం ‘గా వుండాలని పెద్ద నిర్ణయం తీసుకుంటాం ఈ లోపు ఆ రేపు రాను వస్తుంది పోను పోతుంది కోరుకున్న సంతోషం మాత్రం కనుచూపుమేరలో కానరాదు నిజానికి ప్రతి మనిషి కోరుకునేది సంతోషం . అది ఎంత మంది పొందగలుగుతున్నారు చెప్పటం కష్టమే నాకు డబ్బుల్లేవ్ కాని వుంటే చాలా సంతోషం గా గడిపేవాడిని చాలా అమాయకపు మాట అంబాని సోదరులను తీసుకోండి .డబ్బు కుప్పలు గా మూలుగుతుంది తమ్ముడిని ఎదగనియకుండా ఎలా అడ్డుకోవాలో అని నిరంతరం అన్న ఆలోచన అన్న ఎప్పుడు ఎ విధం గా దెబ్బ తీస్తాడో తమ్ముడి తంటాలు ఆనందం అంటే వీక్ఎండ్ మందు పార్టీ లలోను , అవకాసమున్నంతకాలం విచ్చలవిడి జీవితాన్ని గడిపి తరువాత ప్రేమ గా పలుకరించేవారు కరువై మానసికం గా ఒంటరి గా మారి విషాదాంతాలు తెచ్చుకోవటం కాదు అందరికి కనువిప్పు మైఖేల్ జాక్సన్ ………కుప్పలు తెప్పలుగా సంపద , జనాల్లో పేరు కాని వ్యక్తిగతజీవితమ్ …అబ్బో పరమ దారుణం .శరీరం శిధిలమై , ఒక్క ముద్దా కడుపార తినలేక మరి ఆనందం అంటే ..సత్యాన్ని గ్రహించటం ……నిత్యమైన సత్యం కోసం అన్వేషించటం మనం గడిపే జీవితాన్ని ఒకసారి పరిశిలించి చూడండి …..మన చుట్టూ వున్న జీవజాలానికి మనకు ఎమన్నా తేడా వుందేమో వుంది ఒక్కటే ……..మనం వుండటానికి సిమెంట్ గోడలు , నాలుగు మెతుకుల కోసం పరుల వద్ద సేవ, బాంక్ బాలన్సులు వాటికి రేపటి ఆలోచన లేదు …….ఎక్కడ వీలైతే అక్కడ తలదాచుకుంటాయి వాటికి నిర్దేశించిన జీవితాన్ని క్రమం తప్పకుండా గడుపుతాయి . సమయం వచ్చినపుడే సంభోగిస్తాయి మనం ఎప్పుడు సంపాదన కోసం , ఇంద్రియ సుఖాల కోసం , ఆకలి తీర్చుకోవటం కోసం ..వీటికోసమే జీవిస్తున్నాం .కాకపొతే ఎవరికి చేతనైన పని వారు చేస్తున్నారు మరి మనం పశు పక్ష్యాదులకన్న ఎ విధం గా గొప్ప ఇలాంటి జీవితం లో ఆనందం ఎక్కడ దొరుకుతుంది అందుకే మానవ జన్మ పరమార్ధమైన సత్యాన్వేషణ చేసే వారే ఆనందపు అంచులు చూడగలరు సత్యం అంటే భగవంతుడు ………. ఆయన గూర్చి అన్వేషణ , ఆయన గాధలు వినటం ఆయన నామాన్ని నిత్యం స్మరించటం , ఆయన గుణాలను కిర్తించటం భగవంతుని సాలోక్య , సారూప్య , సామీప్య , సాయుజ్యాన్ని పొందటానికి ప్రయత్నించటం అదే మనిషి కర్తవ్యమ్ . అదే నిజమైన ఆనందానుభూతి ని అందించే గొప్ప మార్గం సత్యాన్ని అన్వేషించాతానికి గురువు తోడు అవసరం అయితే ఈ రోజుల్లో .గురువుల పేరిట మనిషి బలహినతలతో ఆడుకునే మాయగాళ్ళు అధికమైపోయారు . కనుక సద్గురువును పట్టుకోవటం మనవల్ల కాదు కనుక చక్కగా భగవంతుని గుణగణాలను మనోహరం గా వర్నిచిన పోతన భాగవతం , మహా భారతం రామాయణాలను రోజు ఒక 10 నిమిషాలు చదవటం , అన్నమయ్య , రామదాసు వంటి మహానుభావుల కీర్తనలు ఒక్కటైనా మనకు చేతనైన విధంగా పాడుకోవటం , మన నాలుక తేలిగ్గా పట్టుకోగల భగవన్నామం ఏదైనా ఒకటి ఎంచుకుని పదే పదే దానిని స్మరించటం రోజు వారి క్రమబద్దం గా చేస్తుంటే అప్పుడు మాత్రమే ఆనందపు అసలు రుచి చూడగలరు . లేకుంటే మేము చాలా ఆనదంగా వున్నమన్న భ్రమలో పాతాళానికి దిగాజారిపోగలం ఆలోచించుకోండి .ఎవరి జీవన విధానం వారిది కాదనగల వారెవ్వరూ

1 comment:

Anonymous said...

the content is good, but it's hard to read, can you please divide into paras and write next time?

నాస్తికుల్లో కూడా జీవితాన్ని ఆందంగా జీవించే వారు ఉంటారు ,మరి వారి ఆనందానికి హేతువేది ? ఆనందం ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో దొరుకుతుంది, కొందరికి మనవ సేవలో, కొందరికి మాధవ సేవలో, నాకు సంగీతంలో, మీకు సాహిత్యంలో దొరకవచు. అది ఏమిటి అనేది తెల్సుకుని, జీవితం ఆఅన్దమ్గా గడపాలి అంటాను నేను, మీకేమైనా అబ్యాన్తరమా ? sorry for typos.