ఓ అమాయకురాల! దిన చర్య లో ఎడబాటు తప్పదని తెలిసి తొలి పోద్దు లో సమూహాల గా చేరిన భరద్వాజ పక్షుల మధుర భాషణలు వినబడటం లేదా పెరుగు చిలకటం లో గోపికల పూలతో అలంకరించబడిన సిగలు గాలికి కదులాడుచు, వెలువరుస్తున్న సువాసనలు నీకు సో కతమ్ లేదా వారి లయ బద్దమైన కదలికలకు, చేతి గాజుల గల గలలు, వారి మెడ లో అలంకరించుకున్న ఆభరణాల సవ్వడులు కలిసి చేస్తున్న గలగల సవ్వడులు మిన్ను మింటు తున్న్నీ చెవిని తాకటమ్ లేదా? శత్రువైన కేశి ని సంహరీంచినవాడు మనను ఉద్దరించటానికి కృష్ణుని రూపంలో అవతరించినవాడ్అయిన ఆ పరమాత్మాను కీర్తిసున్న మధుర ధ్వనులు విన వస్తున్న ఇంకా మేలుకోకుంటీవి తలుపులు తెరు…….ఎన్ని ఆటంకాలు వచ్చినా…….ఆ దివ్య తేజస్సును దర్సిద్దామ్
Monday, December 22, 2008
Friday, December 19, 2008
pasuram5
లీలా మానుష ధారుడైన కృష్ణుని లీలలు అందరినీ ఆనందం లోను ఆశ్చర్యం లోను ముంచుతున్నాయి
భగవత్ తత్వాన్ని అణువణువున నింపుకున్న మధుర కు నాయకుడతడు
నిర్మలమైన యమునా నది ఉత్తుంగ తరంగాలు కృష్ణుని చిహ్నాలు గా నిలిచాయి
గోకులానికి మణి మకూటాయమానమైన వాడు యశోదకు ఆనందం కలిగించటానికి, ఆమె వాత్సల్యమనె పా శానికి తనకు తానుగా కట్టుబడి “దామోదరుని” గా ప్రసిద్దుడైన ఆ పరమాత్మాను ఆశ్రయించి పరిశుద్దుల మవుదాం
ముగ్ద మనోహర కూసుమాలతో అర్చిద్దమ్
చేతులు కైమోడ్చి నమస్కరిదామ్
ఆయన గుణగణాలను కీర్తిద్దాం
మన హృదయాలలో కృష్ణుని నిలుపుకుందాం
ఈ విధం గా చేయటం ద్వారా అగ్ని కీలల కు ప్రత్తి దగ్ధమైన రీతిలో ఇప్పటివరకు మనం చేసిన పాపాలనే కాక, భవిష్యత్ లో మన చర్యల ద్వారా మనకు ప్రాప్తించే పాపాలను కూడా దహించి వెద్దామ్
కనుక వేగిరమే రండు హరి నామ కీర్తన తో తరిద్దాం
Tuesday, December 16, 2008
పాశురం-4
ఓ పర్జన్యా , వరుణుని కి అధినాయకుడా!సాధారణంగా మా పై నీవు చూపించే కృప లో ఎటువంటి లోటు రానీయకుగంభీరం గా కనిపించే సాగర గర్భం లోనికి నీ తీక్షణ కిరణాలను ప్రసరింప చేయినీటిని సంగ్రహించి, వేగం గా , గర్జనలు చేస్తూ ఆకాశం లో చలిస్తు వుంటేనల్లని నీ ఆకారం ఆ శ్రీ మన్నారాయణుని స్పురణ కు తెస్తుంది.ఆజానుభాహువు అయిన కమల గర్భుని కుడి చేతి లోని చక్రపు తేజస్సునుండి వెలువడినచిన్న కాంతి రేఖ మెరుపు గా జగతి ని వెలుగు చిందిస్తుంది.హరి ఎడమ చేతి లోని శంఖం నుండి వెలువడిన మృదువైన శబ్ధమ్ ఉరుము గా మారిలోకాన్ని ఆశ్చర్యంలో ముంచుతుందిఆ శ్రీ రాముని శరమ్ నుండి వెల్లువెత్తిన బాణపు వరద వలేప్రేమ వర్షం ధారలుగా కురుస్తుందిఆ వర్షం లో తడసిన జగతి కొత్త వూ పిరులు పోసుకుంటుందిరండి, మనం కూడా ఆ సంతోషం లో భాగం పంచుకుందాం.
Monday, December 15, 2008
paasuram-2, 3
Pasuram-2,3
పాశురం-2
పాశురం-2
శ్రద్ద గా వినండి ఈ వ్రత నియమాలు తెలుసుకోండి
సూర్యొదయాని కన్నా ముందే స్నానాదికాలు ముగించాలి
సిగను పూలతో సింగారించటం, కనులను రంగులతో తీర్చి దిద్దటం వంటి బాహ్య సౌందర్యపు ఆసక్తి విడిచి భగవంతుని పాదాలపై దృష్టి నిలపాలి
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదు. పరులను పౌరుష వాక్యాలతో నొప్పించటం, నిందించటం చేయరాదు పండితులకు ధన ధాన్యాదులు ఉదారంగా సమర్పించాలి. ప్రముఖులను, వేద వేత్తలను విలువైన కానుకలతో సత్కరించాలి
మన జీవన విధానం ఉన్నత మార్గం లో ఉండేటట్లూ చూసుకోవాలి
పాల కడలి లో శేష శయనుడై విశ్రాంతి నొందుతున్న ఆ దేవ దేవుం పాదాలను స్మరిస్తు చక్కని కీర్తన లతో అలరిద్దాం ఈ మార్గాల ద్వారా, ధు:ఖ భూయిష్టమైన ఈ మాయా ప్రపంచం లో నివసిస్తున్నప్పటికీ, నాటి బృందావనం లోని కృష్ణుని సహచరులవలే అవధులు లేని ఆనందాన్ని సొంతం చేసుకుందాం అందుకు మీరే సాక్షులు
పాశురం-3
మనం అనునిత్యం జగత్ పరిరక్షకుడైన ఆ పరమాత్మ "త్రివిక్రమ" నామాన్ని స్మరిస్తూ , పవిత్ర మార్గ శిర స్నానాలు ఆచరించినట్లయితే శారీరిక, మానసిక రుగ్మతలు తొలగి, పరంధాముని అపార కరుణకు పాత్రులమవుతాము.
అదే సమయం లో సమస్త భూ మండలమంతయు, సస్య శ్యామలమై అక్షయం గా వృద్ది చెందుతూ ఉంటుంది.
పంట చేలు ధాన్యపు కంకులతో కళ కళ లాడుతూ ఉంటాయి నీటిలో చేపల గంతులతోనూ, తామర పుప్పోడుల మకరందాన్ని ఆస్వాదిస్తూ తుమ్మెదలు చేసే ఝూంకారాలతోనూ కుండ ల నిండు గా క్షీర ధారలు కురిపించే పశు గణాలు తోనూ, విర బూ సిన సుమాలతొను, భూ మాత చిరు నవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఈ భూమి సమస్తం మధువు తోనూ, క్షీరం తోనూ నిండి ఉంటుంది
Saturday, December 13, 2008
Friday, December 12, 2008
సర్వం vaasudevam
సర్వం వాసుదేవం మనకు ఇంత మంది దేవుళ్ళా! చిన్ని బుర్ర లో పెద్ద ప్రశ్న. ఎవరిని ఎలా పూజించాలో ................. ఎవరిని వదిలేస్తే........... ఎవరికి కోపమోస్తుందో అనేక అనుమానాలు వేదం ఘోషిస్తుంది ............ భగవానూడొక్కడే ...... నారాయనుడీతడు నరులరా
మరి మిగిలిన వారంతా మనకు అర్ధం కాని ప్రశ్న
మరి జవాబు....... ఆ గోవిందుడే తెలియ చేశాడు ఒక సంఘటన ద్వారా.
