Friday, December 19, 2008

pasuram5


లీలా మానుష ధారుడైన కృష్ణుని లీలలు అందరినీ ఆనందం లోను ఆశ్చర్యం లోను ముంచుతున్నాయి

భగవత్ తత్వాన్ని అణువణువున నింపుకున్న మధుర కు నాయకుడతడు

నిర్మలమైన యమునా నది ఉత్తుంగ తరంగాలు కృష్ణుని చిహ్నాలు గా నిలిచాయి

గోకులానికి మణి మకూటాయమానమైన వాడు యశోదకు ఆనందం కలిగించటానికి, ఆమె వాత్సల్యమనె పా శానికి తనకు తానుగా కట్టుబడి “దామోదరుని” గా ప్రసిద్దుడైన ఆ పరమాత్మాను ఆశ్రయించి పరిశుద్దుల మవుదాం

ముగ్ద మనోహర కూసుమాలతో అర్చిద్దమ్

చేతులు కైమోడ్చి నమస్కరిదామ్

ఆయన గుణగణాలను కీర్తిద్దాం

మన హృదయాలలో కృష్ణుని నిలుపుకుందాం

ఈ విధం గా చేయటం ద్వారా అగ్ని కీలల కు ప్రత్తి దగ్ధమైన రీతిలో ఇప్పటివరకు మనం చేసిన పాపాలనే కాక, భవిష్యత్ లో మన చర్యల ద్వారా మనకు ప్రాప్తించే పాపాలను కూడా దహించి వెద్దామ్

కనుక వేగిరమే రండు హరి నామ కీర్తన తో తరిద్దాం

No comments: