Monday, March 23, 2009

evarIme


నేచ్చెలి నుదిటి పై చిరుగాలికి అటునిటు వూగుతున్న నీలి కురులు నాతో వుసులాడ వేగిరమే రమ్మంటున్నవి
శుక్ల పక్షపు నవమి నాటి చంద్రుని బోలు చెలి ఫాల భాగం నులి వెచ్చని పెదవుల స్పర్శ కోరి ఎదురు చూస్తున్నట్లున్నది కలువల వంటి కనులు కోటి భావాలు పలికిస్తూ మనసున మధుర భావనలు రేకెత్తించు చున్నవి
సంపెంగ సువాసనలు వెదజల్లెడు నాశిక నా ఉచ్వాస నిశ్స్వాసలను ద్విగుణికృతం చేస్తున్నది
లేత చిగురుల వంటి చినదాని చెక్కిళ్ళు గులాబీ వర్ణం లో అలరారుతూ హృదయంలో అలజడులు సృష్టిస్తున్నవి.
అలివేణి ఆధారాల పై ఆవిష్కృతమైన చిరు చెమట బిందువులు సూర్య కాంతి సోకి ఆణి ముత్యాల వోలే ఆకర్షించుచున్నవి
అహా! ఎవరీమె
అరుణ కాంతులీనుటూ , మనసులో మల్లెలు పూయిస్తున్న ముద్ద బంతి మోము చూదామని మేలి ముసుగు తొలగించేంతలో
కప్పుకున్న దుప్పటి లాగేస్తూ, ముఖం పై నీళ్ళు చిమ్ముతూ… ఏడు గంటాలయినా ఇంకా నిదుర మత్తు వదలటమ్ లేదా అంటూ…… ఎదురుగా…………………………………………………………………………………………………… …………………………………………………………………………………………………… (పెళ్ళైన వాళ్ళైతే ఒకరు……..పెళ్ళీ కానీ వారైితే…..ఇంకొకరు)pic:www.startrekker.deviantart.com

Wednesday, March 18, 2009

sOdi


ఒక చిన ఘటన తెలుసుకుందాం.

అందరికి తెలిసినదే…..గజేంద్ర మోక్షం…………

అందమైన పర్వతాల చెంత, మనోహరమైన వనం లో నిర్మలంగా ఉన్న సెలయేటి లో,

తన సుందరమైన గజ భమినులతొ జలకాలకు దిగిన గజారాజు……ఆ సెలయేటి లోని మొసలి నోట చిక్కుటాడు. అప్పటి varaku ఆ గజేన్ద్రునితొ సరస సాల్లపాలు సాగించిన ఆడ ఏనుగులు ప్రాణాలపై తీపితొ గజేండ్రుని వదిలి ఒడ్డుకు చేరుకుని మొసలిథొ గజరాజు సాగిస్తున్న పోరాటాన్ని వేడుకతో వీక్షిస్టుంటారు.

దీనిని చక్కగా నేటి వర్తమాన కాలానికి అన్వయించుకోవచ్చు. మన జీవితం చక్కగా సాగుతున్న రోజుల్లో మన చుట్టూ ఉన్న కోలాహాలం, మనం గడ్డు పరిస్థితుల్లో ఉన్నపుడు కానరాదు.

స్థాన బలిమిథొ విజృుంబిస్తున్న మొసలి తో పోరాడి అలసిన గజరాజు, తన శక్తి కోల్పోయి, అప్పటివరకు తన వారలనుకున్నవారు తనను వీడిపోగా, తాను నమ్ముకున్న శారీరక బలం అక్కరకు రాక పోగా, పూర్వ జన్మ సుకృతం తో వివేకం మదిలో ఉదయించగా ………..

ఇహ పరాంబెరుగా నీవే తప్ప…..అని దీనంగా వెదుకుంటాడు.

ఆ కరి రాజు పూర్వ జన్మలో గొప్ప విష్ణు భక్తుడు కావటం వల్ల, ఆపత్కాళంలో నారాయణా అనగానే నేనున్ననటు పరుగెత్తుకు వచ్చాడు, భక్తికి దాసుదైన జగన్నాధుడు

మరి మనం పిలిస్తే వస్తాడా……..వస్తాడు

మరి అలా రావాలంటే ఏమి చేయాలి………….మనం కూడా అనన్య శరానాగతి చేయాలి.

ఎలా……….

ఉదయం నిదుర లేచి లేవగానే సమస్యల తొరణాలు ఆహ్వానం పలుకుతుంటే వెంకటనాధూనకు పూల మాలాలు సమర్పంచటం ఎలా?

భగవంతుని నమ్మితే, భగవంతుని వాక్యం పై కూడా నమ్మకముంచాలి….

గీత లో కృష్ణుడు చెప్పినది…….. ఒక చక్రం మొత్తం యంత్రాన్ని పని చేయిన్చే విధంగా నేను సర్వ జీవుల హృదయాలలో కొలువుంది, వారి చర్యలను నియంత్రిస్తుంటాను. అంటే మనం చేసే ప్రతి చర్య కూదా, భగవంతూనిచే నిర్దేశిన్చబదినదే,

అలాగే మనం ఎదుర్కునే సమస్యలు కూడా…… కనుక ఆ సమస్యలలనే గుది గుచ్చి పూల మాలగా సమర్పించుకుందాం.

కృష్ణుడు చెప్పాడు….పత్రం, పుష్పం, ఫలం, తోయం యో భక్త్యా సమర్పయామి…..అని

కట్టుకోవటానికి గూదు లేక అద్దె ఇళ్ళల్లొ పొద్దు పుచ్చుతుంటే, చెట్లు పెంచటానికి జాగా ఎక్కడ, ఆకులను అర్పించే తీరికెక్కడ

మూరెదు మల్లెల ధర బారెడు పొడుగునా చెబుతుంటే, ఉన్న కూసింత ఖళి కూడా వదలకుండా అద్దెల కొరకు గదులు నిర్మించే నేటి నగర జీవనంలో…..పూలా ఎక్కడ దొరికేను

ఫలమా……..ముంచుకొస్తున్న విదేశీ ఫుడ్ మోజులో మనమే తినమ్, ఇంకా పెద్దయనకా .కష్టం

జలమా……అసలే రేషానింగ్ మన అవసరాలకే చాలి చాలక ఇంకా ఆ జలధి సాఇ కి కూదాన…

మరి ఎలా

మనలో జనించే చెడు ఆలోచనలనె ఆకులను, అహంకారమనే ఫల సహితంగా

కామా క్రోధ లొభాలనే ఆరు రకాల పువ్వులతో కలిపి, ధు:ఖ మనే జలం చేర్చి సర్వ నిలయునకు సమర్పిద్దామ్. ప్రతిగా వినయ విధేయతలను, ప్రసాన్తతను తీసుకుందాం.

కృష్ణుడు చెప్పాడు….సకల చర అచర జగత్తు మొత్తం…..తానే నిండి యున్నానని.

అంటే , మనలోనూ, మన చుట్టూ ఉన్న వారిలోనూ, మనకు నచ్చని వారిలోనూ మనకు లభిన్చే పొగడ్త ల లోను, మనపై కురిసే విమర్శల జదివాన లోను, మనకు అందే లాభం లోను, మనకు కలిగే సమస్యలోనూ అంతటా ఉన్నది ఆ విస్వాత్మ krishNudE.

ఈ చిన విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోగలిగితే అంతా ఆనందమె.

మన పిల్లలకు ఆహారం అందిస్తూ………తామే యశోదా లమని, తమ చిన్నారి….ఆ నంద గోప బాలుదేనని,

తమ తల్లి తండ్రులకు, అత్త మామాలకు సేవ చేస్తు, సాక్శాత్ ఆ లక్ష్మి నారయణులను వారిలో చూడగలిగితే

తన భర్త, లేక భార్య పై అనురాగ వర్షం కురిపిస్తూ వారిలో రాధ కృష్ణులను చూడ గలిగితే

తమపై విమర్శల వర్షం కురిపిన్చే వారిలోనూ, మనం ఎదుర్కునే సమస్యల లోను మన పాపాలను పెకళిన్చే కరుణాంతరంగుడైన ఉగ్ర నరసింహుని చూద గలిగితే జీవితం….