శ్రీకృష్ణుడు బృందావనం లో పెరుగుతున్నపుడు రోజు లేగదూడ లను తోలుకుని యమున తీరాన వున్న అడవికి వెళుతుండేవారు తోటి గోప బాలుర తో కలసి. ఒక రోజు అలానే వెళ్ళి, భోజనసమయానికి అందరు కలసి ఒక చోట చేరి తమ తమ ఆహారాన్నీ తీసుకుంటున్న సమయం లో అఘాసురుడు అనే రాక్షసుడు వారిని సంహరించటానికి పెద్ద సర్పాకారం ధరించి నోటిని పెద్ద కొండ గుహ వలె తెరిచి వారిని మ్రింగి వేస్తుంటాడు. అపుడు కృష్ణుడు అతనిని సంహరించి గోప బాలుర ను రక్షిస్తాడు. ఈ సన్నివేశాన్ని, దేవతలందరు గమనిస్తుంటారు. అందరు సంతోషం తో పూల వాన కురిపిస్తారు, ఆది గమనిస్తున్న బ్రహ్మ ఆ నారాయణుని శక్తి ని పరీక్షించాలని , కృష్ణుడు అఘాసురుని సంహరించే సమయం లో గోప బాలుర ను,లేగదూడ లను అపహరించుకు వెళతాడు.
కృష్ణుడు చూసే సమయానికి ఎవరు కనిపించరు. ఆలోచిస్తే, ఇది బ్రహ్మ పని అని అర్ధం అవుతుంది. ఇప్పుడెలా, అపహరించింది సాక్షాత్ బ్రహ్మ దేవుడు వారి రక్షణ భారం తనది. వారి కోసం తల్లులు, లేగదూడ ల కోసం గోవులు ఎదురు చూస్తుంటాయి. వెంటనే కృష్ణుడు తానే ఆ గోప బాలుర గాను, లేగదూడ ల గాను రూపాంతరం చెందుతాడు. అలా ఒక సంవత్సర కాలం గదుస్తుంది. గోకులం లో ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని గుర్తించరు అందరు తమ పిల్లలు సాధారణం గానే ఉన్నట్లు భావిస్తారు కాని కృష్ణ లీలను గుర్తించలెరు. ఈ మాయను చూసిన బ్రహ్మ తన తప్పు తెలుసుకుని, తన దగ్గర వున్న వారందరిని తిరిగి అప్పగిస్తాడు.
దీనిని గమనిస్తే, ఆ వాసు దేవుడే సకల చరా చర జగత్తు మొత్తం నిండి ఉన్నాడని, ఈ సృష్టి ని సక్రమం గ నడిపించటానికి, తానే పంచ భూతాలు గాను, నవ గ్రహాల రూపం లోను, శివ , విష్ణు శక్తి, గణపతి తత్వాలు గాను, ప్రకృతి గాను, సమస్త ప్రాణి కోటి రూపం లోను తనను తాను ఆవిష్కరించుకున్నాడు . ఈ విషయాన్ని అర్ధం చేసుకోగలిగితే సర్వం వాసుదేవమయం.........