వడ్డించిన విస్తారాకు వలె కమనీయమ్గా ఉంటుంది

ఆ ఏడు కొండలవాడు మన ఎద లోనే నిత్యం కొలువుంటాడు.
pic:http://startrekker.deviantart.com/art/Temple-trident-95205543

Thursday, March 12, 2009

vesavi


వేసవి………………..అదొక అద్బుతమైన సమయం వణికించె చలి కాలానికి విసిగించే వనాకాలానికి నడుమ ఉడికిస్తూ కూడా వూరిన్చె కాలం ఎన్నెన్నో వైభావాలకు ఆటపట్టు…..ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. వత్సరమంతా చదువుల భారంతో అలసి, వేసవి అనగానే నెల నాళ్ళ ఆటల ఆనందాన్ని , అమ్మమ్మా తాతయ్యల ఆప్యాయతలను వెతుక్కుంటూ పల్లెటూళ్లకు పరుగోఓ…….పరుగు కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ అమ్మమ్మా………అడ్దంకి………….తాతయ్య….తలనొప్పి వంటికి అలుపునివ్వనీ, మనసును సేద తీర్చని వీడియో గేమ్స్ మాయజాలం. వేసవి…… నోరూరించే మామిడి మదుర రసాలు, చల్లని లేలేత తాటి ముంజల రుచి పసందైన పలు రకాల తెలుగు వంటకాల ఘూమ ఘూమలు……… కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ మామిడి మదుర్యమ్ మజా బాటల్స్ లో నక్కింది. తెలుగు ఘుమఘుమలు…..ఇటాలియన్ పిజ్జాల మాటున, ఫ్రెంచ్ ఫ్రిసే వెనుక దాగింది వేసవి మత్తేకించే మల్లెల పరిమళాలు, సిగను మల్లెలు మరువాలతో అలంకరించి తాచు పాముల బుసాల్లు కొట్టే వాలుజడల వయ్యారం కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ మల్లెల పరిమళమ్ ముక్కులనుమండిచే సెంటులో ఆవీరయ్యింది పాపం వాలుజడ తోక తెగి బోసిపోయింది వేసవి పొద్డంటా ఎండ వేడిమికి కమిలిన శరీరాలు…….సాయంకాలం అరుబయట నులక మంచం మీద చల్లగాలికి సేద తీరుతూ, నక్షత్రలను లెక్కీస్తూ కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ ఎండాను భరించలేం……..వాన …..చిరాకు………..చలి అబ్బో పులి ఏ సి చల్లదనం మాటున అటు ఆరోగ్యం ఇటు వాతావరణం అంత కల్తీ వేసవి చక్కని హావా భావాలతో, రాగ బద్దమైన ఆలాపణలతో, చెవులకు ఇంపైన పదాలతో కూడిన పద్య నాటకాలతోనూ, నీతిని చమత్కారాన్ని, విజ్ఞానాన్ని అందించే హరికథ, జానపదాలతో అలరించే వేసవి రాత్రులు కానీ ఇప్పుడు……….మ్మ్మ్మ్ ఎడతెరిపిలేని అత్త కొడ్డళ్ల సేరియళ్ళతొను, పదారూ వయసులో చదువుల చెత్త కన్నా ప్రేమ ఎంతో మిన్న అని ప్రభొడిన్చె చెత్రలతొను,వళ్ళు గగుర్పొడిపించే పాప్ బీట్స్ తోనూ సాగే భయానక కాళరత్రులు.

ఓ మరిచాను………మనం నవ నాగరీకులమ్ కదా!

పాపం పల్లెటూరు……..మన నగరీకతను చూసి తన అమాయకత్వాన్ని తలచుకుని సిగ్గుతో ఎండిపోయింది….వేసవి కదా

Tuesday, December 30, 2008

పాశురం-౧౪,15


భగవత్ సేవ యందు చక్కని ఆసక్తి కలదాన! ఇంటి వెనుక తోట లో, ఎర్ర తామరలు భానును కిరణాల స్పర్శకు వికసిస్తుంటే ఆది చూసిన కలువ బాలలు ముఖం ముడుచుకుంటున్నవి మరి నీవు?

తెల్లని పలు వరుస కలిగి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ తో మెలుగు, లేత పసుపు వర్ణ అంబర ధరులైన వేద విదులు దేవాలయానికి చేరుతున్నారు………దేవ దేవుని సేవకు

మేలుకో ఓ సుకుమారి ! ఓ మాటకారి!

నీవు చేసిన ప్రతిన మరిచావా? నేకు నీవుగా మెల్కొని స్నానాది కార్యక్రమాలకు మమ్ము కొనిపోదునని………..నీవు నిదుర పోతుంటీవా?

తామర ల వంటి కనులు కలవాడు, సుందరమైన బాహువులు కలవాడు, శంఖ, చక్రాలను చేతి యందు ధరించి ఉండే ఆ మాధవుని లీలలను కీర్తిద్దామ్ లేచి రా.



ఓ చిలుక పలుకుల దాన? ఇంకా కునికి పాట్లు ఏల

ఓ పడతులారా! మీ పలుకులతో చిరాకు కలిగించకండి నేను మీ చెంతనే నిలిచాను

తెలివైన దానవే, మాకు ముందే తెలుసు, నీ మాటకారి తనం, నీ చెణుకులు మీరే మాటకారులు,

ఈ వాదనలెందుకు, నేనే మాటకారిని

ఏమిటి ఈ రోజు నే ప్రత్యేకత? ఎందుకు నీవు ఒక్కదానవె వున్నావు? రా త్వరగా మాతో చేరు

కువాలాయపీ:దమ్ అనే మత్త గజాన్ని ఛంపినవాడు, శత్రువుల గర్వమణిచిన వాడు, మాయను లొబరుచుకున్నటువంటి శ్రీకృష్ణుని తేజస్సును కొనియాదదాం మాతో చేరు

Wednesday, December 24, 2008

paasuram10


నామ సంకీర్తన చేయటం ద్వారానే ముక్తి ని ప్రసాదించుటకు దయా సముద్రుడగు

తులసి మాలల్తొ అలంకరించబడిన కిరీటాన్ని ధరించి ఉండే నారాయణుడు సంసిద్దుడైవున్నాడు

అతడే వుకనాదు కుంభకర్ణుని మృత్యు కొరల్లొకి నెట్టివేశాడు

ఓ ప్రియమైన దాన

ఆ కుంభకర్ణుని నిద్ర పందెం లో ఓడించి, గాఢ నిద్ర బహుమతి గా పొందావా తీవ్రమైన మగత నిను

విడకున్నది

మా అందరిలోనూ శిరోరత్నం వంటి దాన

నిదుర మత్తును వదలగొట్టు…….. మేలుకొ…తలుపు తెరు ముసుగు తొలగించు……నోరు తెరచి మాట్లాడు

ఓ అదృష్టవతి!

మాకన్నా ముందుగానే లేచి, వ్రతం కావించి, ఆనంద అనుబూతి పొందుతున్నావా తలుపు తీయవా ? మాతో మాట్లాడవ?

paasuram9


నవ రత్న ఖచితమైన అందాల మేడ లో హంస తూలికా తల్పం మీద , ఆగరు పొగల సువాసన ల నడుమ ఆదమరిచి నిదుర పోతున్న ఓ అత్త కూతురా!

రత్నాలతో తాపడమ్ చేయ బడిన ద్వారాలను తెరుచుకుని బయటకు రా

ఓ అత్తా!

నీవైనను తనను నిదుర లేపు నీ కూతురు మూగ చెవుడు లేక ఏదైన వ్యాధి తో బాధ పడు చున్నదా?

లేక ఎవరైన ద్వారపాలకులు అడ్దాగించుచున్నారా?

మైకం కమ్మి మగతలొ ఉన్నదా?


మహా మాయావి ..... లక్ష్మి వల్లభా................ మాధవా ........... గోవిందా......... దెవలోకాధిపతి........... అంటూ ఆ భగవత్ నామాలను బిగ్గరగా పలుకు అత్తా

ఆ నామ సంకీర్తనామృతం తన చెవిని సోకి మత్తు వదలి, మాయా తలుపులు తెరుచుకుని బయటకు వస్తుంది

Monday, December 22, 2008

పాశురం-8


తూరుపు తెలతెల వారుతుంది. పశువులు గ్రాసం కోసం పచ్చిక బయళ్ళు వైపు గా సాగుతునాయి వ్రతం ఆచరించా లన్న నిశ్చయం తో సాగుతున్న వనితలను, మాతో చేర్చుకుని నీ ముంగిట నిలబడి ఉన్నాము ఓ తీవ్రమైన కోరికలు కలిగిన యువతి, మేలుకో, మాతో చేరు కృష్ణుని గుణ గణాలను కీర్తించటం ద్వారా వ్రతాన్ని ప్రారం భించ టానికి అవసరమైన పరై అనే సాధానాన్ని పొందుదాం. కెశి ని ఖండించటం ద్వారా సంహరించిన వాడు మల్లు లైన, చాణూర, ముష్టికు లను మదిన్చిన వాడు దేవతా సమూహాలకు అధిపతి, దేవ దేవుడు, అగు కృష్ణుని పాదాల వద్దకు చేరి, సేవించటం ప్రారంబిద్దమ్. మన ప్రేమ అభిమానాలు చూసి, గోవిందుడు మనకు అవసరమైన వాటిని సమకూర్చటానికి ఆతృత ప్రదర్శిస్తాడు. సత్వరమే రా, కృష్ణ ప్రేమ కు పాత్రులమవుదాం.