అందుకే వేదం చెబుతుంది..................సర్వ దేవతా నమస్కారం కేశవం ప్రతిగఛతి
సర్వం శ్రీకృష్ణార్పణం హరే కృష్ణ
Wednesday, October 1, 2008
షాపింగ్ shopping
సాయం సమయం 6.30 కావస్తుంది………గుండెల్లో దడ దడ ఇంతలో ఆకాశం లో ధట్తంగ కమ్ముకున్న మేఘం …….రక్షిస్తుండిలే అని మినుకు మినుకుమన్న ఆశ…….. వాన పడితే ఏమీ మొక్క మోలుస్తుందా అన్న హుకుం…….. కమ్ముకున్న….కురియని వరుణుడు………వెళ్ళక తప్పని …పరిస్థితి ఏమిటో ఈ వరుణుడు… ఈ మధ్య అందరికి స్త్రీ పక్ష పతమ్ పెరిగిపోతుంది…దీనిని తీవ్రం గా ఖండిస్తున్న. అదిగో కూతావేటు దూరంలో ధఘధగా మెరుపులతో విద్యుల్లథ కాంతులతో మగువల మానస చోరిణి…………..మగవారి పాలిత మానసిక క్షోబినీ…… ముద్డొచ్చే ముద్దబంతుల సమాహారం……..చూద్డమన్న చూడనివ్వనీ ఇంతుల చీరంగం అపూర్వ సోయగాల వస్త్ర లోకం……నిమిషాల్లో జేబులు ఖాళీ చేసే మాయా ప్రపంచం అదే ……………
వస్త్రలత
బహుశా లోనికి వెళ్ళాక టెన్షన్ తో పుట్టే వేడిని challarchataanikaa .అన్నట్లు….ఐస్ క్రీమ్ కోన్ తో సముదాయింపు. సరే అదుగిడామ్ లోనికి…………….బాగుంది………..ఎతుచూసినా…………శిల్ప సుందరీమణులకు వన్నె తెచ్చిన వెలుగు జీలుగుల వస్త్రమాలికలు……….. ఆహ..అని మురిసెంత లోపే………….చూడండి………అన్ని వైపులా……..ఏ షాప్ ముందు డిస్ప్లే లో డ్రెసస్ బాగున్నాయో………ఆ షాప్ లోకి వెలదామ్…………..గాండ్రింపూ.
సిల్క్ డ్రెస్ సౌందర్యమా………..కాటన్ డ్రస్ సౌకర్యమా……….సతీమణి సందిగ్ధత……..
ముందు అసలు ఏదో ఒక షాప్ లోకి వెలదామ్……..పతి దేవుడి వెడ్కోలు….
అబ్బా….అంత తోదరైతే ఎలా మీకు……..అందుకే మా కొలీగ్స్ తో రావాలి…….. మెమైతే 10 షాపులు తిరిగి……….200 రకాల డ్రెస్సులు చూసి……ఆది అలా ఉంది …..ఇది ఇలా ఉంది అని వాటి గూర్చి చెప్పుకుని……….చివరకు ఏమీ కొనకుండా 4 గంటలు కాలక్షేపం చేస్తాం తెలుసా……పెళ్ళాం నిరసన.
అవును, ఇప్పుడు డ్రెస్ ఎందుకు…………ఎలెక్ట్రికల్ రైస్ కుక్కర్ అయితే………అలా పడివుంటది కదా………..నా మొగుడు ఇన్క్రిమెంట్ తో నాకు కొనిచ్చడన్న గుర్తుగా……..ఆలి సరికొత్త ఆలోచన…….
మళ్లీ మొదలు……….మంగళగిరి చెనెతల ప్రపంచం నుండి………..డిజిటల్ షాప్ జాణవులే ……….నేరాజాణావులే…………
రైస్ కుక్కర్ లనుంది సాగిన సందడి……………………వాషింగ్ మెషిన్ తో బ్రైన్ వాష్ చేయటం తో సమాప్తి అయ్యింది………. కుక్కర్ సెలెక్ట్ చేయగానే………….పవర్ కట్………….రాబోయే రోజుల్లో ఆది మనకివ్వబోయే షాక్ లకు ఇండికేషన్. 1200 లతో డ్రెస్ కొనుకుందామని వెళ్ళి 12600 కు డ్రెస్ వాష్ చేసే యంత్రానికి టెండర్ వేయటం ద్వారా ఆ షాపింగ్ ముగిసింది తాత్కాలికంగా…… చివరకు ఏమీ కొన్నాము షోపింగ్ లో……….వెనుతిరిగి చూస్తే……… 2 మిరప బజ్జీ……..2 ఆలు బజ్జీ……………50గ్ర్యామ్స్ జిలెబి
with the inpiration of STAR trekker
(startrekker.rediffiland.com/ )
(startrekker.rediffiland.com/ )
Subscribe to:
Posts (Atom)